
Chris Jordan Spectacular Fielding Denies Six.. టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో క్రిస్ జోర్డాన్ అద్భుతాన్ని కొద్దిలో మిస్ చేసుకున్నాడు. ఫలితంగా ప్రత్యర్థి జట్టుకు సిక్స్ లభించింది. విషయంలోకి వెళితే..ఇన్నింగ్స్ 13వ ఓవర్ ఐదో బంతిని డారిల్ మిచెల్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే లాంగాఫ్‌లో ఉన్న క్రిస్ జోర్డాన్ గాల్లోకి ఎగిరి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో దాదాపు బంతిని అందుకున్నట్లుగానే కనిపించాడు. కానీ పట్టుతప్పిన జోర్డాన్ బౌండరీలైన్ అవతల పడ్డాడు. దీంతో న్యూజిలాండ్‌కు సిక్స్ వచ్చింది.
కాగా న్యూజిలాండ్ ఓపెనర్ డారిల్ మిచెల్ అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో చేసిన ఫీట్ అందరికి గుర్తుండే ఉంటుంది. దాదాపు ఇదే తరహాలో మిచెల్ గాల్లోకి ఎగురుతూ బంతిని ఒంటిచేత్తో అందుకున్నాడు. అయితే పట్టుతప్పి బౌండరీ లైన్‌మీద పడే అవకాశం ఉండడంతో అతను కిందపడేలోపే బంతిని బౌండరీ ఇవతలకు విసిరాడు. అలా జట్టుకు నాలుగు పరుగులు కాపాడాడు. ప్రస్తుతం క్రిస్ జోర్డాన్ ఫీల్డింగ్ మూమెంట్ వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. మరో మిచెల్ అవుదామనుకున్నాడు.. కానీ మిస్ అయింది. అంటూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment