
న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌లో 196 పరుగులతో అదరగొట్టిన భారత డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన... ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. శనివారం విడుదల చేసిన జాబితాలో ఆమె మూడు స్థానాలు ఎగబాకి 751 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలిస్ పెర్రీ (681 పాయింట్లు), మెగ్ లానింగ్ (675 పాయింట్లు) వరుసగా తర్వాతి ర్యాంకుల్లో ఉన్నారు. భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ (669 పాయిం ట్లు) ఐదో స్థానానికి పడిపోయింది. కాగా, పురుషుల విభాగం బ్యాట్స్‌మన్ ర్యాకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment