తానాడిన ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక రికార్డు కొల్లగొడుతూ, అనునిత్యం వార్తల్లో నిలిచే విరాట్ కోహ్లి.. గత కొద్ది రోజులుగా క్రికెటేతర కారణాల చేత హైలైట్ అవుతున్నాడు. ఐపీఎల్-2023లో ఓ పక్క పరుగుల వరద పారిస్తూనే.. వివాదాల కారణంగా వార్తల్లో హెడ్‌లైన్‌గా నిలుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీతో షేక్ హ్యాండ్ వివాదం మొదలుకొని లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్‌తో వాగ్వాదం వరకు కోహ్లి ప్రతి చర్య వివాదాస్పదంగా మారింది.
ఈ రెండు విషయాల్లో కోహ్లి దూకుడును చాలామంది తప్పుబడుతున్నారు. గంభీర్‌తో వాగ్వాదం విషయంలో బీసీసీఐ కూడా బయటి వారితో ఏకీభవించి కోహ్లికి అక్షింతలు (100 శాతం మ్యాచ్ ఫీజ్‌లో కోత) వేసింది. వరుస వివాదాల నేపథ్యంలో కోహ్లి.. బీసీసీఐకి ఓ లేఖ రాసినట్లు సమాచారం. లేఖలో కోహ్లి తాను నిర్ధోషినని, తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పుచేయలేదని రాసాడని తెలుస్తోంది. అలాగే తనకు వంద శాతం జరిమానా (ఓ మ్యాచ్‌కు) విధించడంపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇవే కాక మరిన్ని విషయాలను కోహ్లి తన లేఖలో ప్రస్తావించినట్లు ప్రముఖ దైనిక్ జాగ్రన్ పేర్కొంది. కోహ్లి రాసినట్లు చెబుతున్న ఈ లేఖపై బీసీసీఐ ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో విఫలమై దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కోహ్లి (55), మహిపాల్ లోమ్రార్ (54 నాటౌట్), డుప్లెసిస్ (45) రాణించడంతో ఆర్సీబీ 181 పరుగులు చేయగా.. ఛేదనలో ఫిలిప్ సాల్ట్ (87) చెలరేగడంతో ఢిల్లీ మరో 20 బంతులు మిగిలుండగానే సునాయాస విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలోవార్నర్ (22), మిచెల్ మార్ష్ (26) ఓ మోస్తరుగా రాణించగా.. రిలీ రొస్సో (35 నాటౌట్), అక్షర్ పటేల్ (8 నాటౌట్) డీసీని విజయతీరాలకు చేర్చారు.
చదవండి: IPL 2023: ఢిల్లీ ధనాధన్
Comments
Please login to add a commentAdd a comment