sachin tendulker
-
మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు.. తొలి క్రికెటర్‌గా
ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు సాధించింది. మౌంట్ మౌన్‌గనుయ్ వేదికగా జరగుతోన్న ఈ మ్యాచ్‌తో అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. ఇప్పటి వరకు మిథాలీ రాజ్ మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. 2000 వరల్డ్‌కప్‌లో మిథాలీ అరంగేట్రం చేసింది. వరుసగా 2000, 2005, 2009, 2013, 2017, 2022 ప్రపంచకప్‌లలో భారత జట్టుకు మిథాలీ ప్రాతినిధ్యం వహించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబ్బీ హాక్లీ, ఇంగ్లండ్ క్రీడాకారిణి షార్లెట్ ఎడ్వర్డ్స్‌ల రికార్డును మిథాలీ రాజ్ బ్రేక్ చేసింది. హాక్లీ, ఎడ్వర్డ్స్ వరుసగా ఐదు ప్రపంచకప్‌ల్లో ఆడారు. ఇక ఆరు ప్రపంచకప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా మిథాలీ రాజ్ సమం చేసింది. వరుసగా 1992,1996,1999,2003,2007,2011 ప్రపంచకప్‌లలో భారత తరుపున సచిన్ ఆడారు. చదవండి: Ravindra Jadeja: జడేజా సరికొత్త రికార్డు.. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా -
భారత మాజీ క్రికెటర్‌కి షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు.. ఫోన్లో మాట్లాడుతుండగా..
ఇంటర్నెట్ వాడకం పెరగడంతో కొందరు ఈజీ మనీ కోసం ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు రోజు రోజుకి పెరుగుతూ పోతోంది. వీళ్లు తమ దందా సాఫీగా సాగించేందుకు కొత్త దారులు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ జాబితాలో సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ సైతం సైబర్ మోసానికి గురయ్యాడు. వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు కాంబ్లీ కి ఫోన్ చేసి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించి, ఆయన కేవైసీ సమాచారాన్ని సమర్పించాలని లేదా తను బ్యాంక్ ఖాతా రద్దు అవుతుందని తెలిపారు. వాళ్ల మాటలను నమ్మిన కాంబ్లీ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు తన ఫోన్లో ‘ఎనీ డెస్క్’ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. దెబ్బకు కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి పలు దఫాలుగా రూ. 1.14 లక్షల డబ్బు స్వాహ అయ్యాయి. ఈ తతంగమంతా కూడా కాంబ్లీ అతనితో ఫోన్లో మాట్లాడుతుండగానే జరిగింది. చివరికి తాను మోసపోయానని గ్రహించిన కాంబ్లీ అసలు విషయం తెలుసుకుని దగ్గర్లోనే ఉన్న బాంద్రా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు.. రివర్స్ ట్రాన్సక్షన్ ద్వారా కాంబ్లీ డబ్బును తిరిగి ఆయన ఖాతాలోకి జమచేశారు. కాంబ్లీ సచిన్ టెండూల్కర్ తో కలిసి చదువుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు సెయింట్ గ్జేవియర్స్ స్కూల్ పై ఏకంగా 664 పరుగుల భాగస్వామ్యాన్ని చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇద్దరు భారత క్రికెట్ లోకి అడుగుపెట్టారు. కానీ ఆ తరువాత కాంబ్లీ మాత్రం పలు వివాదాల కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. చదవండి: Virat Kohli: "కోహ్లి ఫోన్ స్విఛ్చాఫ్.. ఏమైందో నాకు తెలియదు" -
‘ఒకే ఫ్రేమ్‌లో 3 లెజెండ్స్.. కేటీఆర్ చాలా యంగ్‌గా ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆపదలో ఉన్నామని ఎవరైనా వేడుకుంటే వెంటనే స్పందిస్తుంటారు. సమస్యలు తెలుసుకొని వారికి కావ్సాలిన సాయాన్ని అందిస్తారు. ప్రధానంగా వైద్య సేవలు కావాల్సిన వారి షిషయంలో తక్షణం రెస్పాండ్ అవుతారు. అలాగే నెటిజన్ల అడిగే పలు ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇస్తుంటారు. చదవండి: MLC Elections: విఠల్ ఏకగ్రీవానికి టీఆర్ఎస్ విఫలయత్నం.. ‘విత్‌డ్రా’మా.. వివాదం ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ కృష్ణ.. తెలంగాణ మంత్రి కేటీఆర్, షారుక్ ఖాన్, సచిన్‌లో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో పోస్టు చేశాడు. ఇందులో ముగ్గురు వరుసగా సెల్ఫీకి పొజిచ్చారు. అయితే ఇది ఎప్పుడు దిగారో తెలియదు కానీ దీనిని పోస్టు చేస్తూ.. ‘పాత ఫోటో, ముగ్గురు స్టార్స్’ అంటూ పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. నాకు ఇష్టమైన ఫోటోల్లో ఇది ఒకటి అంటూ రీట్వీట్ చేశారు. కాగా దీనిపై నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. ‘సూపర్ ఫోటో. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు లెజెండ్లు అంటూ కామెంట్చేస్తున్నారు. ముగ్గురిలో షారుక్, సచిన్ కంటే, కేటీఆర్ యంగ్‌గా కనిపిస్తున్నారు’ అన ప్రశంసిస్తున్నారు. చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్ One of my favourite pic https://t.co/94YohQ1A8R — KTR (@KTRTRS) November 26, 2021 -
ఫీల్డింగ్, కీపింగ్, క్యాచ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శన.. జట్టులో చోటుందా..!
సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులుగా.. శునకాన్ని పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కుక్కను విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. చాలా మంది వీటిని.. తమ ఇంట్లో ఒక సభ్యుడి మాదిరిగానే ట్రీట్ చేస్తారు. శునకం కూడా తమ యజమాని పట్ల ఎనలేని ప్రేమను, అభిమానాన్ని చూపిస్తుంటుంది. బయటకు వెళ్లిన తమ యజమాని వచ్చేవరకు గుమ్మం వద్దనే కాచుకుని ఉంటాయి. యజమాని తప్ప వేరే వారు ఏది తినడానికి పెట్టిన కనీసం ముట్టుకోవు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కుక్కలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. మరికొంత మంది కుక్కలకు చిన్నచిన్న పనులు నేర్పిస్తుంటారు. ఏదైన వస్తువును లేదా బాల్‌ను విసిరి.. దాని వెనుక పరిగెడతారు. కుక్క నోటికి అందించి తెచ్చేలా దానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇలాంటివి తరచుగా మనం సోషల్ మీడియాలోను.. మనచుట్టు చూస్తునే ఉంటాం. తాజాగా, భారత్ మాజీ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ ఒక ఆసక్తికర వీడియోను తన ట్విటర్‌ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వీధిలో కొందరు చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఒక బాలిక లెఫ్ట్‌హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తుంది. ఒక బాలుడు వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. అక్కడ ఒక శునకం కీపింగ్ చేస్తుంది. ఆ బాలుడు స్పీడ్‌గా బౌలింగ్ చేయగానే ఆ కుక్క.. దాన్ని తన నోటితో క్యాచ్ పట్టేసుకుంటుంది. అదే విధంగా ఆ బాలిక.. షాట్ కొట్టగానే వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ బాల్‌ను తీసుకొస్తుంది. ఈ వీడియోలో శునకం.. కీపింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లతో.. ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరుస్తుంది. ఈ ఆసక్తికర వీడియోను తన స్నేహితుడు పంపించినట్లు సచిన్ తెలిపాడు. ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తున్న శునకానికి మీరు ఏమని పేరుపేడతారంటూ సచిన్.. ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని’, ‘ ఆల్ రౌండర్ శునకం’, ‘లగాన్ సినిమా గుర్తొస్తుందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Received this from a friend and I must say, those are some 'sharp' ball catching skills 😉 We've seen wicket-keepers, fielders and all-rounders in cricket, but what would you name this? 😄 pic.twitter.com/tKyFvmCn4v — Sachin Tendulkar (@sachin_rt) November 22, 2021 -
కోలుకున్న క్రికెట్ దేవుడు: ఆస్పత్రి నుంచి ఇంటికి
ముంబై: కరోనా వైరస్ బారిన పడిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఆరు రోజుల అనంతరం ఆస్పత్రి నుంచి నివాసానికి సచిన్ వచ్చాడు. మార్చి 27వ తేదీన కరోనా వైరస్ బారినపడగా ఆరు రోజుల అనంతరం సచిన్‌కు ఏప్రిల్ 2వ తేదీన కొన్ని లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే ఆరోజే ఆస్పత్రిలో చేరాడు. 6 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం గురువారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యి నివాసానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేశాడు. ‘ఇప్పుడే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చా. నేను స్వీయ నిర్బంధంలోనే కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటా. నా కోసం ప్రార్థించిన వారు, ఆ నా ఆరోగ్యంపై శ్రద్ధ చూపెట్టిన వారందరికీ కృతజ్ఞతలు. వైద్యుల సేవలను మరోసారి గుర్తుచేస్తున్నా. ఏడాది నుంచి వైద్యులు, సిబ్బంది అలుపెరగకుండా మనకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాళ్లు ఎంతో గొప్పవారు’ అని ట్వీట్ చేశారు. చదవండి: నిన్న ఎన్నికలు.. నేడు సీఎంకు కరోనా చదవండి: మంత్రి ప్రకటన: 13వ తేదీనే ఉగాది pic.twitter.com/h3gLviUblI — Sachin Tendulkar (@sachin_rt) April 8, 2021 -
రహానే కెప్టెన్సీ.. కోహ్లి స్పందన
న్యూఢిల్లీ: బాక్సింగ్ డే టెస్టులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్, టెస్ట్ స్పెషలిస్ట్ వీవీఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలు సహా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇతర ఆటగాళ్లు రహానే సేనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘విరాట్, రోహిత్, ఇషాంత్, షమీ వంటి ఆటగాళ్లు లేకుండానే టెస్టు మ్యాచ్‌లో గెలుపొందడం అనేది అత్యద్భుతమైన విజయం. మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ వెంటనే తేరుకుని సిరీస్‌ను సమం చేసిన జట్టు తీరు అమోఘం. బ్రిలియంట్ విన్. వెల్డన్ టీమిండియా’’ అని సచిన్ ట్వీట్ చేశాడు.(చదవండి: ఆ క్రెడిట్ వాళ్లిద్దరిదే: రహానే ) What a win this is, absolutely amazing effort by the whole team. Couldn't be happier for the boys and specially Jinks who led the team to victory amazingly. Onwards and upwards from here 💪🇮🇳 — Virat Kohli (@imVkohli) December 29, 2020 ఇక తొలి టెస్టు అనంతరం భారత్‌కు తిరిగి వచ్చిన రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి.. ‘‘ ఎంతటి ఘన విజయం ఇది.. జట్టు మొత్తం అద్భుతంగా రాణించింది. కేవలం ఆటగాళ్లే కాదు.. వారిని ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చిన నాయకుడి వ్యూహం పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను’’ అంటూ తాత్కాలిక కెప్టెన్ రహానేను కొనియాడాడు. ఇక వీవీఎస్ లక్ష్మణ్ సైతం.. ‘‘ఈ విజయంతో ఎన్నెన్నో సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. రహానే కెప్టెన్సీ భేష్.. బౌలర్లు.. ముఖ్యంగా ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం. కీలక మ్యాచ్‌లో వాళ్లిద్దరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. దృఢమైన బెంచ్ ఉండటమే ఇండియన్ క్రికెట్‌కు ఉన్న అతిపెద్ద బలం’’ అని గిల్, సిరాజ్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. ‘‘టీమిండియా అద్భుతమైన ప్రదర్శన. దెబ్బతిన్న పులిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు’’ అంటూ క్రికెటర్ దినేశ్ కార్తిక్ పింక్‌బాల్ టెస్టులో పరాజయానికి భారత జట్టు దీటుగా బదులిచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశాడు. To win a Test match without Virat, Rohit, Ishant & Shami is a terrific achievement. Loved the resilience and character shown by the team to put behind the loss in the 1st Test and level the series. Brilliant win. Well done TEAM INDIA! 👏🏻 #AUSvIND pic.twitter.com/64A8Xes8NF — Sachin Tendulkar (@sachin_rt) December 29, 2020 Well done team India @BCCI. Never underestimate a wounded tiger 😉#AUSvIND pic.twitter.com/4kCHgRyW4i — DK (@DineshKarthik) December 29, 2020 -
అలా ఆ సమస్యను అధిగమించా: కోహ్లి
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సలహాలు, సూచలనతోనే ఆస్ట్రేలియా టూర్లో మెరుగ్గా రాణించగలిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. హిప్ అలైన్ మార్చుకున్న తర్వాత తన ఆట ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చాడు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన కోహ్లి సహచర ఆటగాడు మయాంక్ అగర్వాల్‌తో వీడియో చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా 2014 నాటి ఇంగ్లండ్ టూర్లో బ్యాటింగ్ పరంగా తనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు, వాటిని అధిగమించిన తీరును గుర్తు చేస్తున్నాడు. ‘‘ఇంగ్లండ్ టూర్లో హిప్ పొజిషన్ నాకెంతో సమస్యాత్మకంగా మారింది. అయినప్పటికీ నేనేం ఏం చేయాలనుకున్నానో అదే చేస్తూ కఠినంగా ముందుకు సాగాను. అయితే తొందరగానే నేను ఈ విషయాన్ని గ్రహించాను. నిజం చెప్పాలంటే అదో బాధాకరమైన విషయం. ఓ బ్యాట్స్‌మెన్‌గా కుడి వైపు తుంటి భాగాన్ని బాగా చాచినపుడు లేదా దగ్గరకు తీసుకువచ్చినపుడు మనం ప్రమాదంలో పడతామనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. అందుకే హిప్ పొజిషన్‌ను దృష్టిలో పెట్టుకుని.. కాస్త బ్యాలెన్స్ చేస్తూ బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇంగ్లండ్ టూర్లో నేను ఈ టెక్నిక్ మిస్సయ్యానని అనిపిస్తూ ఉంటుంది. (1000వ పోస్టును షేర్ చేసిన కోహ్లి) ఆ తర్వాత ముంబైలో సచిన్ పాజీని కలిశాను. ఫార్వర్డ్ ప్రెస్(బలంగా నిల్చుని కాలు ముందు చాచడం) ద్వారా ఫాస్ట్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే టెక్నిక్స్ నేర్చుకున్నా. అదే వ్యూహాన్ని ఆసీస్ టూర్లో అమలు చేశాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2014 ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లో కలిపి 13.40 సగటుతో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి కెరీర్లోనే చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో 1-3 తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లండ్ టూర్‌లోని అనుభవాల దృష్ట్యా టెక్నిక్స్ మార్చుకుని ఆసీస్ టూర్(2014-15)లో 692 పరుగులతో రాణించి సత్తా చాటాడు. -
మ...మ... మాస్క్... టీమిండియా ఫోర్స్!
ఇప్పుడు కరోనా చైన్‌ను తెంచే పనిలో మాస్క్ యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. భారత్‌లోనూ వేలల్లో వైరస్ బారిన పడుతున్న తరుణంలో బీసీసీఐ భారత క్రికెటర్ల ద్వారా మాస్క్‌లు ధరించేలా ప్రోత్సహిస్తోంది. స్టార్ క్రికెటర్లు కోహ్లి, సచిన్, స్మృతి మంధాన, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులతో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. బయటికి వెళ్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే స్పృహ కల్పించేలా ‘టీమ్ మాస్క్ ఫోర్స్’ పేరిట ఈ వీడియో సందేశం ఉంది. ‘మాతో చేతులు కలపండి. కరోనాపై పోరాడండి. ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. సురక్షితంగా ఉండండి’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. -
ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత.. సచిన్ సంతాపం
కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ సారథి ప్రదీప్ కుమార్ బెనర్జీ (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ఆటగాడిగా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన బెనర్జీ.. అనంతరం కోచ్‌గా కూడా జట్టుకు తన సేవలను అందించారు. 1936లో జన్మించిన బెనర్జీ భారత్ తరుపున 84 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించి 65 గోల్స్ సాధించారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత్ స్వర్ణం గెలవడంలో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా 1960లో జరిగిన రోమ్ ఒలింపిక్స్‌లో ఫ్రెంచ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరుపును ఏకైక గోల్ సాధించి మ్యాచ్‌ను డ్రా చేసేందుకు సహాయపడ్డారు. ఇక రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు పీకే బెనర్జీనే సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. పీకే బెనర్జీ మరణం యావత్ క్రీడా ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ దిగ్గజ ప్లేయర్ మృతి పట్ల భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయనతో దిగిన ఫోటోను సచిన్ తన ట్విటర్లో ఫోస్ట్ చేశారు. పీకే బెనర్జీకి ఇద్దరు కుమార్తెలు. ఆయన తమ్ముడు ప్రసూన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. -
కోహ్లిని ఊరిస్తున్న భారీ రికార్డు
నాటింగ్‌హామ్: మరో భారీ రికార్డు ముంగిట టీమిండియా సారథి విరాట్ కోహ్లి నిలిచాడు. ఇప్పటికే అత్యంత వేగంగా పదివేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సొంతం చేసుకున్న కోహ్లి.. గురువారం న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో 57 పరుగులు చేస్తే.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. అందరికంటే వేగంగా (222 ఇన్నింగ్స్‌లలో) వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కోహ్లి ఘనత సొంతం చేసుకోనున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయి దాటాడు. అంతేకాదు, క్రికెట్లోకి వచ్చిన 11 ఏళ్ల లోపే ఈ ఘనతను సొంతం చేసుకున్న ఆటగాడిగానూ కోహ్లి రికార్డుల్లో నిలిచిపోతాడు. వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని దాటిన ప్రపంచంలో తొమ్మిదో క్రికెటర్‌గా, మూడో భారత ఆటగాడిగా కోహ్లి నిలువనున్నాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ భారత్ నుంచి ఈ మైలురాయిని అందుకున్నారు. ఈ జాబితాలో గంగూలీని అధిగమించి.. ఎనిమిదో స్థానానికి కోహ్లి ఈ ప్రపంచకప్‌లోనే ఎగబాకే అవకాశం కనిపిస్తోంది. గంగూలీ 11,363 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లి ఈ పరుగులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక, మరో చిన్న రికార్డు కూడా కోహ్లిని న్యూజిలాండ్ మ్యాచ్ ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేస్తే.. ఆ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా వీరేందర్ సెహ్వాగ్, రింకీ పాంటింగ్‌ల సరసన అతను చేరుతాడు. కివీస్‌పై సెహ్వాగ్, పాంటింగ్‌లు తలో సెంచరీలు చేయగా, కోహ్లి ఇప్పటివరకు ఐదు సెంచరీలు చేశాడు. -
భారత క్రికెట్లో ఓ చీకటి రోజు!
సాక్షి, స్పోర్ట్స్ : సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత క్రికెట్ చరిత్రలో ఓ చీకటి రోజుగా నిలిచిపోయింది. భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భాగంగా 1996 మార్చి 13న కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అవమానకర రీతిలో ఓటమి పాలైంది. అభిమానుల ఆగ్రహావేశాల మధ్య ప్రపంచకప్ పోటీ నుంచి నిష్ర్కమించింది. ప్రపంచకప్ సొంతమవుతోందని కలలు కన్న భారత అభిమానులకు కన్నీళ్లే మిగిలాయి. దీంతో అభిమానుల ఆగ్రహావేశాలు ప్రపంచ క్రికెట్ ముందు బీసీసీఐని దోషిగా నిలబెట్టాయి. ఒక బ్లాక్ డేగా మిగిలి పోయిన ఆనాటి మ్యాచ్‌ను ఒకసారి నెమరువేసుకుందాం. సచిన్ ఒక్కడే.. మహ్మద్ అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన లంక తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అరవింద్ డిసిల్వా, రోహన్ మహనామ అర్థసెంచరీలతో జట్టును నిలబెట్టారు. ముఖ్యంగా డిసిల్వా దుమ్మురేపే బ్యాటింగ్ తో భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 47 బంతుల్లో 14 ఫోర్లతో 66 పరుగులు బాదాడు. మహనామ జాగ్రత్తగా ఆడి 101 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే సచిన్ టెండూల్కర్, మంజ్రేకర్ ఆచితూచి ఆడి 98 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 98 పరుగుల వద్ద సచిన్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ అజహరుద్దీన్ డకౌట్ కావడంతో 99 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. అక్కడి నుంచి టీమిండియా బ్యాటింగ్ పేకమేడల్లా కుప్పకూలింది. వచ్చిన బ్యాట్స్ మన్ వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు. 34.1 ఓవరల్లో 120 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కావడం విశేషం. అభిమానుల ఆగ్రహం.. భారత ఆటగాళ్ల నిర్లక్ష్యపు ఆటతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీస పోరాటపటిమ కనబరచకుండా టీమిండియా బ్యాట్స్‌మెన్ నిష్క్రమించడంతో మైదానంలోని ప్రేక్షకులు విరుచుకుపడ్డారు. స్టేడియంలోని కొన్ని స్టాండ్లకు నిప్పుపెట్టారు. వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఆట మళ్లీ మొదలైన తర్వాత కూడా రగడ ఆగలేదు. ప్రేక్షకులు మరోసారి బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్ రిఫరీ ఆటను నిలిపివేశారు. అప్పటివరకు నమోదైన స్కోర్ల ప్రకారం శ్రీలంక గెలిచినట్టు ప్రకటించారు. ఫలితంగా తొలిసారిగా శ్రీలంక వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇలా అభిమానుల కారణంగా మ్యాచ్ నిలిపోవడం అప్పటి వరకు అదే తొలిసారి. ఇక ఫైనల్లో ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి లంకేయులు తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
గుడ్ వర్క్ బోయ్స్ : సచిన్
సాక్షి, ముంబై : దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరిస్ ఓటమి తర్వాత వన్డే సిరిస్‌లో భాగంగా కింగ్స్‌మీడ్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అత్యత్తమ ప్రదర్శన కనబరిచారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందనలతో ముంచెత్తారు. కోహ్లి, రహానేల కీలక భాగస్వామ్యం భారత్‌ను విజయతీరాలకు చేర్పించిందని కొనియాడారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్, చహల్‌లు రాణిస్తే, కోహ్లి, రహానేలు బ్యాటింగ్‌లో సత్తా చాటారని పేర్కొన్నారు. బాగా ఆడారు, ఇలాగే విజయాల పరంపరను కొనసాగించండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Two great partnerships to take India to victory. First, @imkuldeep18 along with @yuzi_chahal and then @imVkohli with @ajinkyarahane88. Great work, boys. Keep up the momentum, #TeamIndia. #INDvSA pic.twitter.com/tQnfETAuco — Sachin Tendulkar (@sachin_rt) 2 February 2018 తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లతో దక్షిణాఫ్రికాని చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (112 బంతుల్లో 120; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. కుల్దీప్ 3, చహల్ 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరు 20 ఓవర్లలో కేవలం 79 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయడం సఫారీల పతనాన్ని శాసించింది. అనంతరం భారత్ 45.3 ఓవర్లలో 4 వికెట్లకు 270 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ కోహ్లి (119 బంతుల్లో 112; 10 ఫోర్లు) వన్డేల్లో 33వ శతకం సాధించగా... అజింక్య రహానే (86 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వన్డే సిరిస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా... ఆదివారం సెంచూరియన్‌లో రెండో వన్డే జరుగుతుంది. -
‘నేనేం సచిన్ అభిమానిని కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను అభిమానించనవారు ఎవరుండరూ.. కానీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల మాత్రం తనకు ఇష్టమైన క్రికెటర్ సచిన్ కాదంటున్నాడు. భారత్ పర్యటనలో ఉన్న సత్యనాదేళ్ల ఓ జాతీయ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో అడిగిన ర్యాఫిడ్ ఫైర్ ప్రశ్నకు ఇలా సమాదానం ఇచ్చాడు. మీరు అభిమానించే క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. లేక 1960 దిగ్గజం హైదరాబాది క్రికెటర్ ఎంఎల్ జయసింహానా అని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు సత్యనాదేళ్ల ఇది చాల కఠినమైన ప్రశ్న అని, నేను మాత్రం ఓ హైదరాబాదిగా జయసింహానే అభిమానిస్తానని తెలిపాడు. ఇక తన ‘హిట్ రిఫ్రేష్’ బుక్‌లో జయసింహా గురించిన ప్రస్తావించిన సత్యనాదేళ్ల ఓ సందర్భాన్ని వివరించారు. ఓ రోజు తన గదిలో తన తండ్రి కారల్ మార్క్స్ ఫొటోను తగిలించాడని, వెంటనే తన తల్లి లక్ష్మీదేవి ఫోటోను పెట్టిందని తాను మాత్రం తన హీరో జయసింహా ఫోటోనే కావలనుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక జయసింహా మైదానం బయట గుడ్ స్టైల్ లుకింగ్‌తో రాక్‌స్టార్‌లా ఉండేవాడని తెలిపాడు. 1959-1971 మధ్య కాలంలో 39 టెస్టులాడిన జయసింహా 2056 పరుగులు చేశాడు. మైదానంలో స్టైలీష్ బ్యాటింగ్‌తో రాణించేవాడు. ఆయన బ్యాటింగ్ శైలిని వీవీఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్ వంటి క్రెటర్లు అనుకరించారు. -
సెహ్వాగ్ బర్త్ డే.. సచిన్ ఉల్టా ట్వీట్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్, వీరేంద్ర సెహ్వాగ్ 39వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, క్రికెట్ లెజెండ్స్ నుంచి విషెస్ వెల్లువెత్తాయి. అయితే ఇతరుల బర్త్‌డేకు సరదాగా విషెస్ చెబుతూ అందరిని ఆకట్టుకునే వీరూ.. తన బర్త్‌డే విషెస్‌కు కూడా విభిన్నంగా స్పందిస్తూ నా స్టైలే వేరంటున్నాడు. క్రికెట్లో సిక్సులతో అలరించిన వీరూ.. రిటైర్మెంట్ అనంతరం ట్వీట్లతో అలరిస్తున్న విషయం తెలిసిందే. సెహ్వాగ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ.. వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్ ట్వీట్ చేయగా.. వీరు స్పందిస్తూ.. ఫేమస్ సినిమా టైటిల్ అయిన చోటా చేతన్‌తో పార్దీవ్‌ను పోలుస్తూ రిప్లయ్ ఇచ్చాడు. ఇదేవిధంగా సురేశ్ రైనాను లగే రహో( బాగా కష్టపడూ).. క్రిస్ గేల్‌ను యూనివర్సల్ బాస్ అంటూ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. కుంబ్లే ట్విట్‌కు నీ మద్దతుకు రుణపడి ఉంటా అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్విట్లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు అభిమానులు కూడా తమ ఎడిటింగ్ నైపుణ్యంతో వీరును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సచిన్ ఉల్టా ట్విట్.. ఇక క్రికెట్ గురూ సచిన్ ఇంకో అడుగు ముందుకేసి వీరూ రూట్లోనే ఉల్టా ట్వీట్‌తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.‘ ఫీల్డ్‌లో నేను ఏది చెప్పినా దానికి ఉల్టా చేస్తావు కదా అందుకే నీకు విషెస్ కూడా ఉల్టా చెప్తా.. హ్యాపీ బర్త్ డే సెహ్వాగ్ అని’ ట్వీట్ చేశారు. అలాగే బీసీసీఐ హ్యాపీ బర్త్‌డే నజఫ్ఘర్ నవాబ్ అని ట్వీట్ చేసింది. ఫియర్ లెస్ అనే పదానికి అర్ధం తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ రహానే.. మమ్మల్ని ఇంకా అలరించు అని ఇషాంత్ శర్మ ట్వీట్ చేశారు. .ǝɯ ɯoɹɟ ǝuo s,ǝɹǝɥ os ˙😜pןǝıɟ uo noʎ pןoʇ ǝʌɐɥ ı ʇɐɥʍ ɟo ɐʇןn ǝuop sʎɐʍןɐ ǝʌ,noʎ ˙ɹɐǝʎ ʍǝu ǝɥʇ oʇ ʇɹɐʇs ʇɐǝɹƃ ɐ ǝʌɐɥ ¡nɹıʌ 'ʎɐpɥʇɹıq ʎddɐɥ pic.twitter.com/L1XTzhzoiU — sachin tendulkar (@sachin_rt) 20 October 2017 Thank you God ji 🙏🏼Uparwala sab dekh raha hai, yeh to suna tha, par aaj samajh aaya, woh neeche waalon ke liye likhta kaise hai ! https://t.co/stdodewNuJ — Virender Sehwag (@virendersehwag) 20 October 2017 Thank you dearest Chota Chetan ! https://t.co/i9P2Q8UXyj — Virender Sehwag (@virendersehwag) 20 October 2017 -
సచిన్‌ను కలిసిన మోడ్రన్ మహరాజ్..
సాక్షి, ముంబై: సచిన్ టెండూల్కర్ ఇంటికి ఊహించని అతిథి వచ్చాడు. అతనేవరో కాదు ఇండో- కెనడియన్ అయినా డబ్యూడబ్యూఈ ఛాంపియన్ జిందర్ మహాల్. ఈ పేరు ప్రస్తుతం డబ్యూడబ్యూఈ చూసేవారందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన్ను ‘మోడ్రన్ డే మహారాజు’ అని పిలుస్తారు. అంతేకాక జిందర్ ప్రస్తుతం డబ్యూడబ్యూఈ ఛాంపియన్. జిందర్ ఇటీవల సచిన్, సచిన్ కుమారుడు అర్జున్‌లను కలిశారు. ఈ సంధర్బంగా ఆయన ఢిల్లీలో డిసెంబర్ 8,9 తేదిలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే డబ్యూడబ్యూఈ ఈవెంట్లకు ఆహ్వానించాడు. వారితో కలిసి దిగిన ఫోటోలను ఈ రెజ్లర్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. సచిన్‌ను కలిసి నా మ్యాచ్‌లను చూడటానికి రండి అని పిలవడం ఎంతో థ్రిల్లింగ్ ఉందని పోస్టు చేశాడు. అంతేకా ఈ రెజ్లర్ ‘మోడ్రన్ డే మహారాజ’ టీ- షర్ట్స్‌ను సచిన్, అర్జున్‌లకు ఇచ్చాడు. 31 ఏళ్ల రెజ్లర్ జిందర్ మహల్ 1986 జూలై 19న కెనడాలోని కాల్గరీలో జన్మించాడు. -
‘అమ్మాయిలు.. ఆటలాడండి’..
సాక్షి, న్యూఢిల్లీ: అమ్మాయిలు తమ కలలను నేరువేర్చుకోవాలంటే ఆటలవైపు మొగ్గు చూపాలని భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండ్కూలర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ నిర్వహించిన కార్యక్రమంలో సచిన్, మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌లు పాల్గొన్నారు. యూనిసెఫ్ ప్రచారకర్త అయిన సచిన్ మాట్లాడుతూ.. మా తల్లితండ్రుల స్పూర్తితోనే నేను ఇంతటి స్థాయికి వచ్చానని, చిన్నప్పుడే వారు నా నైపుణ్యాన్ని గుర్తించి మద్దతుగా నిలిచారన్నారు. మీరు కూడా మీ పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి మద్దతుగా నిలవాలని తల్లితండ్రులకు సూచించారు. బాలికలను మీ ఆస్తిగా పరిగణించాలే తప్ప.. పెళ్లి చేయాల్సి వస్తదని భారంగా భావించొద్దన్నారు. ప్రభుత్వాలు కూడా అమ్మాయిల విద్య, వారి కలల సాకారం కోసం ప్రత్యేక పథకాలు రూపోందించాలని అభిప్రాయపడ్డారు. ఇక్కడ లింగ వివక్షకు తావులేదని, అబ్బాయిలు, అమ్మాయిలు సమానమమని, మనమంతా అమ్మాయిలకు పూర్తి స్వేచ్చను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో బాల్యవివాహాలు, లింగ వివక్ష రూపుమాపాలంటే అది క్రీడలతోనే సాధ్యమన్నారు. అమ్మాయిలంతా క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ♦ అమ్మాయిలు డౌన్ అవద్దు.. ‘అమ్మాయిలమని డౌన్ కావద్దు. ఒక క్రీడాకారిణిగా చెబుతున్నా.. జెండర్ అనేది సమస్యే కాదు. అమ్మాయిలంతా ఆటలాడండి. అవి మీ నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి. మానసికంగా ధృడపరుస్తాయి. ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీవితంలోని ఛాలెంజ్‌లను ధైర్యంగా ఎదుర్కోనేలా సిద్దం చేస్తాయి.’ అని మీథాలీ రాజ్ అన్నారు. -
సచిన్, చిరు, నాగ్.. ఇక బిజినెస్ పార్ట్నర్లు
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, తెలుగు సినీ దిగ్గజాలు చిరంజీవి, నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పుడు వ్యాపార భాగస్వాములయ్యారు. కేరళ బ్లాస్టర్స్ పేరుతో ఫుట్‌బాల్ జట్టును కొనుగోలు చేశారు. గతంలో చిరంజీవి కుటుంబ సభ్యులు, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ భాగస్వాములుగా ఉన్నారు. వీరు ఓ తెలుగు టీవీ చానెల్‌ను నిర్వహించారు. ఇప్పుడు తెలుగు సినీ ప్రముఖులతో సచిన్ వ్యాపార భాగస్వామి అయ్యాడు. సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులతో పాటు చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ ప్రత్యేక విమానంలో రేణిగుంటకు వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం వారు శ్రీవారిని సందర్శించుకున్నారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నట్టు సమాచారం. -
ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ
తిరుపతి: ఒక సాధారణ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటేనే ఒక వార్తగా నిలుస్తుంది. అలాంటిది ఓ ఐదుగురు ప్రముఖులు ఓ చోట చేరి సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ పట్టరాని సంతోషంతో.. ఇంకా ఆసక్తిగా చెప్పాలంటే ఒకే రకమైన వస్త్రాలు వేసుకొని.. ఎవరి మొఖంలో నవ్వుచూసినా అదే పరిమాణంలో ఉండి.. ఈ అరుదైన సెల్ఫీ తిరుపతిలో ఆవిష్కృతమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ చెరిగిపోని చరిత్రను లిఖించుకున్న ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, నట సామ్రాట్ అక్కినేని నాగార్జున, గీతా ఆర్ట్స్ సారధి అల్లు అరవింద్.. వీళ్లందరికీ ఒక్కసారిగా అదనపు రంగు అద్దినట్లుగా మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, వ్యాపార ప్రముఖుడు నిమ్మగడ్డ ప్రసాద్ కలిసి ఈ స్వీయ చిత్రాన్ని తీసుకున్నారు. బయటకు వచ్చిన ఈ ఫొటోను చూసిన వారంతా కూడా వావ్ వాట్ ఏ సెల్ఫీ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.