సాక్షి, న్యూఢిల్లీ: అమ్మాయిలు తమ కలలను నేరువేర్చుకోవాలంటే ఆటలవైపు మొగ్గు చూపాలని భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండ్కూలర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ నిర్వహించిన కార్యక్రమంలో సచిన్, మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌లు పాల్గొన్నారు.
యూనిసెఫ్ ప్రచారకర్త అయిన సచిన్ మాట్లాడుతూ.. మా తల్లితండ్రుల స్పూర్తితోనే నేను ఇంతటి స్థాయికి వచ్చానని, చిన్నప్పుడే వారు నా నైపుణ్యాన్ని గుర్తించి మద్దతుగా నిలిచారన్నారు. మీరు కూడా మీ పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి మద్దతుగా నిలవాలని తల్లితండ్రులకు సూచించారు. బాలికలను మీ ఆస్తిగా పరిగణించాలే తప్ప.. పెళ్లి చేయాల్సి వస్తదని భారంగా భావించొద్దన్నారు. ప్రభుత్వాలు కూడా అమ్మాయిల విద్య, వారి కలల సాకారం కోసం ప్రత్యేక పథకాలు రూపోందించాలని అభిప్రాయపడ్డారు. ఇక్కడ లింగ వివక్షకు తావులేదని, అబ్బాయిలు, అమ్మాయిలు సమానమమని, మనమంతా అమ్మాయిలకు పూర్తి స్వేచ్చను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో బాల్యవివాహాలు, లింగ వివక్ష రూపుమాపాలంటే అది క్రీడలతోనే సాధ్యమన్నారు. అమ్మాయిలంతా క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
♦ అమ్మాయిలు డౌన్ అవద్దు..
‘అమ్మాయిలమని డౌన్ కావద్దు. ఒక క్రీడాకారిణిగా చెబుతున్నా.. జెండర్ అనేది సమస్యే కాదు. అమ్మాయిలంతా ఆటలాడండి. అవి మీ నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి. మానసికంగా ధృడపరుస్తాయి. ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీవితంలోని ఛాలెంజ్‌లను ధైర్యంగా ఎదుర్కోనేలా సిద్దం చేస్తాయి.’ అని మీథాలీ రాజ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment