మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి (డిసెంబర్ 15) ముందు గుజరాత్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు మెంటార్ మరియు అడ్వైజర్ మిథాలీ రాజ్ (భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్) బాధ్యతల నుంచి తప్పుకొంది. వాస్తవానికి మిథాలీ కాంట్రాక్ట్ మరో ఏడాది పాటు ఉండింది. అయితే ఇతరత్రా కారణాల చేత మిథాలీ మరో ఏడాది కాంట్రాక్ట్ ఉండగానే బాధ్యతల నుంచి తప్పుకుంది.
మిథాలీ ఇటీవలే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మిథాలీతో పాటు గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్ కూడా తన బాధ్యతల నుంచి తప్పుకుంది. అల్ ఖదీర్ కాంట్రాక్ట్ ఈ ఏడాదితోనే ముగిసింది. అయితే అల్ ఖదీర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించమని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరలేదు. అల్ ఖదీర్ ప్రస్తుతం భారత అండర్-19 మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుంది.
మెంటార్ మరియు బౌలింగ్ కోచ్ ప్రత్యామ్నాయాలను గుజరాత్ జెయింట్స్ రేపటి లోగా ప్రకటించవచ్చు. హెడ్ కోచ్ మైఖేల్ క్లింగర్, ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్ యధావిధిగా తమ బాధ్యతల్లో కొనసాగుతారని జెయింట్స్ యాజమాన్యం ప్రకటించింది. కాగా, గుజరాత్ జెయింట్స్ జట్టు గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీ రెండు సీజన్లలో అట్టడుగు స్థానాల్లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment