మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ జెయింట్స్ తమ నూతన బౌలింగ్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేను నియమించుకుంది. మాజీ బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్ తన బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ప్రవీణ్ నియామకం జరిగింది.
గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం బౌలింగ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ నియామకం కూడా చేపట్టింది. గుజరాత్ బ్యాటింగ్ కోచ్ స్థానానికి ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ మార్ష్ ఎంపికయ్యాడు. గుజరాత్ జెయింట్స్ తమ హెడ్ కోచ్‌గా మైఖేల్ క్లింగర్‌కు కొనసాగించనుంది. క్లింగర్ గత సీజన్‌లోనే జెయింట్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
కాగా, ప్రవీణ్ తాంబే 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2013 సీజన్‌లో అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. తాంబేకు ఐపీఎల్‌లో కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల తరఫున కోచింగ్ బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది.
డేనియల్ మార్ష్ విషయానికొస్తే.. ఇతను 2013-17 మధ్యలో టాస్మానియా పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. మార్ష్.. 2022లో ఆస్ట్రేలియా మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించబడ్డాడు.
షాకిచ్చిన మిథాలీ
డబ్ల్యూపీఎల్ 2025 వేలానికి ముందు గుజరాత్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు మెంటార్ మరియు అడ్వైజర్ మిథాలీ రాజ్ బాధ్యతల నుంచి తప్పుకుంది. వాస్తవానికి మిథాలీ కాంట్రాక్ట్ మరో ఏడాది పాటు ఉండింది. అయితే ఇతరత్రా కారణాల చేత మిథాలీ మరో ఏడాది కాంట్రాక్ట్ ఉండగానే తప్పుకుంది. మిథాలీ ఇటీవలే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
అట్టడుగు స్థానంలో..
గుజరాత్ జెయింట్స్ జట్టు గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ ఫ్రాంచైజీ రెండు సీజన్లలో అట్టడుగు స్థానాల్లో నిలిచింది.
డిసెంబర్ 15న వేలం
డబ్ల్యూపీఎల్ 2025 వేలం రానున్న ఆదివారం (డిసెంబర్ 15) బెంగళూరు వేదికగా జరుగనుంది. వేలానికి ముందు గుజరాత్ జెయింట్స్ ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ లాంటి సీనియర్ ప్లేయర్లను రీటైన్ చేసుకుంది.
గుజరాత్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు: ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, భారతీ ఫుల్మాలీ, సయాలీ సత్గరే
గుజరాత్ జెయింట్స్ వదులుకున్న ప్లేయర్లు: స్నేహ్ రాణా, క్యాథరిన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నమ్ పఠాన్, లీ తహుహు.
Comments
Please login to add a commentAdd a comment