Pravin Tambe
-
41 ఏళ్లప్పుడు ఐపీఎల్లో ఎంట్రీ.. ఇప్పుడు బయోపిక్‌గా మూవీ
ఈ మధ్య కాలంలో క్రీడాకారుల జీవిత చరిత్ర నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసపెట్టి సందడి చేస్తున్నాయి. ఇదివరకే భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని, మేరి కోమ్, 86 వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇండియన్స్‌కు అమితంగా ఇష్టమైన ఆటల్లో క్రికెట్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు ఎక్కువగా ఈ క్రికేట్ నేపథ్యమున్న క్రీడకారుల బయోపిక్‌లు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఇప్పుడు మరో క్రికెటర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఇండియన్ క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ 'ప్రవీన్ తాంబే ఎవరు?'. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడే ప్రవీన్ తాంబే. ఈ సినిమా టైటిల్ రోల్ శ్రేయాస్ తల్పడే నటిస్తున్నాడు. సుమారు 17 ఏళ్ల తర్వాత ఒక లీడ్ రోల్లో నటించడం తనకు దక్కిన అదృష్టమని శ్రేయాస్ తల్పడే తెలిపాడు. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుందన్నాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాని, నిర్మాతలు, దర్శకుడు జయప్రద్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమా గురించి ప్రవీన్ తాంబే 'నా జీవిత కథ ఎందరికో స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. వారి శక్తిని వారు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయొద్దు.' అని పేర్కొన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ చిత్రం. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. pic.twitter.com/NaDvkIDdTs — Disney+ Hotstar (@DisneyPlusHS) March 7, 2022 -
యూ ఆర్ లైక్ ‘ఫైన్ వైన్’ తాంబే
-
యూ ఆర్ లైక్ ‘ఫైన్ వైన్’ తాంబే
ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ తాంబే అద్భుతమైన క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. మరొక నెలలో 49వ ఒడిలోకి అడుగుపెడుతున్న తాంబే.. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే సమయంలో సీపీఎల్ ఆడుతున్న తొలి భారత క్రికెటర్‌గా కూడా తాంబే అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. సీపీఎల్‌లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ గెలిచింది. ఫలితంగా ఈ లీగ్‌లో పదికి పది గెలిచి టాప్‌లో నిలిచింది. కాగా, తాంబే కళ్లు చెదిరే క్యాచ్‌తో శభాష్ అనిపించాడు. సెయింట్ కిట్స్ ఇన్నింగ్స్‌లో భాగంగా బెన్ డంక్ ఇచ్చిన క్యాచ్‌ను తాంబే పట్టుకున్న తీరు ప్రేక్షకుల్ని ముగ్థుల్ని చేసింది. ఫావద్ అహ్మద్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌ను బెన్ డంక్ ఆడబోగా అది కాస్తా టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఆ సమయంలో షార్ట్ థర్డ్ మ్యాన్ ఏరియాకు పరుగెత్తుకొంటూ వచ్చిన తాంబే.. ఆ బంతిని కిందకు పడకుండా ఒడిసి పట్టుకున్నాడు. అదే సమయంలో బౌలింగ్‌లో కూడా తాంబే వికెట్ తీశాడు. వీటికి సంబంధించిన వీడియోను సీపీఎల్ యాజమాన్యం తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనికి ప్రవీణ్ తాంబే ఏజ్‌ను గుర్తు చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. తాంబే యూ ఆర్ లైక్ ఫైన్ వైన్ అని క్యాప్షన్‌లో ఉంచింది. (చదవండి: వావ్.. పదికి పదికి గెలిచారు) ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెయింట్ కిట్స్ తొలుత సెయింట్ కిట్స్ జట్టు 18.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ బౌలర్ ఫవాద్ అహ్మద్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం నైట్‌రైడర్స్ జట్టు 11.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి గెలుపొందింది. వెబ్‌స్టర్ (33 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరిశాడు. మొత్తం ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్థతిలో తలపడుతున్న ఈ టోర్నీలో టీకేఆర్ జట్టు లీగ్ దశలో 20 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐపీఎల్లో బ్యాన్.. వివాదం ఇది ఐపీఎల్ నుంచి తనను బ్యాన్ చేయడంపై వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే మూడు నెలల క్రితం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తనను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసినప్పుడు ఇక మిగతా విదేశీ లీగ్‌లు ఆడకుండా అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమంటూ బీసీసీఐపై మండిపడ్డాడు.ఈ క్రమంలోనే సీపీఎల్ ఆడటానికి సిద్ధపడ్డాడు. 48 ఏళ్ల వయసులో ఐపీఎల్ బరిలోకి దిగాలని భావించిన అతనికి కొన్ని నెలల క్రితం బీసీసీఐ బ్రేక్ వేసింది. నిబంధనల ప్రకారం తాంబే ఐపీఎల్ ఆడేందును అనర్హుడని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది యూఏఈలో జరిగిన టి10 లీగ్‌లో సింధీస్ జట్టు తరఫున తాంబే నాలుగు మ్యాచ్‌లు ఆడటం అతనిపై బ్యాన్‌కు కారణమైంది. బీసీసీఐ నిర్వహించే టోర్నీలో ఆడాలనుకునే వారు విదేశీ లీగ్‌ల్లో ఆడకూడదనే నిబంధన ఉన్నా దానిని తాంబే అతిక్రమించాడు. దాంతో నిషేధానికి గురయ్యాడు. (చదవండి: త్వరలో ఆటకు బెల్ బైబై) -
ఆ రికార్డు సృష్టించనున్న భారత క్రికెటర్!
ముంబై: కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరోన్ పొలార్డ్ నేతృత్వంలోని టిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే క్రికెట్ ప్రియులందరికి తెలిసిన వ్యక్తే. 41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపడేలా చేశాడు. ఇప్పడు ప్రవీణ్ తాంబే మరోసారి రికార్డు సృష్టించబోతున్నాడు. 48 ఏళ్ల తాంబే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)కు ఎంపికయ్యాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. టిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. సోమవారం జరిగిన సీపీఎల్ ఆటగాళ్ల వేలంలో ప్రవీణ్ తాండేను టిన్‌బాగో నైట్ రైడర్స్ దక్కించుకున్నది. అయితే తాంబే సీపీఎల్‌లో ఆడాలంటే బీసీసీఐ అనుమతి ఉండాలి. (చదవండి: ఐపీఎల్లో బ్యాన్ చేశారు కదా.. ఇంకా ఏంటి?) కానీ ఇండియన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకపోతే బీసీసీఐ నిబంధనల ప్రకారం తాంబే సీపీఎల్ ఆడటానికి అవకాశం ఇవ్వదు. బీసీసీఐ నియమాల ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో సహా అన్ని రకాల దేశీయ క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాతే ఇతర దేశాలలో జరిగే లీగ్‌లలో ఆడాలనుకునే ఆటగాడికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ లభిస్తుంది. అంతకముందు కెనడాలో జరిగిన గ్లోబల్ టీ 20 లీగ్ ఆడటానికి వెళ్లడానికి యువరాజ్ సింగ్ కూడా అదే చేశాడు. అయితే తాంబే రిటైర్మెంట్కు సంబంధించి ముంబై క్రికెట్ అసోసియేషన్ క్లారిటీనిచ్చింది. ప్రస్తుతం అతను రిటైర్డ్ అయ్యాడు అని తెలిపింది. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ అసోసియేషన్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాండే రిటైర్డ్ అయ్యారు. మొదట ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు, కానీ తరువాత దానిని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రిటైర్డ్ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన ఆయన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశం పంపించారు. (ఐపీఎల్ 2020: అతడు ఔట్) ఇక తాంబే క్రికెట్ ఆట విషయానికి వస్తే... 2013-16 మధ్య కాలంలో ప్రవీణ్ తాంబే 33 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున కూడా ఆడాడు. ఇక ప్రవీణ్తాంబే సీపీఎల్ విషయానికి వస్తే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ సీపీఎల్ కొత్త సీజన్.. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు షెడ్యూల్ చేశారు. భారత ప్రభుత్వం జూలై 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ దానిని పొడిగిస్తే తాంబే ఆశల మీద నీళ్లు చల్లినట్లే అవుతుంది. -
ఐపీఎల్లో బ్యాన్ చేశారు కదా.. ఇంకా ఏంటి?
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి తనను బ్యాన్ చేయడంపై వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తనను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసినప్పుడు ఇక మిగతా విదేశీ లీగ్‌లు ఆడకుండా అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమంటూ బీసీసీఐపై మండిపడ్డాడు. ప్రస్తుతం తాను ఫిట్‌గా ఉన్న క్రమంలో ఆడటానికి ఎటువంటి ఇబ్బందేమీ లేదన్నాడు. ఇక్కడ తన వయసు ప్రధానం కాదని తాంబే స్పష్టం చేశాడు. ‘నన్ను ఐపీఎల్ నుంచి నిషేధించారు. మరి ఇంకా ఏమిటి. ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసినప్పుడు విదేశీ లీగ్‌లు ఆడటానికి అర్హత ఉంది కదా. ఆ క్రమంలోనే కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో టీకేఆర్ తరఫున ఆడుతున్నాను. బీసీసీఐ ఎలాగూ అది నిర్వహించే టోర్నీల్లో ఆడనివ్వడం లేదు. అటువంటప్పుడు విదేశీ టోర్నీలు ఎందుకు ఆడకూడదు’ అని ఒక జాతీయ పత్రికతో మాట్లాడుతూ తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానంలో ఐపీఎల్ నుంచి బ్యాన్ కావడాన్ని ప్రస్తావించాడు. ‘ప్రవీణ్ తాంబే దేశవాళీ మ్యాచ్‌ల్లో ఒక యాక్టివ్ ప్లేయర్. అటువంటప్పుడు విదేశీ లీగ్‌లు ఆడకూడదు’ అని ఒక బీసీసీఐ అధికారి కౌంటర్‌కు సమాధానంగా తాంబే పై విధంగా స్పందించాడు. (కరోనాతో మాజీ క్రికెటర్ మృతి) 48 ఏళ్ల వయసులో ఐపీఎల్ బరిలోకి దిగాలని భావించిన అతనికి కొన్ని నెలల క్రితం బీసీసీఐ బ్రేక్ వేసింది. నిబంధనల ప్రకారం తాంబే ఐపీఎల్ ఆడేందును అనర్హుడని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది యూఏఈలో జరిగిన టి10 లీగ్‌లో సింధీస్ జట్టు తరఫున తాంబే నాలుగు మ్యాచ్‌లు ఆడటం అతనిపై బ్యాన్‌కు కారణమైంది. బీసీసీఐ నిర్వహించే టోర్నీలో ఆడాలనుకునే వారు విదేశీ లీగ్‌ల్లో ఆడకూడదనే నిబంధన ఉన్నా దానిని తాంబే అతిక్రమించాడు. దాంతో నిషేధానికి గురయ్యాడు. కాగా, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన పెద్ద వయస్కుడిగా తాంబే నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని దక్కించుకుంది. 2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తాంబే 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున కూడా ఆడాడు. (పిన్న వయసులోనే ఎలైట్ ప్యానల్లో చోటు) -
ఐపీఎల్ 2020: అతడు ఔట్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడకుండా వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేపై అనర్హత వేటు పడింది. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించడంతో అతడిపై ఈ మేరకు చర్య తీసుకున్నారు. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. ‘అతడిని (తాంబే)ను ఐపీఎల్లో ఆడేందుకు అనుమతించం. బీసీసీఐ, రాష్ట్రాల క్రికెట్ బోర్డుల నుంచి నిరంభ్యంతర సర్టిఫికెట్ తీసుకువచ్చిన ఆటగాళ్లకే ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంటుంద’ని ఆయన స్పష్టం చేశారు. 48 ఏళ్ల ప్రవీణ్ తాంబే.. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్ 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని దక్కించుకుంది. 2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తాంబే 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున కూడా ఆడాడు. తనను తాను 20 ఏళ్ల వయస్కుడిగా భావించుకుంటానని గత డిసెంబర్లో ఐపీఎల్ వేలం తర్వాత పేర్కొన్నాడు. యువకుడిగా మైదానంలోకి దిగుతానని.. తన అనుభవం, ఎనర్జీ కేకేఆర్ జట్టుకు ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. తుది జట్టులోకి తీసుకోకపోయినా, తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తాంబే స్థానంలో కేకేఆర్ ఎవరినీ తీసుకుంటుందో ఇంకా వెల్లడి కాలేదు. (చదవండి: ప్రవీణ్ తాంబే ఐపీఎల్ ఆడలేడు!) -
ప్రవీణ్ తాంబే ఐపీఎల్ ఆడలేడు!
న్యూఢిల్లీ: వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ఆశలకు బ్రేక్! 48 ఏళ్ల వయసులో లీగ్ బరిలోకి దిగాలని భావిస్తున్న అతనికి బీసీసీఐ చెక్ పెట్టింది. నిబంధనల ప్రకారం తాంబే ఐపీఎల్ ఆడేందును అనర్హుడని బోర్డు కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గత ఏడాది యూఏఈలో జరిగిన టి10 లీగ్‌లో సింధీస్ జట్టు తరఫున తాంబే నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ‘ఐపీఎల్లో ఆడాలనుకునే భారత క్రికెటర్లు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇతర లీగ్‌లకు దూరంగా ఉండాలనేది కచ్చితమైన నిబంధన. అసలు టి10 డ్రాఫ్ట్ కోసం తన పేరును పంపించడమే తప్పు. ఆ తర్వాత అతను ఆడాడు కూడా. కాబట్టి ఇది బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించడమే. అందుకే అతడు ఐపీఎల్లో ఆడేందుకు అనర్హుడు’ అని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 20 లక్షల కనీస ధరకు తాంబేను సొంతం చేసుకుంది. -
కేకేఆర్ ఆటగాడికి బీసీసీఐ షాక్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కోసం జరిగిన వేలంలో ముంబైకి చెందిన 48 ఏళ్ల వెటరన్ ఆటగాడు ప్రవీణ్ తాంబేను కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. అతని కనీస ధర రూ. 20లక్షలకే తాంబేను తీసుకుంది. తాంబే కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో చివరకు కేకేఆర్ బిడ్‌కు వెళ్లింది. అక్కడ మిగతా ఫ్రాంచైజీల నుంచి ఎటువంటి పోటీ లేకపోవడంతో తాంబే కేకేఆర్ సొంతమయ్యాడు. అయితే తాంబే ఐపీఎల్ ఆడటానికి అర్హత కోల్పోయాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన టీ10లో సింథిస్ తరఫున ఆడిన తాంబే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) రూల్స్‌ను అతిక్రమించాడు. ఐపీఎల్లో కానీ, భారత జట్టు తరఫున ఆడాలనుకునే ఏ క్రికెటర్ కూడా విదేశీ లీగ్‌లో పాల్గొనకూడదనేది బీసీసీఐ రూల్. ఒకవేళ ఆడాలనుకుంటే బీసీసీఐ నుంచి ఎన్ఓసీ తీసుకున్న తర్వాతే వేరే విదేశీ లీగ్‌లు ఆడాల్సి ఉంటుంది. దీన్ని తాంబే బ్రేక్ చేయడంతో ఇప్పుడు ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. ‘బీసీసీఐ రూల్స్ ఏమి చెబుతున్నాయో విదేశీ లీగ్‌లు ఆడాలనుకునే భారత క్రికెటర్లు తెలుసుకోవాలి. ఐపీఎల్ ఆడాలనుకుంటే విదేశీ లీగ్‌ల్లో ఆడకూడదు. ఒకవేళ విదేశీ లీగ్‌లపై ఆసక్తి ఉంటే ఐపీఎల్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. అబుదాబిలో జరిగిన టీ10 లీగ్‌లో భాగంగా ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో తాంబే తన పేరును పంపాడు. అదే సమయంలో ఐపీఎల్ వేలానికి కూడా వచ్చాడు. ఇది బీసీసీఐ ప్రొటోకాల్‌ను వ్యతిరేకించడమే. దాంతో తాంబే ఐపీఎల్ ఆడటానికి అనర్హుడు’ బీసీసీఐలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు వయసురీత్యా అర్ధసెంచరీ కొట్టబోతున్న వెటరన్ స్పిన్నర్ తాంబే ఐపీఎల్లో ఇదివరకు రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ (ఇప్పుడు లేదు), సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తాంబే.. మొత్తంగా 33 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశాడు. -
లేటుగా వచ్చినా.. లేటెస్టు హ్యాట్రిక్
35-40 ఏళ్లు.. రాజకీయాల్లో అయితే నవ యవ్వనం.. క్రికెట్లో అయితే రిటైర్మెంట్ వయసు. సమకాలీన క్రికెట్లో క్రమశిక్షణతో పాటు ఫిట్నెస్ కాపాడుకుంటే అతికష్టమ్మీద 40 వరకూ లాక్కురావచ్చు. అయితే ఒక్కోసారి ఎవరూ ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి. ఓ ముంబైకర్ రిటైర్మెంట్ వయసులో అరంగేట్రం చేశాడు. భారత క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డు నెలకొల్పాడు. అతనే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రవీణ్ విజయ్ తాంబె. ఐపీఎల్-7లో లేటు వయసులో సంచలనాలు సృష్టిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో రెండు బంతుల్లో హ్యాట్రిక్ వికెట్ తీసి.. టి-20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. తాంబె కథేంటో తెలుసుకుందాం.. తాంబె మన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే రెండేళ్లు ముందు 1971 అక్టోబర్ 8న ముంబైలోనే జన్మించాడు. ప్రస్తుతం తాంబె వయసు 43 ఏళ్లు. విశేషమేంటంటే.. మన మాస్టర్ ఏమో ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు కొల్లగొట్టి గతేడాది చివర్లో 41 ఏళ్ల వయసులో క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. తాంబె మాత్రం 41 ఏళ్ల వరకూ ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఐపీఎల్ సరేసరి. ముంబైలో కేవలం ఓ 'బి' టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాంటి తాంబెకు గతేడాది అనూహ్యంగా ఐపీఎల్లో ఆడే అవకాశం వచ్చింది. అదీ ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడకుండానే. గత సీజన్‌ల్లో తాంబె తన 42 వ ఏటన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వికెట్ల బోణీ కొట్టలేకపోయాడు. కాగా ఐపీఎల్-6లో 14 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో రంజీల్లో ఆడే అవకాశం వచ్చింది. సచిన్ రిటైరయిన తర్వాత గత డిసెంబర్లో ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడాడు. అందరూ దేశవాళ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో రాణించి ఐపీఎల్ చాన్స్ కొట్టేస్తే.. తాంబే మాత్రం రివర్స్ రూట్లో వచ్చాడన్నమాట. తాజా సీజన్లో అయితే తాంబె బంతితో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. రాజస్థాన్ తరపున ఏడు మ్యాచ్‌లు ఆడిన తాంబె 12 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-7లో స్టెయిన్, మలింగ వంటి దిగ్గజ బౌలర్లు ఆడుతున్నా.. ఇప్పటిదాకా అత్యధిక వికెట్లు తీసిన ఘనత మాత్రం అతనిదే. క్రికెట్లో మాస్టర్ ఓ అద్భుతమైతే.. మరో ముంబైకర్ తాంబె కూడా మరో అద్భుతం. -
‘షేన్’దార్ రాయల్స్
అద్భుతం... అసాధ్యాలు సుసాధ్యం కావడం... ఒక్క ఓవర్లో మ్యాచ్ ఫలితం తారుమారు కావడం... ఇవన్నీ టి20 ఫార్మాట్లోనే సాధ్యం. వారం క్రితం సూపర్ ఓవర్‌ను కూడా టై చేసుకున్న రాజస్థాన్, కోల్‌కతా.. మరోసారి టి20 క్రికెట్లోని మజాను రుచి చూపించాయి. అసలు ఇదెలా సాధ్యం..! అని ఆశ్చర్యపోయేలా రాజస్థాన్ బౌలర్లు అద్భుతం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్న మ్యాచ్‌ను అనూహ్యంగా గెలిచారు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ జట్టూ ఓడిపోని విధంగా... అత్యంత నాటకీయంగా కోల్‌కతా చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. - రాజస్థాన్ సంచలన విజయం - షేన్ వాట్సన్ ఆల్‌రౌండ్ షో - పవీణ్ తాంబే హ్యాట్రిక్ - నాటకీయంగా కుప్పకూలిన కోల్‌కతా రెండు బంతుల్లో హ్యాట్రిక్ ! తాంబే ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించినా... లీగల్‌గా తను వేసింది రెండు బంతులే. తొలి బంతి వైడ్ అయినా స్టంపౌట్ రూపంలో వికెట్ వచ్చింది. తర్వాతి రెండు లీగల్ బంతులకు రెండు వికెట్లు వచ్చాయి. టి20ల్లో ఇలా రెండు బంతుల్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి భారత క్రికెటర్ తాంబే. గతంలో చాంపియన్స్‌లీగ్‌లో ఇసురు ఉదాన (శ్రీలంక) రెండు బంతుల్లో ఇలాగే హ్యాట్రిక్ సాధించాడు. అహ్మదాబాద్: లక్ష్యం 171... స్కోరు 14 ఓవర్లలో 121/0... ఈ దశలో ఏ జట్టైనా అలవోకగా గెలుస్తుంది. కానీ కోల్‌కతా మాత్రం నాటకీయంగా కుప్పకూలి అనూహ్యంగా ఓడిపోయింది. కేవలం 8 బంతుల వ్యవధిలో రెండే పరుగులు జతచేసి ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆడుతూ పాడుతూ గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘోర పరాజయం పాలైంది. షేన్ వాట్సన్ ఆల్‌రౌండ్ నైపుణ్యానికి.. స్పిన్నర్ ప్రవీణ్ తాంబే హ్యాట్రిక్ తోడవడంతో... సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచింది. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానే (22 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్), కరుణ్ నాయర్ (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. సంజు శామ్సన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు), వాట్సన్ (20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మొత్తం బ్యాట్స్‌మెన్ అంతా సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ భారీస్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో వినయ్ కుమార్, నరైన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు గంభీర్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్సర్), ఉతప్ప (52 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీలు చేశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి... విజయానికి కావలసిన ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. అయితే వాట్సన్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడం... ఆ వెంటనే తర్వాతి ఓవర్లోనే తాంబే హ్యాట్రిక్ సాధించడంతో కేవలం 2 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఇక కోలుకోలేకపోయింది. చివర్లో షకీబ్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కొద్దిసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో వాట్సన్, తాంబే మూడేసి వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్ తాంబేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే రనౌట్ 30; కరుణ్ నాయర్ (స్టం) ఉతప్ప (బి) షకీబ్ 44; శామ్సన్ (సి) పాండే (బి) నరైన్ 37; వాట్సన్ (సి) యాదవ్ (బి) నరైన్ 31; బిన్నీ (సి) టెన్ డష్కటే (బి) వినయ్ 11; స్టీవ్ స్మిత్ (సి) యాదవ్ (బి) వినయ్ 3; ఫాల్క్‌నర్ నాటౌట్ 1; భాటియా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 3, వైడ్లు 2, నోబాల్ 1) 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1-52; 2-105; 3-136; 4-153; 5-163; 6-163. బౌలింగ్: వినయ్ కుమార్ 4-0-42-2; ఉమేశ్ యాదవ్ 3-0-31-0; షకీబ్ అల్ హసన్ 4-0-25-1; నరైన్ 4-0-28-2; రస్సెల్ 3-0-27-0; టెన్ డష్కటే 2-0-14-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) భాటియా (బి) వాట్సన్ 65; గంభీర్ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 54; రస్సెల్ (బి) వాట్సన్ 1; పాండే (స్టం) శామ్సన్ (బి) తాంబే 0; షకీబ్ నాటౌట్ 21; యూసుఫ్ పఠాన్ (సి) అండ్ (బి) తాంబే 0; డష్కటే ఎల్బీడబ్ల్యు (బి) తాంబే 0; సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 5, వైడ్లు 3, నోబాల్స్ 2) 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 160. వికెట్ల పతనం: 1-121; 2-122; 3-122; 4-123; 5-123; 6-123. బౌలింగ్: వాట్సన్ 4-0-21-3; సౌతీ 3-0-33-0; తాంబే 4-0-26-3; ఫాల్క్‌నర్ 4-0-27-0; భాటియా 3-0-30-0; టెవాటియా 2-0-18-0. కళ్లుచెదిరే క్యాచ్‌లు తొలుత రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా నిర్మించారు. రహానే, నాయర్, శామ్సన్13 ఓవర్ల పాటు వికెట్లను కాపాడుతూనే 105 పరుగులు చేశారు. దీంతో వాట్సన్ హిట్టింగ్‌కు కావలసిన రంగం సిద్ధమైంది. కెప్టెన్ వాట్సన్ అంచనాలను నిలబెట్టుకుంటూ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఈ దశలో రాయల్స్ 180-190 పరుగులు దిశగా సాగింది. కానీ కోల్‌కతా ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లతో నియంత్రించారు. ముఖ్యంగా వాట్సన్ క్యాచ్‌ను సూర్యకుమార్ అత్యద్భుతంగా అందుకున్నాడు. అలాగే బిన్నీ క్యాచ్‌ను టెన్డష్కటే అద్భుతంగా అందుకున్నాడు. దీంతో రాయల్స్ 170 పరుగులకు పరిమితమైంది. 121/0.... 123/6 కోల్‌కతాకు గంభీర్, ఉతప్ప కళ్లుచెదిరే ఆరంభాన్నిచ్చారు. టోర్నీలో తొలిసారి గంభీర్ అర్ధసెంచరీ చేయగా... ఉతప్ప అద్భుతమైన షాట్లు ఆడాడు. ఈ ఇద్దరూ ఎక్కడా తడబడకుండా ఆడి కోల్‌కతాను పటిష్ట స్థితిలో నిలిపారు. 15వ ఓవర్లో డ్రామా మొదలైంది. వాట్సన్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికే గంభీర్ అవుట్ అయ్యాడు. మూడో బంతిని పుల్ చేసిన ఉతప్ప బౌండరీ దగ్గర సులభమైన క్యాచ్ ఇచ్చాడు. చాలా నిర్లక్ష్యపు షాట్ ఇది. ఇదే ఓవర్ ఐదో బంతికి వాట్సన్... రస్సెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్లో కేవలం ఒక్క పరుగు (అది కూడా ఓవర్ త్రో) మాత్రమే వచ్చింది. తర్వాతి ఓవర్లో తాంబే తొలి బంతిని వైడ్ వేశాడు. కానీ మనీష్‌పాండే ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. దీంతో మళ్లీ ఇదే ఓవర్ తొలి బంతి వేసిన తాంబే... యూసుఫ్ పఠాన్‌ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాతి బంతి టెన్ డష్కటే ఎల్బీగా అవుట్ కావడంతో తాంబేకు హ్యాట్రిక్ దక్కింది. కేవలం రెండు పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఇక ఆ తర్వాత కోలుకోలేకపోయింది.