ప్రవీణ్‌ తాంబే ఐపీఎల్‌ ఆడలేడు! | IPL 2020: Pravin Tambe Not Eligible To Play IPL League | Sakshi
Sakshi News home page

ప్రవీణ్‌ తాంబే ఐపీఎల్‌ ఆడలేడు!

Jan 14 2020 2:49 AM | Updated on Jan 14 2020 2:49 AM

IPL 2020: Pravin Tambe Not Eligible To Play IPL League - Sakshi

ప్రవీణ్‌ తాంబే

న్యూఢిల్లీ: వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబే ఆశలకు బ్రేక్‌! 48 ఏళ్ల వయసులో లీగ్‌ బరిలోకి దిగాలని భావిస్తున్న అతనికి బీసీసీఐ చెక్‌ పెట్టింది. నిబంధనల ప్రకారం తాంబే ఐపీఎల్‌ ఆడేందును అనర్హుడని బోర్డు కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గత ఏడాది యూఏఈలో జరిగిన టి10 లీగ్‌లో సింధీస్‌ జట్టు తరఫున తాంబే నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ‘ఐపీఎల్‌లో ఆడాలనుకునే భారత క్రికెటర్లు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇతర లీగ్‌లకు దూరంగా ఉండాలనేది కచ్చితమైన నిబంధన. అసలు టి10 డ్రాఫ్ట్‌ కోసం తన పేరును పంపించడమే తప్పు. ఆ తర్వాత అతను ఆడాడు కూడా. కాబట్టి ఇది బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించడమే. అందుకే అతడు ఐపీఎల్‌లో ఆడేందుకు అనర్హుడు’ అని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్‌ 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 20 లక్షల కనీస ధరకు తాంబేను సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement