
దుబాయ్: సెప్టెంబర్ 19న ఐపీఎల్ ప్రారంభం అంటూ ప్రకటించినా... ఇప్పటి వరకు కూడా టోర్నీ షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కనిపించింది. కరోనా నేపథ్యంలో యూఏఈలో టోర్నీ నిర్వహిస్తున్నా... ఏమైనా అవాంతరాలు వచ్చాయా, అనుకున్న విధంగా లీగ్ జరుగుతుందా అనే సందేహాలు వినిపించాయి. అయితే ఇప్పుడు వీటికి బీసీసీఐ సమాధానం ఇచ్చింది. అన్ని రకాల ప్రక్రియలు పూర్తయిన తర్వాత షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమైంది. ‘ఆదివారం ఐపీఎల్ షెడ్యూల్‌ను విడుదల చేస్తాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించారు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆలస్యంగానైనా సరే ప్రాక్టీస్ మొదలు పెట్టేయడంతో అనుకున్న ప్రకారమే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో తలపడే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 10న ఫైనల్ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment