ఈ మధ్య కాలంలో క్రీడాకారుల జీవిత చరిత్ర నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసపెట్టి సందడి చేస్తున్నాయి. ఇదివరకే భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని, మేరి కోమ్, 86 వంటి చిత్రాలు మంచి విజయాన‍్ని సాధించాయి. ఇండియన్స్‌కు అమితంగా ఇష్టమైన ఆటల్లో క్రికెట్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు ఎక్కువగా ఈ క్రికేట్ నేపథ్యమున్న క్రీడకారుల బయోపిక్‌లు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఇప‍్పుడు మరో క్రికెటర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష‍్కరించనున్నారు. ఇండియన్ క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ 'ప్రవీన్ తాంబే ఎవరు?'. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడే ప్రవీన్ తాంబే. ఈ సినిమా టైటిల్ రోల్ శ్రేయాస్ తల్పడే నటిస్తున్నాడు.
సుమారు 17 ఏళ్ల తర్వాత ఒక లీడ్ రోల్‌లో నటించడం తనకు దక్కిన అదృష్టమని శ్రేయాస్ తల్పడే తెలిపాడు. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారి మాత్రమే వస్తుందన్నాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాని, నిర్మాతలు, దర్శకుడు జయప‍్రద్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమా గురించి ప్రవీన్ తాంబే 'నా జీవిత కథ ఎందరికో స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. వారి శక్తిని వారు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయొద్దు.' అని పేర్కొన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ చిత్రం. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
— Disney+ Hotstar (@DisneyPlusHS) March 7, 2022
Comments
Please login to add a commentAdd a comment