మహిళల ఐపీఎల్ (WPL) మినీ వేలం బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) జరుగుతుంది. ఈ వేలంలో విండీస్ ఆల్‌రౌండర్, లేడీ యూనివర్సల్ బాస్‌గా పిలువబడే డియాండ్రా డొట్టిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.7 కోట్ల భారీ మొత్తనికి సొంతం చేసుకుంది. ఇవాళ జరుగుతున్న మినీ వేలంలో మొదటిగా సోల్డ్ ఔటైన ప్లేయర్ డొట్టినే. డొట్టిన్‌ను 2023 డబ్ల్యూపీఎల్ ఇనాగురల్ ఎడిషన్‌లో కూడా గజరాత్ జెయింట్సే సొంతం చేసుకుంది.
ఆ సీజన్‌లో జెయింట్స్ డొట్టిన్‌ను రూ. 60 లక్షలకు దక్కింంచుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ లీగ్ ప్రారంభానికి ముందే జెయింట్స్ డొట్టిన్‌ను వదిలేసింది. డొట్టిన్ తొలుత 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కలు పలికింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ముందు డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ యేడు పొట్టి ప్రపంచకప్‌లో డొట్టిన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 120 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసింది.
కాగా, ఈసారి మెగా వేలంలో గుజరాత్ జెయింట్సే అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగింది. జెయింట్స్ వద్ద రూ.4.4 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో జెయింట్స్ కేవలం నాలుగు స్లాట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. డొట్టిన్ కోసం జెయింట్స్‌తో పాటు యూపీ వారియర్జ్ తీవ్రంగా పోటీపడింది. అయితే అంతిమంగా డొట్టిన్‌ను జెయింట్సే దక్కించుకుంది. డొట్టిన్‌కు విధ్వంసకర బ్యాటర్‌గానే కాకుండా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌గానూ పేరుంది. అందుకే డొట్టిన్‌కు వేలంలో భారీ మొత్తం దక్కింది.
ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో తమిళనాడు అమ్మాయి జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు సొంతం చేసుకుంది. నల్లపురెడ్డి చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. నందిని కశ్యప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. సిమ్రన్ షేక్‌కు గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. సౌతాఫ్రికాకు చెందిన నదినే డి క్లెర్క్‌ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment