మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ మినీ వేలంలో బెంగళూరు నగరంలో ఇవాళ (డిసెంబర్ 15) జరిగింది. ఈ వేలంలో దేశ విదేశాలకు చెందిన 120 మంది ప్లేయర్లు పాల్గొనగా.. ఖాళీగా ఉన్న 19 స్థానాలు భర్తీ అయ్యాయి. వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా షేక్ సిమ్రన్ నిలిచింది. సిమ్రన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది. సిమ్రన్ తర్వాత అత్యధిక ధర విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డొట్టిన్‌కు దక్కింది.
డొట్టిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.7 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో మరో ఇద్దరు భారతీయ అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు కోటి పైన ధర లభించింది. జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు.. ప్రేమా రావత్‌ను ఆర్సీబీ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకున్నాయి.
డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్లు
షేక్ సిమ్రన్-1.9 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
డియాండ్రా డొట్టిన్-1.7 కోట్లు (గుజరాత్ జెయింట్స్)
జి కమలిని-1.6 కోట్లు (ముంబై ఇండియన్స్)
ప్రేమా రావత్-1.2 కోట్లు (ఆర్సీబీ)
నల్లపురెడ్డి చరణి-55 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే..!
ముంబై ఇండియన్స్:
జి కమిలిని-1.6 కోట్లు
నడినే డి క్లెర్క్-30 లక్షలు
అక్షిత మహేశ్వరి-20 లక్షలు
సంస్కృతి గుప్తా-10 లక్షలు
ఆర్సీబీ:
ప్రేమా రావత్-1.2 కోట్లు
జోషిత-10 లక్షలు
రాఘ్వి బిస్త్-10 లక్షలు
జాగ్రవి పవార్-10 లక్షలు
ఢిల్లీ క్యాపిటల్స్:
నల్లపురెడ్డి చరణి-55 లక్షలు
నందిని కశ్యప్-10 లక్షలు
సారా బ్రైస్-10 లక్షలు
నికీ ప్రసాద్-10 లక్షలు
యూపీ వారియర్జ్:
అలానా కింగ్-30 లక్షలు
ఆరుషి గోయెల్-10 లక్షలు
క్రాంతి గౌడ్-10 లక్షలు
గుజరాత్ జెయింట్స్:
షేక్ సిమ్రన్-1.9 కోట్లు
డియాండ్రా డొట్టిన్-1.7 కోట్లు
డేనియెల్ గిబ్సన్-30 లక్షలు
ప్రకాషిక నాయక్-10 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment