సాక్షి, ముంబై: సచిన్ టెండూల్కర్ ఇంటికి ఊహించని అతిథి వచ్చాడు. అతనేవరో కాదు ఇండో- కెనడియన్ అయినా డబ్యూడబ్యూఈ ఛాంపియన్ జిందర్ మహాల్. ఈ పేరు ప్రస్తుతం డబ్యూడబ్యూఈ చూసేవారందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన్ను ‘మోడ్రన్ డే మహారాజు’ అని పిలుస్తారు. అంతేకాక జిందర్ ప్రస్తుతం డబ్యూడబ్యూఈ ఛాంపియన్.
జిందర్ ఇటీవల సచిన్, సచిన్ కుమారుడు అర్జున్‌లను కలిశారు. ఈ సంధర్బంగా ఆయన ఢిల్లీలో డిసెంబర్ 8,9 తేదిలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే డబ్యూడబ్యూఈ ఈవెంట్లకు ఆహ్వానించాడు. వారితో కలిసి దిగిన ఫోటోలను ఈ రెజ్లర్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. సచిన్‌ను కలిసి నా మ్యాచ్‌లను చూడటానికి రండి అని పిలవడం ఎంతో థ్రిల్లింగ్ ఉందని పోస్టు చేశాడు. అంతేకా ఈ రెజ్లర్ ‘మోడ్రన్ డే మహారాజ’ టీ- షర్ట్స్‌ను సచిన్, అర్జున్‌లకు ఇచ్చాడు. 31 ఏళ్ల రెజ్లర్ జిందర్ మహల్ 1986 జూలై 19న కెనడాలోని కాల్గరీలో జన్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment