సెహ్వాగ్‌ బర్త్‌ డే.. సచిన్‌ ఉల్టా ట్వీట్‌ | On Birthday, Virender Sehwag Gets Taste Of His Own Medicine | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్‌ బర్త్‌ డే.. సచిన్‌ ఉల్టా ట్వీట్‌

Published Fri, Oct 20 2017 1:21 PM | Last Updated on Fri, Oct 20 2017 1:55 PM

On Birthday, Virender Sehwag Gets Taste Of His Own Medicine

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ 39వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, క్రికెట్‌ లెజెండ్స్‌ నుంచి విషెస్‌ వెల్లువెత్తాయి. అయితే ఇతరుల బర్త్‌డేకు సరదాగా విషెస్‌ చెబుతూ అందరిని ఆకట్టుకునే వీరూ.. తన బర్త్‌డే విషెస్‌కు కూడా విభిన్నంగా స్పందిస్తూ నా స్టైలే వేరంటున్నాడు. క్రికెట్‌లో సిక్సులతో అలరించిన వీరూ.. రిటైర్మెంట్‌ అనంతరం ట్వీట్‌లతో అలరిస్తున్న విషయం తెలిసిందే.  సెహ్వాగ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ..  వికెట్‌ కీపర్‌ పార్దీవ్‌ పటేల్‌ ట్వీట్‌ చేయగా.. వీరు స్పందిస్తూ.. ఫేమస్‌ సినిమా టైటిల్‌ అయిన చోటా చేతన్‌తో పార్దీవ్‌ను పోలుస్తూ  రిప్లయ్‌ ఇచ్చాడు.

ఇదేవిధంగా సురేశ్‌ రైనాను లగే రహో( బాగా కష్టపడూ).. క్రిస్‌ గేల్‌ను యూనివర్సల్‌ బాస్‌ అంటూ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. కుంబ్లే ట్విట్‌కు నీ మద్దతుకు రుణపడి ఉంటా అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్విట్‌లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు  అభిమానులు కూడా తమ ఎడిటింగ్‌ నైపుణ్యంతో వీరును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

సచిన్‌ ఉల్టా ట్విట్‌..
ఇక క్రికెట్‌ గురూ సచిన్‌ ఇంకో అడుగు ముందుకేసి వీరూ రూట్‌లోనే ఉల్టా ‍ట్వీట్‌తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.‘ ఫీల్డ్‌లో నేను ఏది చెప్పినా దానికి ఉల్టా చేస్తావు కదా అందుకే నీకు విషెస్‌ కూడా ఉల్టా చెప్తా.. హ్యాపీ బర్త్‌ డే సెహ్వాగ్‌ అని’ ట్వీట్‌ చేశారు. అలాగే  బీసీసీఐ హ్యాపీ బర్త్‌డే నజఫ్‌ఘర్‌ నవాబ్‌ అని ట్వీట్‌ చేసింది. ఫియర్‌ లెస్‌ అనే పదానికి అర్ధం తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ రహానే.. మమ్మల్ని ఇంకా అలరించు అని ఇషాంత్‌ శర్మ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement