virendra sehwag
-
సేంద్రీయ వ్యవసాయంపై అక్షయ్ కుమార్,వీరేంద్ర సెహ్వాగ్ పెట్టుబడులు!
సేంద్రీయ ఎరువులతో సేంద్రీయ పద్దతులతో పండించే పంటనే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఇప్పుడీ ఆర్గానిక్ ఫార్మింగ్‌పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు కోట్లలో పెట్టుబడులు పెట్టారు. టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) అనే స్టార్టప్ సంస్థ ఫండింగ్ రౌండ్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా..అందరికీ మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) ప్రయాణంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయం ద్వారా గ్రామీణ వర్గాల సాధికారత కోసం సంస్థ దృష్టి ,నిబద్ధతను నమ్ముతున్నాను" అని అక్షయ్ కుమార్ అన్నారు. ఆరోగ్యకరమైన సేంద్రీయ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, గ్రామీణ రంగాన్ని అభివృద్ధి చేయడంపై కంపెనీ బలమైన ప్రాధాన్యత కారణంగా తాను tbofలో పెట్టుబడి పెట్టానని ఆయన పేర్కొన్నారు. రైతులు, సమాజంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించే దిశగా సంస్థ నిబద్ధత తనను ప్రేరేపించిందని కాబట్టే పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైనట్లు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. -
ఏంటమ్మా పాండ్య ఇలా అయితే కప్పు కష్టమే
-
RCB బ్యాటింగ్ పై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్
-
ఓ మైలురాయి అందుకోకుండా కోహ్లి నన్ను అడ్డుకున్నాడు.. సెహ్వాగ్ సంచలన కామెంట్స్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై డాషింగ్ ఆటగాడు, భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో వీరూ మాట్లాడుతూ.. తాము కలిసి ఆడే రోజుల్లో విరాట్ కోహ్లి తనను ఓ మైలురాయిని అందుకోకుండా అడ్డుకున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్‌లో ఓ భారీ రికార్డు అందుకునే క్రమంలో కోహ్లి ఓ క్యాచ్ డ్రాప్ చేసి తన పేరిట రికార్డు నమోదు కాకుండా చేశాడని ఫీలయ్యాడు. ఆ సమయంలో పట్టలేనంత కోపం వచ్చి కోహ్లిపై గట్టిగా అరిచానని, తాను ట్రిపుల్ సెంచరీ మిస్ అయినప్పుడు కూడా అంతలా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చాడు. అప్పట్లో కోహ్లిని అందరూ పెద్ద స్టార్ ఆవుతాడని అనేవారని, తాను మాత్రం ఆ విషయంతో ఏకీభవించలేదని తెలిపాడు. అయితే శ్రీలంకపై ఓ మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన సెంచరీ చేశాక, తనతో పాటు చాలామంది అభిప్రాయాలు మారాయని పేర్కొన్నాడు. కెరీర్ ఆరంభంలో కోహ్లి 75 సెంచరీలు చేస్తాడని ఎవరూ ఊహించలేదని, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కోహ్లి వంద అంతర్జాతీయ సెంచరీల దిశగా దూసుకుపోవడం అందరి కంటే తనకే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. కోహ్లి తన నిలకడైన ఆటతీరుతో తనతో పాటు చాలామందిని రాంగ్గా ప్రూవ్ చేశాడని, భవిష్యత్తులో అతను సచిన్ 100 సెంచరీల రికార్డును తప్పక అధిగమిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, 44 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసకర బ్యాటర్‌గానే కాకుండా అద్భుతమైన పార్ట్ టైమ్ బౌలర్‌గానూ సేవలందించాడు. అతని జమానాలో వీరూ.. పాంటింగ్, గిల్‌క్రిస్ట్, హేడెన్, హస్సీ, సంగక్కర, జయవర్ధనే, దిల్షన్, లారా లాంటి హేమాహేమీలను బోల్తా కొట్టించాడు. టెస్ట్‌ల్లో 40 వికెట్లు పడగొట్టిన వీరూ.. వన్డేల్లో 96 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. -
స్టువర్ట్ బిన్నీ ఊచకోత.. రిచర్డ్ లెవి విధ్వంసం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా వైజాగ్ టైటాన్స్, నాగ్‌పూర్ నింజాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్ టైటాన్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ వీరేంద్ర సెహ్వాగ్ (18 బంతుల్లో 27; 6 ఫోర్లు), నిక్ కాంప్టన్ (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, సిక్స్), మల్కన్ సింగ్ (33 బంతుల్లో 38; 4 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (18 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. స్టువర్ట్ బిన్నీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎడాపెడా బౌండరీలు సిక్సర్లు బాదాడు. అనంతరం బరిలోకి దిగిన నింజాస్ రిచర్డ్ లెవి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినప్పటికీ గెలవలేకపోయింది. ఈ ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లెవి 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. లెవికి మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో నింజాస్ ఓటమిపాలైంది. అభిమన్యు ఖోద్ (42) పర్వాలేదనిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్లో నింజాస్ గెలుపుకు 10 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన స్టువర్ట్ బిన్నీ.. హర్భజన్ సింగ్‌ను కట్టడి చేయగలిగాడు. ఆఖరి బంతికి సిక్సర్ అవసరం కాగా, భజ్జీ బౌండరీతో సరిపెట్టుకున్నాడు. -
'కొంచెం హుందాగా ప్రవర్తించండి'.. సెహ్వాగ్, పార్థివ్‌లకు చురకలు
టి20 ప్రపంచకప్‌లో శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. అందులో ఒకటి అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్. కనీసం టాస్ కూడా పడకుండా మ్యాచ్ రద్దు కావడం సగటు అభిమానికి బాధ కలిగించింది. అఫ్గానిస్తాన్ ఈసారి నేరుగా టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. ఐర్లాండ్ మాత్రం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడింది. క్వాలిఫయింగ్‌లో స్కాట్లాండ్ను ఓడించిన ఐర్లాండ్.. రెండుసార్లు టి20 ప్రపంచ చాంపియన్ అయిన విండీస్‌కు గట్టిషాక్ ఇచ్చింది. గ్రూఫ్ టాపర్‌గా సూపర్-12కు అర్హత సాధించింది. సూపర్-12లో ఇంగ్లండ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో ఓడించిన ఐర్లాండ్.. లంక చేతిలో మాత్రం ఓడిపోయింది. ఇక అఫ్గానిస్తాన్ పరిస్థితి దారుణం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు రద్దు కాగా.. ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ రెండు జట్లు సెమీస్ చేరడం కష్టమే. అయితే ఐర్లాండ్‌కు కాస్త అవకాశం ఉంది. ఈ సంగతి పక్కనపెడితే టీమిండియా మాజీలు వీరేంద్ర సెహ్వాగ్, పార్థివ్ పటేల్‌లకు ఒక క్రికెట్ అభిమాని చురకలంటించాడు. అఫ్గానిస్తాన్, ఐర్లాండ్లను సభ్య దేశాలుగా పేర్కొనడంతోనే ఈ తంటంతా వచ్చి పడింది. విషయంలోకి వెళితే.. శుక్రవారం అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ ప్రీ మ్యాచ్ షోలో వీరేంద్ర సెహ్వాగ్, పార్ధివ్ పటేల్‌లు పాల్గొన్నారు. మాటల్లో అఫ్గానిస్తాన్, ఐర్లాండ్లను వీరిద్దరు సభ్య దేశాలుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇరుజట్లు ఐసీసీలో శాశ్వత జట్లుగా ఎప్పుడో గుర్తింపు పొందాయి. అటు ఆఫ్గన్.. ఇటు ఐర్లాండ్‌కు టెస్టు సభ్యత్వం కూడా ఉంది. ఈ విషయం మరిచిపోయి వాటిని సభ్య దేశాలు అనడం ఒక అభిమానికి చిరాకు తెప్పించింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా సెహ్వాగ్, పార్థివ్ పటేల్‌కు చురకలంటించాడు. ''కొంచెం హుందాగా ప్రవరిస్తే మంచిది..'' అంటూ కామెంట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో సగం మ్యాచ్‌లు వర్షార్పణం అవడంతో క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడే సమయంలో ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్ ఎలా నిర్వహిస్తారంటూ ఐసీసీని దుమ్మెత్తి పోస్తున్నారు. అదేంటో గానీ ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కూడా ఒక టీమ్‌లా తయారైంది. ఈసారి గట్టిగా కురుస్తూ మ్యాచ్‌లను రద్దు చేసే పనిలో పడింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో పాయింట్ల పట్టికలో వరుణుడు టాప్‌లో ఉన్నట్లు అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. Some professionalism please... pic.twitter.com/whYV7UPuA5 — Karthik Raj (@kartcric) October 27, 2022 చదవండి: ‘భారత్‌పై గెలిస్తే నవ్వుకుంటారుగా.. అంత ఏడుపు ఎందుకులే..’ -
అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..!
ఐపీఎల్ 2022 సీజన్లో పరుగుల వరద (863 పరుగులు) పారించి, ఆతర్వాత నెదర్లాండ్తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతకుమించిన బీభత్సం (162, 86 నాటౌట్) సృష్టించిన ఇంగ్లండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గురించి శ్రీలంక లెజెండరీ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బట్లర్‌ను టెస్ట్‌ల్లో 6, 7 స్థానాల్లో కాకుండా ఓపెనర్‌గా పంపిస్తే సెహ్వాగ్‌లా సూపర్ సక్సెస్ అవుతాడని సంగక్కర అభిప్రాయపడ్డాడు. బట్లర్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంతో పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన వైనాన్ని ఇందుకు ఉదహరించాడు. సెహ్వాగ్ టీమిండియలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అతన్ని కూడా లోయర్ ఆర్డర్లో పంపారని, ఆతర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్ వచ్చాక సెహ్వాగ్ ఏం చేశాడో ప్రపంచమంతా చూసిందని అన్నాడు. ఈతరంలో బట్లర్ అంత విధ్వంసకర ఆటగాడిని చేడలేదని, అతన్ని టెస్ట్‌ల్లో కూడా ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే రెడ్ బాల్ క్రికెట్లోనూ రికార్డులు తిరగరాస్తాడని జోస్యం చెప్పాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రెచ్చిపోయి ఆడే బట్లర్ టెస్ట్‌ల్లో తేలిపోతున్న నేపథ్యంలో సంగక్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు 57 టెస్ట్‌లు ఆడిన బట్లర్.. 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 31.92 సగటున 2907 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ గతేడాది యాషెస్‌లో దారుణ పరాభవం ఎదుర్కొన్న అనంతరం బట్లర్ టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే లిమిటెడ్ ఓవర్స్‌లో అతని భీకర ఫామ్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు సంపాదించిపెడుతుందని అంతా అనుకున్నారు. అయితే టీమిండియాతో జరిగే ఐదో టెస్ట్‌కు బట్లర్‌కు పిలుపు రాకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొత్త కెప్టెన్ (స్టోక్స్), కొత్త కోచ్ (మెక్కల్లమ్) ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి టీమిండియాకు ఛాలెంజ్ విసురుతుంది. భారత్‌తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, జామీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఓలీ పోప్, జో రూట్ చదవండి: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..! -
IPL 2022: ఈ మ్యాచ్‌లో ఓడిపోయారో మీ పని ఇక అంతే!
IPL 2022 DC Vs SRH: ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం నాలుగింట మాత్రమే గెలుపొందింది. తద్వారా ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మిగతా జట్లతో పోలిస్తే పంత్ సేన నెట్రన్ రేటు పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ వరుస ఓటములు కలవరపెట్టే అంశంగా పరిణమించాయి. మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరుగనున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటర్ అజయ్ జడేజా, మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడిన అజయ్ జడేజా.. ‘‘ఈ మ్యాచ్ ఢిల్లీకి ఎంతో కీలకమైనది. మిగతా జట్ల కంటే ఢిల్లీ ఒకే ఒక్క మ్యాచ్ తక్కువగా ఆడింది. కానీ వాళ్లకు ఎనిమిది పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ వాళ్లు ఎస్ఆర్హెచ్ను ఓడించినా.. ఇతర జట్లతో కలిసి సంయుక్తంగా 10 పాయింట్లతో నిలుస్తారు. అందుకే ఈ మ్యాచ్ గెలవడం ఢిల్లీకి అత్యంత ముఖ్యం. ఇటీవలి మ్యాచ్‌లను పరిశీలిస్తే వాళ్లకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ మ్యాచ్ కూడా ఓడిపోయారంటే.. ఈ సీజన్లో వారి ప్రయాణం ముగింపునకు వచ్చినట్లే అవుతుంది’’ అని పేర్కొన్నాడు. ఇక సెహ్వాగ్ ఢిల్లీ బ్యాటర్ల వైఫల్యాన్ని ఎత్తి చూపాడు. ‘‘ఓపెనింగ్ భాగస్వామ్యాలు పర్లేదు. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు ఇంకా కూడా కుదురుకోలేకపోతున్నారు. పరుగులు సాధించలేకపోతున్నారు. ఇక అవసరమైన సమయంలో వికెట్లు తీయడంలో కూడా బౌలర్లు విఫలమవుతున్నారు’’ అని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్ తొమ్మిదింట 5 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక గత మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓడగా.. ఢిల్లీ.. లక్నో చేతిలో ఓటిమిని మూటగట్టుకుంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ మరింత కీలకంగా మారగా... గెలిచి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ 50: సన్‌రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వేదిక: బ్రబౌర్న్ స్టేడియం, ముంబై సమయం: రాత్రి 07:30 నిమిషాలకు ఆరంభం చదవండి👉🏾MS Dhoni- Virat Kohli: ‘ధోని పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా! నీ స్థాయి ఏమిటి? ఏమనుకుంటున్నావు కోహ్లి?’ The sound off #RP17's bat when he is in full swing 🤩#YehHaiNayiDilli | #IPL2022 | @RishabhPant17#TATAIPL | #IPL | #DelhiCapitals pic.twitter.com/G4rws7Qk0n — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Just 7️⃣ seconds of Bapu smashing 'em down the ground 🔥#YehHaiNayiDilli | #IPL2022 #TATAIPL | #IPL | #DelhiCapitals | @akshar2026 pic.twitter.com/OUnoYucElR — Delhi Capitals (@DelhiCapitals) May 4, 2022 Our last few games have been about small margins. It's time to seize the clutch moments, starting with today. And @tripathirahul52 concurs. 💪🏾🗣️#DCvSRH #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/JKLhXJZuJV — SunRisers Hyderabad (@SunRisers) May 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
11 ఏళ్లలో ఒకే ఒక్కడు.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక్
Mayank Agarwal First Indian Test Century Against New Zealand in Over a Decade: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిశాడు. తద్వారా మయాంక్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. దశాబ్ద కాలంలో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2010లో అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత టీమిండియా ఓపెనర్ ఎవరూ కూడా సెంచరీ సాధించలేదు. తాజాగా కివీస్‌పై మయాంక్ సెంచరీ సాధించి ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా న్యూజిలాండ్‌పై 2014 తర్వాత సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2014 లో ఆక్లాండ్ వేదికగా కివీస్‌పై శిఖర్ ధావన్ శతకం నమోదు చేశాడు. కాగా మయాంక్ ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో నాలుగో సెంచరీ. ముఖ్యంగా నాలుగు సెంచరీలు కూడా స్వదేశంలో చేసినవే కావడం గమానర్హం. చదవండి: T20 World Cup 2021: రోహిత్ శర్మను ఎలా ఔట్ చేయాలో బాబర్‌కి నేనే చెప్పా... -
కోహ్లీకి సిరాజ్ స్పెషల్ విషెస్.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: పరుగుల వీరుడు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 33వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అటు అభిమానులు, ఇటు సహచర ఆటగాళ్లు కోహ్లీకి శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆర్సీబీ సహ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఒక వీడియోద్వారా విరాట్‌కు సర్ప్రైజ్ విషెస్ అందించాడు. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే అంటూ ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. మరోవైపు టీ20 ప్రపంచ కప్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీకి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీరేంద్ర సెహ్వాగ్, బీసీసీఐ, ఐసీసీ, యూసుఫ్ పఠాన్, అజింక్యా రహానే , వసీం జాఫర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. దుబాయ్‌లో నేడు(శుక్రవారం) కీలకమై పోటీ జరగనుంది. సూపర్ 12 పోరులో మెన్ ఇన్ బ్లూ స్కాట్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో కోహ్లీ సేన కసరత్తు చేస్తోంది. Wishing a very happy birthday to @imVkohli, have a great day and year ahead 🤗 #MajorThrowback 😅 #HappyBirthdayViratKohli pic.twitter.com/doSw7m6D08 — Wasim Jaffer (@WasimJaffer14) November 5, 2021 కాగా 1988 నవంబర్ 5 వ తేదీన ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగి టీం ఇండియా సారధిగా ఎదిగాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ అనేక రికార్డులను నమోదు చేశాడు. టెస్టుల నుంచి వన్డే, టీ2 వరకు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial) 23,159 intl. runs & going strong 💪 Most Test wins as Indian captain 👍 2011 World Cup & 2013 Champions Trophy-winner 🏆 🏆 Wishing @imVkohli - #TeamIndia captain & one of the best modern-day batsmen - a very happy birthday. 🎂👏 Let's relive his fine ton in pink-ball Test 🔽 — BCCI (@BCCI) November 5, 2021 -
అమ్మ వైరల్ ఫోటోకి సెహ్వాగ్ స్పందన
న్యూఢిల్లీ : అమ్మ అంటే అమ్మే ..ఆమెకు సాటి మరెవరు రారు.. అమ్మ పడుతున్న కష్టం చూస్తుంటే కన్నీరు ఆగడం లేదని డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. అంతేకాదు ఆ అమ్మకు తక్షణమే సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆక్సిజన్ సపోర్ట్ ఆక్సిజన్ సపోర్ట్‌తో తన కుటుంబానికి వంట చేస్తున్న ఓ మాతృమూర్తి ఫోటో ఒకటి, గత రెండు రోజులుగా నెట్టింట వైరల్‌గా మారింది. తల్లి ప్రేమకు నిర్వచనం అని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు కరోనా కష్టకాలంలోనూ అమ్మకు పని చెప్పారంటూ విమర్శించారు. అయితే వీరేంద్రుడు వీరికి భిన్నంగా స్పందించాడు. తన ఫౌండేషన్ తరఫున ఆ అమ్మకు అవసరమైతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందిస్తానని... తనకు సంప్రదించాలంటూ వాట్సప్ నెంబర్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వంట చేసి పెడతాం కేవలం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందివ్వడంతోనే తన బాధ్యత తీరిపోయిందనుకోలేదు వెటరన్ క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్. ఆ అమ్మకు పని భారం తగ్గించేందుకు .. ఆమెకు, ఆమె కుటుంబం మొత్తానికి తానే ఆహారం అందిస్తానంటూ ప్రకటించాడు. ఆ అమ్మ నుంచి స్పందన రావడానికి టైం పడుతుందనే ఉద్దేశంతో తనే చొరవ తీసుకున్నాడు. ఎవరైనా ఆ.. అమ్మ అడ్రస్ , ఫోన్ నంబర్ తెలిస్తే వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్ , అమృతాషుగుప్తాలకు తెలియజేయాలని కోరాడు. -
ధోనిపై ద్రవిడ్ ఆగ్రహం; మళ్లీ ఆ అవకాశం ఇవ్వలేను
న్యూఢిల్లీ: ‘ది వాల్’ గా పేరున్న భారత మాజీకెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్వతహాగా మృదు స్వభావి. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఆయన ప్రశాంతంగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఓర్పు, సహనం ప్రదర్శించి మిస్టర్ కూల్‌కు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా వ్యవహరిస్తాడు. అయితే ఈ మిస్టర్ కూల్‌కు ధోనిపై ఓ సందర్భంలో విపరీతమైన కోపం వచ్చిందట. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ఇటీవల ద్రవిడ్ ఓ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ఈ మిస్టర్ డిపెండబుల్ కోపంతో ఊగిపోతూ కనిపిస్తుంటాడు. ప్రస్తుతం ఆ యాడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో… నిజజీవితంలో ఎప్పుడైనా ద్రవిడ్ ఆగ్రహించాడా అని చాలా మందికి ఓ ప్రశ్న ఎందురైంది. ఈ సందర్భంగా సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ద్రవిడ్ ధోనిపై ఆగ్రహించిన విషయాన్ని గుర్తు చేశాడు. 2006లో పాకిస్థాన్‌తో వన్డే సిరిస్ సమయంలో ధోనీపై ద్రవిడ్ అరిచాడని పేర్కొన్నాడు. ‘ధోనీ ఓ మ్యాచ్‌లో పాయింట్ దిశలో షాట్ కొట్టి క్యాచ్ ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ద్రవిడ్ కోప్పడ్డాడు. అలాగేనా ఆడేది..? మ్యాచ్‌ను నువ్వే ముగించాల్సింది అంటూ అరిచాడని’ తెలిపాడు. ధోని-ద్రవిడ్ ఆంగ్ల సంభాషణలో తనకీ విషయాలు అర్థమయ్యాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాతి మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అవతలి ఎండ్‌లో ఉన్న సెహ్వాగ్ వెళ్లి బౌండరీల కోసం ప్రయత్నించడం లేదని ధోనిని అడగాడట. అందుకు ధోని ‘ద్రవిడ్ తనని మళ్ళీ తిట్టడం ఇష్టం లేదని, కనుక ఇన్నింగ్స్‌ను ముగించేవరకు తాను క్రీజ్‌లోనే కొనసాగాలనుకున్నట్లు’ తెలిపాడని ఈ సందర్భంగా సెహ్వాగ్ వెల్లడించారు. ( చదవండి: రాబోయే రోజుల్లో క్రికెట్లో మార్పులపై ద్రవిడ్ వ్యాఖ్యలు ) Does #MSDhoni never answer his phone? @VirenderSehwag & Ashish Nehra bust myths around MSD, on #CricbuzzLive Hindi#IPL2021 #CSKvDC pic.twitter.com/OJUFeM5tuR— Cricbuzz (@cricbuzz) April 10, 2021 -
మా పాజీ తర్వాత మ్యాచ్ ఆడుతాడా!
ముంబై: టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఎప్పుడు ముందుంటాడు. మొన్నటికి మొన్న మెదుడు ఫోటో షేర్ చేసి ఇంగ్లండ్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన సెహ్వాగ్ తాజాగా సచిన్‌కు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో సచిన్ ఫిజియో పక్కన కూర్చొని తన మణికట్టు కింది భాగంలో సూదులు గుచ్చుకొని కనిపిస్తాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్.. ఫిజియోను ఉద్దేశించి '' సచిన్ పాజీ తర్వాతి మ్యాచ్ ఆడుతాడా'' అంటూ అడిగాడు. దీనికి ఫిజియో... అవునన్నుట్లుగా తలూపాడు.. అయితే సచిన్ మాత్రం.. ఏదో ఇది చిన్న ప్రయత్నం మాత్రమే.. ఎందుకంత బాధపడుతున్నావు అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. దీంతో పక్కనే ఉన్న యువరాజ్ ..''నీకు ఇలానే కావాలి వీరు బాయ్'' అంటూ చమత్కరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రోడ్ సేఫ్టీ అవగాహనలో భాగంగా మాజీ క్రికెటర్లంతా కలిసి రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 పేరిట సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. సచిన్ కెప్టెన్సీలో సెహ్వాగ్, యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ సహా ఇతర ఆటగాళ్లు ఇండియా లెజెండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 5న బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 35 బంతుల్లోనే 80 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. 33 పరుగులతో సచిన్ అతనికి సహకరించాడు. కాగా ఇండియా లెజెండ్స్ తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెజెండ్స్‌ను ఎదుర్కోనుంది. చదవండి: వీరు విధ్వంసం.. 35 బంతుల్లో 80 పరుగులు సచిన్ పాజీతో మళ్లీ బ్యాటింగ్.. సూపర్ ఇన్నింగ్స్! Pratikriya from God ji @sachin_rt pic.twitter.com/AekD0vEaLZ — Virender Sehwag (@virendersehwag) March 8, 2021 -
డీజేలో తాత చిందులు.. కర్రతో బామ్మ ఎంట్రీ..
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరచూ ఆసక్తికర విషయాలను, సరదాల సంఘటనలను పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అంతేగాక ఆ పోస్టులపై తనదైన శైలిలో చురకలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ ఆకట్టుకుంటుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో ఓ తాత డీజేలో కుర్రాళ్లతో సమానంగా చిందేలేస్తు కనిపించాడు. అలా పెళ్లి డీజేలో డ్యాన్స్ చేస్తున్న ఆ తాత దగ్గరికి అతడి భార్య ఆకస్మాత్తుగా చేతి కర్రతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటివరకు ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేస్తున్న ఆ వృద్దుడు ఆమెను చూడగానే హడలేత్తిపోయాడు. ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ వీడియోని వీరూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘వయసు తాత్కాలికం.. కానీ భార్య చేతి కర్ర మాత్రం శాశ్వతం’ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Virender Sehwag (@virendersehwag) -
రహానే కెప్టెన్సీ భేష్..
మెల్బోర్న్: ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా బౌలర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్, బుమ్రా, సిరాజ్ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కితాబిచ్చాడు. అదే విధంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే ఎంతో తెలివిగా ఫీల్డింగ్ సెట్ చేశాడంటూ కొనియాడాడు. ఈ మేరకు.. ‘‘మొదటి రోజు ఆటలోనే, కేవలం 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేయడం గొప్ప విషయం. రహానే, బౌలర్ల సేవలను ఉపయోగించుకున్న తీరు అమోఘం. ఫీల్డింగ్ విషయంలో కూడా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్, బుమ్రా, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించే విధంగా చేయాల్సిన బాధ్యత బ్యాటర్లపై ఉంది’’ అని వీరూ ట్వీట్ చేశాడు. (చదవండి: రెండో టెస్టు: హో విల్సన్, ఇది చీటింగ్!) ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం జట్టు ఆట తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలి రోజు. బౌలర్లు గొప్పగా రాణించారు. అద్భుతమైన ముగింపు కూడా’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా తన భార్య, నటి అనుష్క శర్మ తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో కోహ్లి పితృత్వ సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో అజింక్య రహానే తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీసి సత్తా చాటడంతో.. ఆసీస్‌ను 195 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా బాక్సింగ్ డే టెస్టుతో హైదరాబాదీ సిరాజ్ సంప్రదాయ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. Top day 1 for us. Great display from the bowlers and a solid finish too. 🇮🇳👏 — Virat Kohli (@imVkohli) December 26, 2020 -
'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు'
ఢిల్లీ : ఆసీస్‌తో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన యజ్వేంద్ర చహల్ మూడు కీలక వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. టీమిండియా గెలిచినదానికంటే కాంకషన్ పద్దతిలో ఆటగాడిని తీసుకొచ్చి గెలిచిదంటూ ఆసీస్ జట్టు ఆరోపణలు చేసింది. అయితే టీమిండియా తీసుకున్న కాంకషన్ నిర్ణయం కరెక్టేనా అన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. (చదవండి : టీమిండియా ‘కాంకషన్’ రైటా... రాంగా!) 'టీమిండియా కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌పై తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. బ్యాటింగ్ సమయంలో స్టార్క్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే నొప్పి వస్తుందని చెప్పలేం.. గాయం నొప్పి తెలియడానికి గంట పట్టొచ్చు.. ఒక్కసారి 24 గంటలు కావొచ్చు. ఆ సమయంలో జడేజాకు నొప్పి తెలియలేదు.. ఫిజియో రాకపోయినా బ్యాటింగ్ చేశాడు. కానీ ఇన్నింగ్స్ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే హెల్మట్ తీసిన జడేజాకు నొప్పి తెలిసినట్లుంది. అందుకే ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో అతను ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్ సమయంలో ఎవరైనా ఆటగాడు గాయపడితే కాంకషన్ సబ్‌స్టిట్యూట్ కింద వేరొక ఆటగాడిని బ్యాటింగ్ లేదా బౌలింగ్‌కు అనుమతించొచ్చని ఐసీసీ నిబంధనల్లో ఉంది. దానినే టీమిండియా ఆచరించింది. జడేజా స్థానంలో చహల్‌ను కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఆడించింది. చహల్ మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు కాబట్టి ఇప్పుడు కాంకషన్ పదం ఆసీస్‌కు వివాదంలా కనిపిస్తుంది. అదే ఒకవేళ టీమిండియా ఓడిపోయుంటే ఆసీస్ ఇలానే వివాదం చేసేదా.. అయినా కాంకషన్ నిర్ణయంపై ఆసీస్‌కు మాట్లాడే అర్హత లేదు, ఎందుకంటే కాంకషన్‌ను మొదట ఉపయోగించిదన్న విషయం అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఇదే ఆసీస్ గాయపడిన స్మిత్ స్థానంలో మార్నస్ లబుషేన్‌ను ఆడించింది. ఆ మ్యాచ్‌లో లబుషేన్ రాణించడమే గాక జట్టును గెలిపించాడు.నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా తలకు చాలాసార్లు గాయాలు అయ్యాయి.. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ మా రోజుల్లో ఇలాంటి రూల్స్ లేకపోవడంతో 10 మందితోనే ఆటను కొనసాగించేవారు. అయినా మ్యాచ్ రిఫరీ బూన్ తన విచక్షణాధికారంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కాంకషన్‌పై ఆసీస్ ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది' అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి : నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్) -
అలా సెహ్వాగ్ వార్తల్లో ఉంటాడు: మాక్స్వెల్
మెల్బోర్న్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనపై చేసిన విమర్శలపై ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్పందించాడు. తనపై ఉన్న అయిష్టాన్ని వెళ్లగక్కడం వీరూకు ఇష్టమని, తను ఏదైనా మాట్లాడగలడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 సీజన్లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేక చతికిలబడ్డాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘‘10 కోట్ల చీర్లీడర్’’ అంటూ సెహ్వాగ్ మాక్స్‌వెల్‌ను ఎద్దేవా చేశాడు. కోట్లు పెట్టి కొన్న జట్టుకు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో, యూఏఈలో అత్యంత ఖరీదైన వెకేషన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేశాడంటూ విమర్శించాడు. (చదవండి: ‘రాహుల్ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను’) ఇక వీరూ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన మాక్స్వెల్.. ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్‌తో మాట్లాడుతూ.. ‘‘మరేం పర్లేదు. వీరూ నా మీద ఉన్న అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. తనకు నచ్చింది మాట్లాడే హక్కు అతడికి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలతో తను తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. బాగుంది. దీని గురించి నేను పట్టించుకోను’’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ల ప్రదర్శనపై తీవ్ర అసహనంతో ఉన్న పంజాబ్ జట్టు యాజమాన్యం వారిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... భారీ మార్పులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో తొలి అర్ధభాగంలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. అయితే చివరి రెండు మ్యాచుల్లో ఓడటంతో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. -
అదుర్స్: రజనీ గెటప్‌లో సెహ్వాగ్!
ఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ మొదలైనప్పటి నుంచి ‘వీరు కి బైఠక్’ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి ఆకట్టున్నాడు. ఈ సారి సూపర్ స్టార్ రజనీకాంత్ గెటప్‌లో.. ముంబైతో మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన చెన్నై జట్టుపై విమర్శలు గుప్పించాడు. చెన్నై జట్టును సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా కాపాడలేడని తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చేసరికి.. చెన్నై టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరడమేంటని విస్మయం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు తమ ఆటగాళ్లు బంతిని బాదిన శబ్దానికి సంబరపడేవాళ్లని, కానీ నిన్నటి మ్యాచ్‌లో.. బంతి వికెట్‌ను గిరాటేయకుంటే చాలని భావించారని అన్నాడు. దీంతోపాటు ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లలో ఫిట్నెస్ పెద్దగా లేని ఆటగాళ్లకు వీరు చురకలు వేశాడు. గాయం కారణంగా చెన్నైతో మ్యాచ్‌కి దూరమైన రోహిత్ శర్మ స్థానంలో సౌరభ్ తివారీ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, బరువు విషయంలో రోహిత్ కన్నా సౌరబ్ తక్కువ వాడేం కాదనే ఉద్దేశంలో.. ‘వడా పావ్‌కు బదులు.. సమోసా పావ్ మ్యాచ్‌లో పాల్గొంది’ అని వీరు చమత్కరించాడు. ఇక చెన్నై జట్టులోని 41 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్‌ను తాహిర్ చాచా (అంకుల్) అని వీరు పేర్కొన్నాడు. కాగా, షార్జా వేదికగా ముంబైతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. 9 వికెట్లకు 114 పరుగులు మాత్రమే చేసింది. అందులో సామ్ కరన్ ఒక్కడివే 52 పరుగులు. ఇక సమష్టి ప్రదర్శనతో ముంబై అలవోక విజయం సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. -
జాతీయ క్రీడా పురస్కారాల కమిటీలో సెహ్వాగ్, సర్దార్
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా అవార్డుల విజేతలను ఎంపిక చేసే సెలక్షన్ కమిటీని శుక్రవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నియమించింది. 12 మంది సభ్యుల ఈ కమిటీలో భారత మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌లు చోటు దక్కించుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్ శర్మ ఈ ప్యానల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. వీరితో పాటు రియో పారాలింపిక్స్ రజత పతక విజేత దీపా మలిక్, మాజీ టీటీ ప్లేయర్ మోనాలిసా బరువా మెహతా, భారత మాజీ బాక్సర్ వెంకటేశన్ దేవరాజన్, ‘సాయ్’ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రదాన్, సంయుక్త కార్యదర్శి ఎల్ఎస్ సింగ్, ‘టాప్స్’ సీఈవో రాజేశ్ రాజగోపాలన్, క్రీడా వ్యాఖ్యాత మనీశ్ బతావియా, క్రీడా పాత్రికేయులు అలోక్ సిన్హా, నీరూ భాటియా సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు. -
‘గిల్‌క్రిస్ట్-సెహ్వాగ్‌ల ఓపెనింగ్ చూడాలి’
సిడ్నీ: పదకొండు మంది సభ్యులతో కూడిన భారత్-ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ అత్యుత్తమ వన్డే జట్టును ఆసీస్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు. గురువారం ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జట్టును ప్రకటించాడు. అయితే ఫించ్ ప్రకటించిన జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు లేకపోవడం గమనార్హం. అయితే టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనికి అనూహ్యంగా వన్డే జట్టులో అవకాశం కల్పించాడు. ఓపెనర్లను ఎంపిక చేయడానికి ఫించ్ తర్జనభర్జన పడ్డాడు. ఒక ఓపెనర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఎంపిక చేయగా.. అతడికి జోడిగా ఎవరిని తీసుకోవాలనేదానిపై తీవ్రంగా ఆలోచించాడు. (సోషల్ మీడియాకు దూరంగా ధోని..) ‘నా తొలి ప్రాధాన్యత వీరేంద్ర సెహ్వాగే. బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. కానీ అతని ఆట ముగిసింది. దీంతో రోహిత్ శర్మను తీసుకుంటున్నా. అతని వన్డే రికార్డులు అత్యద్భుతం. కానీ గిల్‌క్రిస్ట్-సెహ్వాగ్‌లు ఓపెనర్లుగా దిగి ఆడితే చూడాలని ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో మూడు, నాలుగు స్థానాల కోసం రికీ పాంటింగ్, విరాట్ కోహ్లిలను ఎంపిక చేస్తా. హార్దిక్ పాండ్యా, ఆండ్రూ సైమండ్స్‌లు ఆల్‌రౌండర్ల స్థానాన్ని భర్తీ చేస్తారు’ అని ఫించ్ వివరించారు. ఇక వీరితో పాటు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనిని కూడా భారత్-ఆసీస్ వన్డే జట్టులో ఎంపిక చేశాడు. అయితే ధోని భవిత్యంపై మాట్లాడేందకు ఫించ్ నిరాకరించాడు. ‘ధోని భవిష్యత్‌పై మాట్లాడను. అతడు ఒక అద్భుతమైన ఆటగాడు. ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పటికీ ధోని ఆటను ఆస్వాదిస్తుంటాను. అయితే అతని భవిష్యత్‌పై వస్తున్న వార్తలపై స్పందించలేను. ఎందుకంటే వాటి గురించి నాకు తెలియదు’ అని ఫించ్ అన్నాడు. ఇక బ్రాడ్ హాగ్, హర్భజన్ సింగ్‌లలో ఒకరిని స్పిన్నర్‌గా జట్టుతోకి తీసుకుంటానని ఫించ్ పేర్కొన్నాడు. బ్రెట్‌లీ, గ్లెన్ మెక్‌గ్రాత్, జస్ప్రిత్ బుమ్రాలతో బౌలింగ్ విభాగాన్ని భర్తీ చేశాడు. (విదేశాల్లో ఐపీఎల్-2020?) -
‘అక్తర్.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు’
ఇస్లామాబాద్: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ క్రికెట్, క్రికెటేతర విషయాలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తన యూట్యూబ్ ఛానళ్లో ఆసక్తికర, సంచలన, వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుండే అక్తర్‌కు ఎందుకో మూడేళ్ల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకొచ్చాయి. దీంతో వెంటనే ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను రూపొందించి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. అయితే అనేదంతా అనేసి చివర్లో ‘వీరూ భాయ్ సరదాగా అన్నాను.. నా వ్యాఖ్యలను నువ్వు కూడా సరదాగా తీసుకో’అని అక్తర్ పేర్కొనడం కొసమెరుపు. ఇక అక్తర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్తర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని సెహ్వాగ్ ప్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. భారత్, భారత క్రికెట్ గురించి మాట్లాడకుంటే పాకిస్తాన్ క్రికెటర్లకు వ్యాపారం సాగదు కదా అని సెహ్వాగ్ అప్పుడెప్పుడో వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అక్తర్ మూడేళ్ల తర్వాత రియాక్ట్ అయ్యాడు. ‘నా స్నేహితుడు సెహ్వాగ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. డబ్బు, వ్యాపారం కోసమే అక్తర్ భారత క్రికెట్ గురించి మాట్లాడతాడంటూ ఆ వ్యాఖ్యల్లో ఉంది. అయితే వీరూ భాయ్‌కు ఒక్కటే చెప్పదల్చుకున్నారు. డబ్బు అనేది నాకు భారత్ ఇచ్చింది కాదు. ఆ భగవంతుడు ఇచ్చాడు. నీ(సెహ్వాగ్) తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ డబ్బే నా దగ్గర ఉంది. పదిహేనేళ్లు పాకిస్తాన్ తరుపున సుదీర్ఘ క్రికెట్ ఆడటంతో నాకు పేరు, ప్రఖ్యాతలతో పాటు సరిపడేంత డబ్బు సంపాదించుకున్నాను. ఇంకా డబ్బు కోసం ఎందుకు వెంపర్లాడుతాను. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓడిపోయిన తర్వాత నా అభిప్రాయాలు చెప్పాను. ఇక టీమిండియా సిరీస్ గెలిచాక మెచ్చుకున్నాను. కోహ్లి సేన ఓడిపోయినప్పుడు నేను చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా గతంలో ఎప్పుడో సెహ్వాగ్ అన్న మాటలను తాజాగా ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు. అందుకే నేను చెప్పాల్సింది చెప్పాను. అయితే సెహ్వాగ్‌పై నాకు ఎలాంటి కోపం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. సెహ్వాగ్ చాలా సరదా వ్యక్తి. సరదాగా వ్యాఖ్యలు చేస్తుంటాడు. అయితే ఆ వ్యాఖ్యలు కూడా సరదాగానే అని ఉంటాడని భావిస్తున్నా’అని అక్తర్ పేర్కొన్నాడు. అయితే చివర్లో తన వ్యాఖ్యలను సరదాగా తీసుకోవాలని సీరియస్‌గా తీసుకోవద్దని సెహ్వాగ్‌తో పాటు భారత ఫ్యాన్స్‌కు అక్తర్ విజ్ఞప్తి చేయడం గమనార్హం. చదవండి: కోహ్లి అప్పుడా వచ్చేది? ‘4 దగ్గర లైఫ్ ఇచ్చారు.. 264 కొట్టాడు’ -
మా తరంలో మ్యాచ్ విన్నర్ అతడే: దాదా
ముంబై: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సహచర క్రికెటర్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. తన క్రికెట్ కెరీర్లో అతిపెద్ద మ్యాచ్ విన్నర్ వీరేంద్ర సెహ్వాగే అని కితాబిచ్చాడు. భారత బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో కలసి ఎన్నో మ్యాచ్‌ల్లో ఆడిన గంగూలీ... తన తరంలో అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా మాత్రం వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంచుకున్నాడు. ‘ఓపెనర్‌గా సెహ్వాగ్ మా కాలంలో అతిపెద్ద మ్యాచ్ విన్నర్. అతడిని ఓపెనర్‌గా బరిలోకి దిగమని చెప్పింది నేనే. అలాగే జట్టు కోసం అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగడానికి సన్నద్ధంగా ఉండాలని సైతం చెప్పాను. వన్డేల్లో నాలుగు, ఐదు స్థానాల్లో నేను బ్యాటింగ్ చేస్తే పూర్తిగా రాణించలేను. సచిన్ కూడా మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తే ప్రస్తుతం అతడి ఖాతాలో ఉన్న పరుగుల్లో సగమే చేసేవాడేమో. అందుకే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సెహ్వాగ్‌ను బ్యాటింగ్ చేయమని చెప్పా. ఆ నిర్ణయం సెహ్వాగ్‌కు టీమిండియాకు ఎంతో లాభించింది’అని గంగూలీ వ్యాఖ్యానించాడు. -
కంటతడి పెట్టిస్తున్న ఫొటో
న్యూఢిల్లీ: బాలల దినోత్సవం సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేసిన ఫొటో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. 1938లో బ్రిటీష్ వారి తుపాకీ గుళ్లకు బలైపోయిన బాజీ రౌత్ అనే బాలుడిని స్మరించుకుంటూ సెహ్వాగ్ చేసిన పోస్టు మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. దేశ రక్షణకై బాల్యంలోనే అతడు చూపిన ధైర్యసాహసాలను కొనియాడిన సెహ్వాగ్... బాలల దినోత్సవం నాడు బాజీని గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకతను తన పోస్టులో వివరించాడు. అతి చిన్న వయస్సులోనే ప్రజల రక్షణకై ప్రాణాలు విడిచిన బాజీని భారతదేశపు స్వాతంత్ర్య పోరాటంలో తొలి(పిల్లవాడైన) అమరుడిగా అభివర్ణించాడు. ఈ మేరకు.. ‘ఒడిశాలోని నీలకాంతపూర్‌కు చెందిన అమరుడు బాజీ రౌత్. తనకు పన్నెండేళ్లు ఉన్నపుడు.. ఓ బ్రిటీష్ దళం తమను పడవలో ఎక్కించుకుని బ్రాహ్మణి నది అవతలి తీరానికి తీసుకువెళ్లాల్సిందిగా అడిగింది. అయితే అదే దళం తమ గ్రామంలోని ఎంతో మంది అమాయకులను అత్యంత పాశవికంగా చంపిందంటూ వారి గురించి కథలు కథలుగా విన్న బాజీ.. వారు తీరం దాటితే ఇంకెంతో విధ్వంసం సృష్టిస్తారు కదా ఆలోచించాడు. అందుకే తీరం దాటించే ప్రసక్తే లేదని వారితో కరాఖండిగా చెప్పాడు. దాంతో చంపేస్తామంటూ బ్రిటీష్ సేనలు బాజినీ భయపెట్టాయి. అయినప్పటికీ బాజీ వారికి తలొగ్గలేదు. వాళ్ల మాటలకు ఎదురుచెప్పాడు. ఇంతలో కోపోద్రిక్తుడైన ఓ బ్రిటీష్ సైనికుడు బాజీ తల మీద తుపాకీ వెనుక భాగంతో గట్టిగా కొట్టాడు. దాంతో అతడు కిందపడిపోయాడు. అయినప్పటికీ బాజీ మెల్లగా శక్తినంతా కూడగట్టుకుని పైకి లేచి.. తాను బతికున్నంత కాలం వాళ్లను అవతలి తీరానికి చేర్చేది లేదని తేల్చిచెప్పాడు. అప్పుడు వెంటనే ఓ సైనికుడు తన కత్తిని బాజీ తలలోకి దింపగా... మరొకడు ఆ చిన్నారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో బాజీతో పాటు అక్కడే ఉన్న అతడి స్నేహితులు లక్ష్మణ్ మాలిక్, ఫగూ సాహో, హృషి ప్రదాన్, నాటా మాలిక్ కూడా మృత్యువాత పడ్డారు. బాలల దినోత్సవం నాడు ఆ ధైర్యశాలికి సెల్యూట్ చేస్తున్నా. అత్యంత పిన్నవయసులో అసువులు బాసిన ఆ అమరుడు మరింత గుర్తింపునకు అర్హుడు’ సెహ్వాగ్ తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో.. ‘చాలా గొప్ప వ్యక్తిని గుర్తుచేశారు. అతడి త్యాగం మరవలేనిది. ఆ అమాయకపు ముఖం కంటతడి పెట్టిస్తోంది. మీకు ధన్యవాదాలు వీరూ భాయ్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా బాజీ రౌత్ ఒడిశాలోని నీలకాంత్‌పూర్‌లో 1926లో జన్మించాడు. పేద కుటుంబానికి చెందిన అతడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. అతడి తల్లి ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో 1938లో బాజీ రౌత్ బ్రిటీష్ సేనల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. -
‘4 దగ్గర లైఫ్ ఇచ్చారు.. 264 కొట్టాడు’
భారత క్రికెట్‌కు దూకుడు మంత్రం నేర్పింది వీరేంద్ర సెహ్వాగ్.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెహ్వాగ్ తర్వాత మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అప్పుడే వచ్చాడు మట్టిలో మాణిక్యం అనుకోవాలో.. సముద్రంలో సునామీ అనుకోవాలో.. బౌలర్ల్ హిట్ లిస్ట్‌లో ఉండే ఆ హిట్ మ్యాన్ ఎవరో ఇప్పటికే అర్థమైందనుకుంటా. టీమిండియా ఓపెనర్, సిక్సర్ల కింగ్, సెహ్వాగ్ స్క్వేర్, అభిమానులు ముద్దుగా పిలిచే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటికే చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. (చదవండి: ప్రతీ క్షణం అతడి గురించే చర్చ) వన్డే క్రికెట్లో అసాధ్యమనుకునే డబుల్ సెంచరీని అవలీలగా మూడు సార్లు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ. తొలి డబుల్ సెంచరీ సాధించనప్పుడు ఏదో గాలి వాటమనుకున్నారు.. రెండో ద్విశతకం సాధించనప్పుడు ప్రత్యర్థి జట్టుకే కాదు.. భారత ఫ్యాన్స్‌కు నిద్రలోనూ రోహిత్ బ్యాటింగే గుర్తొచ్చేదంటే అతిశయోక్తి కాదు. బౌండరీ నలువైపులా చూడముచ్చటైన షాట్లు.. ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్లు.. రోహిత్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలో దిక్కుతోచక పసిపిల్లలయ్యారు. ఈ అపూర్వ ఘట్టం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో చోటుచేసుకుంది. రోహిత్ విశ్వరూపం ప్రదర్శించి 264 పరుగులు చేసిన ఆ మ్యాచ్ జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రోహిత్ సాధించిన ఘనతను గుర్తుచేస్తూ ఐసీసీ, బీసీసీఐ ట్వీట్ చేసింది. అంతేకాకుండా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఆ మ్యాచ్‌లో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు చేసి వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు. ఇక ట్రిపుల్ సెంచరీ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు అనే రీతిలో రోహిత్ బ్యాటింగ్ సాగింది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ నాలుగు పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను లంక ఆల్‌రౌండర్ తిశార పెరీరా నేలపాలు చేశాడు. దీంతో లంక భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ముఖ్యంగా ఆ క్యాచ్ వదిలేసినందుకు పెరీరా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో.. ఇక రోహిత్ సునామీ ఇన్నింగ్స్‌కు టీమిండియా నాలుగు వందలకుపైగా స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో 153 పరుగుల భారీ తేడాతో కోహ్లి సేన ఘన విజయం సాధించింది. అంతకుముందు.. ఆ తర్వాత రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియాపై సాధించాడు. 2013లో నవంబర్ 2న బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొలి డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియాలో అతడికి సుస్థిర స్థానం ఖాయమైంది. ఇక ఆ తర్వాత ఏడాది శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. అనంతరం 2017లో లంకపై మరోసారి తన ప్రతాపం చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ట్రిపుల్ డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్‌తో పాటు ఇంకెవరు? వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చరిత్రలో నిలిచిపోయాడు. 2010లో దక్షిణాఫ్రికాపై ఆ ఘనత సాధించి వన్డేల్లోనూ ద్విశతకం సాధించవచ్చని సచిన్ ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపించాడు. ఇక సచిన్ శిష్యుడు వీరేంద్ర సెహ్వాగ్ గురువు దారిలోనే పయనించాడు. 2011లో ఇండోర్ స్టేడియంలో వెస్టిండీస్‌పై 219 పరుగులు సాధించి గురువును మించిన శిష్యుడయ్యాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ వెస్టిండీస్‌పై(237 నాటౌట్), యూనివర్సల్ స్టార్ క్రిస్ గేల్ జింబాబ్వే(215)పై ద్విశతకాలు నమోదు చేశారు. అయితే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఇప్పటివరకు రెండు అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ. (చదవండి: మనసులో మాట బయటపెట్టిన రోహిత్) #OnThisDay in 2014, Rohit Sharma went big! The Indian opener smashed 264, the highest ever ODI score 🤯 The worst part? Sri Lanka dropped him when he was on 4 🤦 pic.twitter.com/E6wowdoGUL — ICC (@ICC) November 13, 2019 -
సెహ్వాగ్.. సెహ్వాగే: రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: మాజీ డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్‌తో తనను పోల్చడం సరికాదని టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు. తామిద్దరం ఒకేలా ఆడతాం అని జనం అనుకుంటున్నారని చెప్పాడు. అయితే సెహ్వాగ్‌తో కలిపి తన పేరు వినబడటం సంతోషంగానే ఉందని పేర్కొన్నాడు. ‘కానీ సెహ్వాగ్ సెహ్వాగే. క్రికెట్లో అతడు సాధించినవి నిరూపమానం. నా వరకు జట్టు ఏదైతే కోరుకుంటుందో అది అందించడమే నా పని. ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే నా సంతోషం రెట్టింపవుతుంది. తన సొంత ఆటతీరును సెహ్వాగ్ కూడా ఇష్టపడ్డాడు. అతడు అలా ఆడాలని జట్టు కోరుకుంది. ఇలాంటి పరిస్థితే నాకు ఇప్పుడు ఉంది. నేను ఎలా ఆడాలని టీమ్ అనుకుంటుందో అలా ఆడటానికి ప్రయత్నిస్తున్నాను. దీంతో చాలా సమస్యలు పరిష్కారమవుతున్నాయ’ని రోహిత్ శర్మ అన్నాడు. టెస్టులో ఓపెనర్‌గా సత్తా చాటడం పట్ల ‘హిట్‌మాన్’ సంతోషం వ్యక్తం చేశాడు. ఓపెనర్‌గా ముందుగానే వచ్చివుంటే బాగుండేమోనన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందన్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా అవకాశం ఆలస్యంగా వచ్చినా తనకు మంచే జరిగిందన్నాడు. ఈడెన్ గార్డెన్లో పింక్ బాల్‌తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు రోహిత్ శర్మ చెప్పాడు.