
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో పోస్టులు ఎంత సరదాగా ఉంటాయో.. ఒక్కోసారి అంత ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. తోటి ఆటగాళ్లపై సెటైర్లు వేయటమే కాదు.. సామాజిక అంశాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటారు.
ఈ క్రమంలో కుల, మతాలపై వీరూ చేసిన ఓ పోస్టు తెగ వైరల్ అవుతోంది. వాట్సాప్‌లో గాడ్ (దేవుడు) పేరిట వరల్డ్(ప్రపంచం) అనే గ్రూప్‌ను సృష్టించి.. దానికి మనుషులు, ప్రేమ, మానవత్వాన్ని యాడ్ చేశారు. ఆపై మనుషులు దానికి కులం, మతాల్ని జత చేర్చగా... భరించలేని దేవుడు గ్రూప్ నుంచే ఎగ్జిట్ అయిపోయాడు. దీనిని వీరూ సరిగ్గా సరిపోయేది అంటూ తన ట్విట్టర్‌లో గురువారం పోస్టు చేశాడు.
పాతదే అయినప్పటికీ వీరూ అకౌంట్‌లో ఇది దర్శనమివ్వటం.. ఆలోచింపజేసేలా ఉండటంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు కూడా మళ్లీ దానిని రీ ట్వీట్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
Very apt ! pic.twitter.com/bDBVy2T1YX
— Virender Sehwag (@virendersehwag) January 4, 2018