న్యూఢిల్లీ: మాజీ డాషింగ్ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్‌తో తనను పోల్చడం సరికాదని టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అన్నాడు. తామిద్దరం ఒకేలా ఆడతాం అని జనం అనుకుంటున్నారని చెప్పాడు. అయితే సెహ్వాగ్‌తో కలిపి తన పేరు వినబడటం సంతోషంగానే ఉందని పేర్కొన్నాడు.
‘కానీ సెహ్వాగ్ సెహ్వాగే. క్రికెట్‌లో అతడు సాధించినవి నిరూపమానం. నా వరకు జట్టు ఏదైతే కోరుకుంటుందో అది అందించడమే నా పని. ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే నా సంతోషం రెట్టింపవుతుంది. తన సొంత ఆటతీరును సెహ్వాగ్ కూడా ఇష్టపడ్డాడు. అతడు అలా ఆడాలని జట్టు కోరుకుంది. ఇలాంటి పరిస్థితే నాకు ఇప్పుడు ఉంది. నేను ఎలా ఆడాలని టీమ్ అనుకుంటుందో అలా ఆడటానికి ప్రయత్నిస్తున్నాను. దీంతో చాలా సమస్యలు పరిష్కారమవుతున్నాయ’ని రోహిత్ శర్మ అన్నాడు.
టెస్టులో ఓపెనర్‌గా సత్తా చాటడం పట్ల ‘హిట్‌మాన్’ సంతోషం వ్యక్తం చేశాడు. ఓపెనర్‌గా ముందుగానే వచ్చివుంటే బాగుండేమోనన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందన్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా అవకాశం ఆలస్యంగా వచ్చినా తనకు మంచే జరిగిందన్నాడు. ఈడెన్ గార్డెన్‌లో పింక్ బాల్‌తో జరగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు రోహిత్ శర్మ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment