
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కొత్త లుక్ తళుక్కున మెరిశాడు. తలకు నలుపు రంగు గుడ్డ కట్టుకుని టీషర్ట్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ధోని వీడియోను అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముంబైలో వాణిజ్య ప్రకటనల చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలు, అభిమానులతో కలిసి ధోని దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పారామిలటరీలో సేవలందించి తిరిగొచ్చిన ‘మిస్టర్ కూల్’ ఇప్పుడు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. భారత సైన్యంలో 106 టీఏ పారామిలటరీ బెటాలియన్‌తో కలిసి 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ధోని ఆగస్టు 15న లేహ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
కాగా, ధోని రిటైర్‌మెంట్‌లో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రిటైర్‌మెంట్ విషయంలో ధోనికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఫిట్‌గా ఉన్నంతకాలం అతడిని కొనసాగించాలని సూచించాడు. ఆటకు ఎప్పుడు వీడ్కోలు చెప్పాలో ధోనికి తెలుసునని అన్నాడు. (చదవండి: సైనిక దుస్తుల్లో ధోని బ్యాటింగ్; విజిల్ పోడు..!)
Comments
Please login to add a commentAdd a comment