
‘సంతోషకరమైన నా క్రికెట్ ప్రయాణంలో ఇది నా చివరి సీజన్. రిటైర్మెంట్‌లోగా రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడతాను. బెంగాల్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఈ సీజన్‌ను మర్చిపోలేనిదిగా మార్చుకుంటాం’ అంటూ టీమిండియా వెటరన్ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు. భారత అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా చెప్పుకోదగ్గ సాహాకు రావాల్సినన్ని అవకాశాలు రాలేదనే చెప్పవచ్చు.
ధోని నీడలో..
నిజానికి వికెట్ కీపర్‌గా సాహా అద్భుత ప్రతిభావంతుడు. గత కాలపు భారత కీపర్లు సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా తరహాలో అత్యుత్తమ కీపింగ్ నైపుణ్యంతో పాటు అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల సమర్థుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందాడు. దేశవాళీ క్రికెట్‌లో బెస్ట్ కీపర్‌గా పేరు వచ్చినా... టీమిండియాను శాసిస్తున్న ధోని ఉండటంతో అతను తన చాన్స్ కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.
2010లో నాగపూర్ టెస్టుకు ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా గాయపడటంతో సాహాకు బ్యాటర్‌గా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది. మరో రెండేళ్ల తర్వాత స్లో ఓవర్‌రేట్ కారణంగా ధోనిపై నిషేధం పడటంతో రెండో టెస్టు దక్కింది.
ఎట్టకేలకు 2014–15 ఆసీస్ పర్యటనలో తొలి టెస్టు తర్వాత ధోని అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో సాహా అసలు కెరీర్ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు ఐదేళ్ల పాటు ప్రధాన కీపర్‌గా సాహా తన సత్తాను ప్రదర్శిస్తూ ప్రపంచ అత్యుత్తమ కీపర్లలో ఒకడిగా నిలిచాడు.
పంత్ రాకతో పాత కథ మళ్లీ మొదలు
స్వదేశంలో గిర్రున తిరిగే అతి కష్టమైన స్పిన్ బంతులనైనా, విదేశీ గడ్డపై సీమ్ బంతులనైనా స్టంప్‌ల వెనక చురుగ్గా, సమర్థంగా అందుకోవడంలో అతనికి అతనే సాటిగా నిలిచాడు. బ్యాటింగ్‌లో కూడా కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అయితే రిషభ్ పంత్ దూసుకొచ్చిన తర్వాత సాహా వెనుకబడిపోయాడు.
పంత్ ఉన్నప్పుడు కూడా కొంత కాలం రెండో కీపర్‌గా జట్టులో అవకాశం దక్కినా అది ఎంతో కాలం సాగలేదు. కోచ్ ద్రవిడ్ ‘ఇకపై నీ పేరును పరిశీలించం’ అంటూ సాహాకు నేరుగా చెప్పేయడంతో అతని టెస్టు కెరీర్ ముగిసింది.
ఐపీఎల్‌లో అదే హైలైట్
2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ ఆడిన కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో సాహా కూడా ఉన్నాడు. కోల్‌కతా, చెన్నై, పంజాబ్, హైదరాబాద్, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రయిక్‌రేట్‌తో 2934 పరుగులు సాధించాడు.
ఇక 2014లో ఫైనల్లో పంజాబ్ తరఫున 55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో అజేయంగా 115 పరుగులు సాధించిన ప్రదర్శన అతని ఐపీఎల్ కెరీర్‌లో హైలైట్. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు.
అతడిని తన వారసుడిగా తీర్చిదిద్ది
బెంగాల్ యువ కీపర్ అభిషేక్ పొరేల్‌కు మెంటార్‌గా వ్యవహరించి తన వారసుడిగా అతడిని సాహా తీర్చిదిద్దాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)తో విభేదాల కారణంగా రెండేళ్లు త్రిపుర తరఫున ఆడిన సాహా ఈ సీజన్‌లో మళ్లీ తిరిగొచ్చాడు.
అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్
ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాహా... ఈ టోర్నీనే తనకు చివరిదని వెల్లడించాడు. మూడేళ్ల క్రితమే చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన 40 ఏళ్ల సాహా రంజీ తర్వాత దేశవాళీ క్రికెట్‌లోనూ అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ కానున్నట్లు స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ రంజీలో బెంగాల్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా...లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆడిన ఒకే ఒక ఇన్నింగ్స్‌లో అతను డకౌటయ్యాడు.
కాగా టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడిన సాహా 29.41 సగటుతో సాహా 1353 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 92 క్యాచ్‌లు అందుకున్న అతను 12 స్టంపింగ్‌లు చేశాడు. టీమిండియా తరఫున 9 వన్డేలు కూడా ఆడిన సాహాకు అంతర్జాతీయ టీ20లు ఆడే అవకాశం మాత్రం రాలేదు. 17 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అతను 138 మ్యాచ్‌లు ఆడటం విశేషం.
చదవండి: Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ
Comments
Please login to add a commentAdd a comment