IPL 2023, LSG Vs CSK: You've Decided It Is My Last IPL, Not Me: MS Dhoni Epic Reply On IPL Retirement Question, Video Viral - Sakshi
Sakshi News home page

#DefinitelyNot: సమయం వస్తే ధోనినే చెప్తాడు.. ప్రతీసారి ఎందుకీ చర్చ!

Published Wed, May 3 2023 8:43 PM | Last Updated on Thu, May 4 2023 10:58 AM

MS Dhoni You Decide Its My Last IPL Words Became Trending-Social Media - Sakshi

Photo: IPL Twitter

సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన మాటలతో మరోసారి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు.  లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్‌కు ముందు ధోని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. టాస్‌ సమయంలో డానీ మోరిసన్‌..  ''ఇది చివరి ఐపీఎల్‌ అని ఫేర్‌వెల్‌గా మీకు సపోర్ట్‌ చేయడానికి ఇంత మంది వచ్చారు..దీన్ని ఎలా స్వీకరిస్తారు''  అడిగిన ప్రశ్నకు ధోని సూపర్‌ సమాధానం ఇచ్చాడు. ''ఇదే నా చివరి ఐపీఎల్‌ అని మీరే డిసైడ్‌ అయ్యారా'' అన్న ఒక్క మాట ఇవాళ ధోనిని ట్రెండింగ్‌ లిస్టులో కూర్చోబెట్టింది.

అయితే ఇప్పుడు ధోని వ్యాఖ్యలతో ఒక ఆసక్తికర చర్య తెరమీదకు వచ్చింది. అదే ధోని రిటైర్మెంట్‌. అయితే ధోనికి ఈ ప్రశ్న ఎదురవ్వడం ఇది కొత్త కాదు. 2019 నుంచి ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లోనూ తన రిటైర్మెంట్‌పై ఇదే ప్రశ్న ఎదురవుతూ వచ్చింది.. ధోని కూడా అంతే కూల్‌గా సమాధానం ఇచ్చాడు.

ప్రతీసారి ధోని తన రిటైర్మెంట్‌పై వచ్చిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు..
2019లో: Hopefully, Yes.. 
2020లో Definitely, Not..
2021లో.. Still I Haven't Left Behind..
2022లో.. Definitely, it will be unfair not to say thanks to Chepauk crowd..
తాజాగా 2023లో..  You Have Decided It Will Be My Last IPL అని పేర్కొన్నాడు.

అయితే ఏనాడు ధోని తన రిటైర్మెంట్‌పై స్వయంగా స్పందించిన దాఖలాలు లేవు. పనిగట్టుకొని మీడియాతో పాటు అభిమానులే ప్రతీసారి ధోనికిదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఊదరగొట్టాయి. కానీ ధోని మాత్రం పెదవి విప్పలేదు. మరోసారి తన రిటైర్మెంట్‌పై ప్రశ్న ఎదురవ్వడం.. అంతే తెలివిగా ధోని సమాధానం చెప్పడం జరిగింది.

దీంతో కొంతమంది ''ఇకనైనా ధోని రిటైర్మెంట్‌ ప్రచారాన్ని ఆపండి. సమయం వస్తే రిటైరయ్యేది ధోనినే పేర్కొంటాడు. ఇప్పటికైనా ఈ చర్చకు ఫుల్‌స్టాప్‌ పెడితే బాగుంటుంది.'' అని కామెంట్‌ చేశారు. 

చదవండి: మంచి ఫీల్డర్‌ మాత్రమే కాదు.. జాంటీ రోడ్స్‌ చర్య వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement