ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్‌కు (మే 29, రిజర్వ్ డే) ముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు యావత్ భారత క్రికెట్ అభిమానులకు ఓ భయం పట్టుకుంది. ఈ సీజన్‌తోనే ధోని తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలుకుతాడేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచే తలాకు ఆఖరిదవుతుందేమోనని కలత చెందుతున్నారు. ధోని రిటైర్మెంట్ విషయంలో ఫ్యాన్స్‌కు ఉన్న భయాల వెనుక ఓ బలమైన కారణం ఉంది.
ధోని.. తన అంతర్జాతీయ కెరీర్‌లోని చివరి మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజునే ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు (జులై 10) వాయిదా పడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. ఏడాది అనంతరం 2020, ఆగస్ట్ 15వ తేదీన ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించాడు.
Déjà Vu?
— CricTracker (@Cricketracker) May 28, 2023
📸: IPL#MSDhoni #India #CSK pic.twitter.com/4cW5RlhFBb
తాజాగా ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్ డే కు వాయిదా పడటంతో అభిమానులు భయపడుతున్నారు. ధోని తన అంతర్జాతీయ క్రికెట్‌కు ఎలాగైతే వీడ్కోలు పలికాడో, ఐపీఎల్‌కు కూడా అలాగే రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమోనని దిగులుపడుతున్నారు. తలా లేని ఐపీఎల్‌ను ఊహించుకోలేమంటూ వాపోతున్నారు.
ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన చివరి మ్యాచ్‌ను, ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను కంపేర్ చేసుకుంటూ తెగ ఫీలైపోతున్నారు. ధోనికి అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి మ్యాచ్ (వన్డే) 350వదని, ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ అతనికి 250వదని చెప్పుకుంటూ ధోని రిటైర్మెంట్‌పై నిర్ధారణకు వచ్చేశారు. ధోని రిటైర్మెంట్‌కు లెక్కలు కూడా అనుకూలిస్తున్నాయంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, గుజరాత్-చెన్నై జట్ల మధ్య నిన్న (మే 28) జరగాల్సిన ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే, లీగ్ దశలో టేబుల్ టాపర్ అయిన గుజరాత్‌ను విజేతగా ప్రకటిస్తారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.
చదవండి: IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టిందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..!
Comments
Please login to add a commentAdd a comment