IND vs NZ 2nd Test: Mayank Agarwal First Indian Test Century Against New Zealand in Over a Decade - Sakshi
Sakshi News home page

IND vs NZ 2nd Test: 11 ఏళ్లలో ఒకే ఒక్కడు.. సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన మయాంక్‌

Published Fri, Dec 3 2021 7:06 PM | Last Updated on Sat, Dec 4 2021 8:46 AM

IND vs NZ 2nd Test: Mayank Agarwal First Indian Test Century Against New Zealand in Over a Decade - Sakshi

Mayank Agarwal First Indian Test Century Against New Zealand in Over a Decade:  ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో  రెండో టెస్ట్‌లో టీమిండియా టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సెంచరీతో మెరిశాడు. తద్వారా మయాంక్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. దశాబ్ద కాలంలో న్యూజిలాండ్‌పై స్వదేశంలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2010లో  అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ సాధించాడు.

ఆ తర్వాత టీమిండియా ఓపెనర్‌ ఎవరూ కూడా సెంచరీ సాధించలేదు. తాజాగా కివీస్‌పై మయాంక్‌ సెంచరీ సాధించి ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా న్యూజిలాండ్‌పై 2014 తర్వాత సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2014 లో ఆక్లాండ్‌ వేదికగా  కివీస్‌పై శిఖర్‌ ధావన్‌ శతకం నమోదు చేశాడు. కాగా మయాంక్‌ ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో నాలుగో సెంచరీ. ముఖ్యంగా నాలుగు సెంచరీలు కూడా స్వదేశంలో చేసినవే కావడం గమానర్హం.

చదవండి: T20 World Cup 2021: రోహిత్ శర్మను ఎలా ఔట్‌ చేయాలో బాబర్‌కి నేనే చెప్పా...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement