డీజేలో తాత చిందులు.. కర్రతో బామ్మ ఎంట్రీ.. | Virender Sehwag Shares Funny Video Of Old Couple | Sakshi
Sakshi News home page

వైరల్‌: వయసు తాత్కాలికం.. భార్య చేతి కర్ర శాశ్వతం

Published Thu, Jan 28 2021 11:02 AM | Last Updated on Thu, Jan 28 2021 4:00 PM

Virender Sehwag Shares Funny Video Of Old Couple - Sakshi

భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ తరచూ ఆసక్తికర విషయాలను, సరదాల సంఘటనలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అంతేగాక ఆ పోస్టులపై తనదైన శైలిలో చురకలు, వ్యంగ్యాస్త్రాలు సందిస్తూ ఆకట్టుకుంటుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో ఓ తాత డీజేలో కుర్రాళ్లతో సమానంగా చిందేలేస్తు కనిపించాడు.

అలా పెళ్లి డీజేలో డ్యాన్స్‌ చేస్తున్న ఆ తాత దగ్గరికి అతడి భార్య ఆకస్మాత్తుగా చేతి కర్రతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటివరకు ఫుల్‌ జోష్‌తో డ్యాన్స్ చేస్తున్న ఆ వృద్దుడు ఆమెను చూడగానే హడలేత్తిపోయాడు. ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ వీడియోని వీరూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘వయసు తాత్కాలికం.. కానీ భార్య చేతి కర్ర మాత్రం శాశ్వతం’ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement