విరాట్ కోహ్లి, సెహ్వాగ్
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి సారి సిరీస్ గెలిచిన కోహ్లి సేనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గంగూలీ అప్‌గ్రేడ్ వర్షనే కెప్టెన్ విరాట్ కోహ్లి అని ఆకాశానికెత్తాడు. ఓ టీవీ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘కోహ్లి నెం.1 కెప్టెన్. గత ఎనిమిది సిరీస్ విజయాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇలాంటి గొప్ప సారథిని ఇప్పటి వరకు మనం చూనసండం. అయితే ఇప్పుడే కోహ్లిని దిగ్గజ మాజీ కెప్టెన్లలోఎవరితో మనం పొల్చకూడదు. వారి స్థాయి చేరుకోవాలంటే కోహ్లికి ఇంకొంచెం అనుభవం అవసరమని’ అభిప్రాయపడ్డాడు.
కోహ్లి దూకుడు చూస్తే గంగూలీ దూకుడుకు అప్‌గ్రేడ్ వర్షన్‌లా ఉందని ఈ డాషింగ్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. ‘గంగూలీ నాయకత్వంలో మేం కొన్ని ఓవర్‌సీస్ విజయాలు సాధించాం. ప్రస్తుతం విరాట్ కొనసాగిస్తున్నాడు. కెప్టెన్సీతో తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించుకున్నాడు. కోహ్లి సారథిగా ఎప్పుడు ఒత్తిడికి లోనుకాడు. బాధ్యతతో తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఫిట్‌నెస్ పరంగా సైతం కోహ్లి ట్రెండ్ అయ్యాడని’ ప్రశంసలు కురిపించాడు.
కోహ్లి సేన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో సైతం విజయం సాధిస్తోందని సెహ్వాగ్ ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా కోహ్లి వ్యక్తిగత ప్రదర్శనతో అదరగొట్టడమే ఇక్కడ ప్రాధాన్యమైన అంశమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment