
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్‌పై కోహ్లి సేన టీ20 సిరీస్ నెగ్గడంతో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన వ్యంగ్య ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. తొలి వన్డే అనంతరం నుంచే కివీస్ బ్యాట్స్‌మెన్ టేలర్‌కు సెహ్వాకు ఫన్నీ ట్విట్టర్ వార్ నడుస్తుంది. టేలర్, టైలర్‌గా సంబోదిస్తూ సెహ్వాగ్ సరదా ట్వీట్‌లు చేశాడు. దీనికి టైలర్ ఏమాత్రం తక్కువ కాకుండా హిందీలో సెహ్వాగ్‌కు కౌంటర్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఇక రెండో టీ20 అనంతరం టేలర్ ఓ దర్జీ షాపు ముందు కూర్చోని.. రాజ్‌కోట్‌లో దుకాణం బంద్ అయింది. కొత్త దుకాణం తిరువనంతపురంలో.. బట్టలు కుట్టించుకోవాలంటే అక్కడికి రా సెహ్వాగ్ అంటూ హిందీలో ట్వీట్ చేశాడు. టైలర్ హిందీకి సెహ్వాగ్‌తో పాటు భారత అభిమానులు కూడా నివ్వేరపోయారు. సెహ్వాగ్ అయితే టేలర్ హిందీకి ఏకంగా ఆధారే ఇవ్వమన్నాడు.
దీన్ని దృష్టిలో ఉంచుకున్న డాషింగ్ ఓపెనర్ మూడో టీ20లో భారత్ విజయానంతరం.. ‘ టేలర్ ఇక ఉతికిన బట్టలు కుట్టుకో.. కానీ న్యూజిలాండ్ బాగా ఆడింది. ఈ ఓటమికి బాధపడకండి.. మీరు చాలా మంచి ఆటగాళ్లు, భారత్‌కు ఇది ఓ తియ్యని విజయమని ట్వీట్ చేశాడు.’ అయితే ప్రతి ట్విట్‌కు స్పందించిన టేలర్ ఈ ట్వీట్‌కు మాత్రం ఇంకా సమాదానం ఇవ్వలేదు. బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించిన మేరీకోమ్‌కు సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపాడు.
Dhulaai ke baad silaai, but well played NZ.Never feel very bad losing against NZ because they are such nice guys,but sweet victory for India https://t.co/bpUkjbdzY7
— Virender Sehwag (@virendersehwag) November 7, 2017