
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో మాటలయుద్దానికి సై అన్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ తన చివరి సందేశంతో ఈ ఫన్నీ వార్‌ను ముగించాడు. కివీస్‌తో సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి వీరి మధ్య సరదా మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఏప్పటిలాగే సెహ్వాగ్ తన వ్యంగ్య ట్వీట్లతో టేలర్‌ను టైలర్‌గా సంబోధిస్తూ ఆటపట్టించాడు.
అయితే అనూహ్యంగా టేలర్ సెహ్వాగ్‌కు హిందీలో ట్వీట్ చేస్తూ షాక్ ఇచ్చాడు. ఎంతలా అంటే టేలర్ హిందీకీ ఆధార్ ఇచ్చేయండి అని సెహ్వాగే స్వయంగా యూఐడీఏఐను కోరేంత. మాజీ కెప్టెన్ గంగూలీ నీకు హిందీ ఎలా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేసేంతా.. భారత అభిమానులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యేంతా..
ప్రతి మ్యాచ్ అనంతరం వీరి మధ్య జరిగిన సరదా ట్వీట్లతో భారత అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. భారత్ టీ20 సిరీస్ గెలుచుకున్న అనంతరం సెహ్వాగ్ ‘ టేలర్ ఇక ఉతికిన బట్టలు కుట్టుకో.. కానీ న్యూజిలాండ్ బాగా ఆడింది. ఈ ఓటమికి బాధపడకండి.. మీరు చాలా మంచి ఆటగాళ్లు, భారత్‌కు ఇది ఓ తియ్యని విజయమని ట్వీట్ చేశాడు.’ అయితే ఈ ట్వీట్‌కు లేట్‌గా అయినా లేటేస్ట్‌గా స్పందించాడు టేలర్. తనకు హిందీ నేర్పిన వారితో దిగిన ఫోటోతో ఇన్‌స్ట్రాగ్రమ్ పోస్ట్ చేశాడు. ఆ ఇద్దరు తన టీమ్ మెట్ అయిన ఇష్ సోదీ, భారత స్టాఫర్ దేవ్‌లు అని పేర్కొన్నాడు.
‘భారత్‌లో ఆడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, సెహ్వాగ్‌తో మాటలయుద్దానికి నాకు ఈ ఇద్దరే సాయం చేశారు. ధన్యవాదాలు దేవ్, సోదీ, ఉతకడం, కుట్టడానికి చాలా సమయం ఉంది సెహ్వాగ్‌జీ.. ఈ చివరి మెసేజ్‌తో ముగిస్తున్నాను. అని పోస్ట్ చేశాడు.
Dhulaai ke baad silaai, but well played NZ.Never feel very bad losing against NZ because they are such nice guys,but sweet victory for India https://t.co/bpUkjbdzY7
— Virender Sehwag (@virendersehwag) 7 November 2017
Comments
Please login to add a commentAdd a comment