
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌ల ట్వీట్ల యుద్దం మరింత ఫన్నీగా కొనసాగతుంది. వ్యంగ్య చలోక్తులతో ట్వీట్ చేసే సేహ్వాగ్‌కు హాస్యం జోడించడంలో ఏ మాత్రం తక్కువ కాదంటూ బదులిస్తున్నాడు రాస్ టేలర్. భారత్ తో తొలి వన్డేలో కివీస్ విజయం అనంతరం మొదలైన వీరి సరదా ట్విట్ల సంగ్రామం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా టీ20 ఫైనల్ మ్యాచ్ కోసం ఇరుజట్లు తిరవనంతపురం బయలు దేరే ముందు రాజ్‌కోట్‌లోని ఓ దర్జీ షాపు ముందు కూర్చోని దిగిన ఫోటోను రాస్ టేలర్ హిందీలో ‘ రాజ్‌కోట్ మ్యాచ్ అనంతరం దర్జీ షాపు బంద్ అయింది. తరువాతి మ్యాచ్ తిరువనంతపురంలో ఆర్డర్ ఉంటే అక్కడికి రా సెహ్వాగ్’ అనే క్యాఫ్షన్‌తో ట్విట్ చేశాడు.
దీనికి సెహ్వాగ్ ఏహే మనోడికి హిందీ తెగ వచ్చేసింది ఆధార్ కార్డు ఇచ్చేయండి అనే ట్వీట్‌తో బదులిచ్చాడు. అయితే ఈ ట్వీట్‌కు అనూహ్యంగా యూఐడీఏఐ స్పందించింది. భాష ఒక్కటే ముఖ్యం కాదు.. నివాస గృహం సంగతేంటని ప్రశ్నిస్తూ.. ఆధార్ కావల్సిన నియమాలను వివరిస్తూ ట్వీట్ చేసింది.
తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించిన టేలర్‌ను అభినందిస్తూ... వీరూ తన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. ‘చాలా బాగా ఆడావు రాస్ టేలర్ దర్జీ జీ (టేలర్ ను టైలర్ అన్నడన్న మాట). దీపావళి సందర్భంగా వచ్చిన ఆర్డర్స్ తో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దాన్ని అధిగమించావు’ అంటూ ట్వీట్ చేశాడు.
అయితే దీనికి తగ్గట్లే హిందీలోనే ఆ దర్జీ(టేలర్) రిప్లై ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘ధన్యవాదాలు సెహ్వాగ్! వచ్చే ఏడాది దీపావళికి ఒకవేళ నువ్వు ఆర్డర్ ఇస్తే, ముందుగానే డెలివరీ చేసేస్తాను’ అంటూ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ల పర్వం ఇక్కడితోనే ఆగలేదు. ‘హ హ హ మాస్టర్ జీ! ఈ ఏడాది దీపావళికి నేను తీసుకున్న ప్యాంటు చాలా లూజ్ గా ఉంది. దీన్ని బాగు చేసి వచ్చే ఏడాది దీపావళికి పంపించు. రాస్ ద బాస్’ అంటూ మరో ట్వీట్ చేశాడు.
ఏమాత్రం తగ్గని రాస్ టేలర్ దానికి తగ్గట్లే ‘మీ దర్జీ ఈ దీపావళికి సరిగా కుట్టలేదా’ అంటూ ప్రశ్నించి అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘నీలా ఉన్నత ప్రమాణాలతో ఎవరూ రాణించలేరు కదా. అది కుట్టడంలో అయినా.. మైదానంలో భాగస్వామ్యం నెలకొల్పడంలోనైనా’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే టేలర్ హిందీ నైపుణ్యానికి భారత అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Highly impressed by you @RossLTaylor . @UIDAI , can he be eligible for an Aadhaar Card for such wonderful Hindi skills. https://t.co/zm3YXJdhk2
— Virender Sehwag (@virendersehwag) November 6, 2017
Language no bar. Resident status is what matters.
— Aadhaar (@UIDAI) November 6, 2017