లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా వైజాగ్ టైటాన్స్, నాగ్‌పూర్ నింజాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్ టైటాన్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ వీరేంద్ర సెహ్వాగ్ (18 బంతుల్లో 27; 6 ఫోర్లు), నిక్ కాంప్టన్ (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, సిక్స్), మల్కన్ సింగ్ (33 బంతుల్లో 38; 4 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (18 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. స్టువర్ట్ బిన్నీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎడాపెడా బౌండరీలు సిక్సర్లు బాదాడు.
అనంతరం బరిలోకి దిగిన నింజాస్ రిచర్డ్ లెవి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినప్పటికీ గెలవలేకపోయింది. ఈ ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లెవి 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. లెవికి మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో నింజాస్ ఓటమిపాలైంది. అభిమన్యు ఖోద్ (42) పర్వాలేదనిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్‌లో నింజాస్ గెలుపుకు 10 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన స్టువర్ట్ బిన్నీ.. హర్భజన్ సింగ్‌ను కట్టడి చేయగలిగాడు. ఆఖరి బంతికి సిక్సర్ అవసరం కాగా, భజ్జీ బౌండరీతో సరిపెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment