Levi
-
స్టువర్ట్ బిన్నీ ఊచకోత.. రిచర్డ్ లెవి విధ్వంసం
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2023లో భాగంగా వైజాగ్ టైటాన్స్, నాగ్‌పూర్ నింజాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్ టైటాన్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ వీరేంద్ర సెహ్వాగ్ (18 బంతుల్లో 27; 6 ఫోర్లు), నిక్ కాంప్టన్ (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, సిక్స్), మల్కన్ సింగ్ (33 బంతుల్లో 38; 4 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ (18 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. స్టువర్ట్ బిన్నీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎడాపెడా బౌండరీలు సిక్సర్లు బాదాడు. అనంతరం బరిలోకి దిగిన నింజాస్ రిచర్డ్ లెవి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినప్పటికీ గెలవలేకపోయింది. ఈ ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లెవి 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. లెవికి మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో నింజాస్ ఓటమిపాలైంది. అభిమన్యు ఖోద్ (42) పర్వాలేదనిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్లో నింజాస్ గెలుపుకు 10 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసిన స్టువర్ట్ బిన్నీ.. హర్భజన్ సింగ్‌ను కట్టడి చేయగలిగాడు. ఆఖరి బంతికి సిక్సర్ అవసరం కాగా, భజ్జీ బౌండరీతో సరిపెట్టుకున్నాడు. -
165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే!
పూర్తిగా మాసిపోయినట్లు కనిపిస్తున్న ఈ జీన్స్ రేటుఎంతో తెలుసా? రూ. 94 లక్షలు!! ఎందుకింత రేటు అంటే.. ఈ జీన్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి. 1857లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో ఇవి లభించాయట. అంటే 165 ఏళ్లనాటి జీన్స్ అన్నమాట. ఇది లెవీస్ట్రాస్ కంపెనీ తయారుచేసిన జీన్స్ అని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు. ఎవరు తయారుచేస్తేనేం.. ఇప్పటివరకూ లభించినవాటిల్లో ఇవే అత్యంత పురాతనమైనవి కనుక.. తాజాగా అమెరికాలో జరిగిన వేలంలో ఈ జీన్స్ 1,14,000 (భారతీయ కరెన్సనీలో 94 లక్షలు) డాలర్లకు అమ్ముడుపోయాయి. చదవండి: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఒక్క కాటుకు 100 మంది ఫసక్.. -
ఏముంది భయ్యా ఆ జీన్స్ ప్యాంట్లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్!
వస్తువులు పాతవయ్యే కొద్దీ వాటిని పక్కన పెట్టడం సహజం. వాటి విలువ తగ్గడం, ఆ స్థానంలో కొత్తవి రావడం, పాడైపోవడం లాంటి కారణాలతో పక్కన పెట్టేస్తాం. ఇదంతా ఒక వైపే. మరో వైపు చూస్తే.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ దశాబ్దాల కాలం నాటి వస్తువుల కోసం కోట్లు పెడుతుంటాం. ఎందుకంటే కొన్ని వస్తువులు ఎంత పాతవైతే అంత విలువ పెరుగుతుంది. అందుకే కొంతమంది అలాంటి వాటి కోసం వేచి చూస్తుంటారు. వేలంలోకి రాగానే భారీ నగదు చెల్లించి సొంతం చేసుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మెక్సికోలో చోటు చేసుకుంది. అమ్మో.. ఈ ప్యాంటు ధర రూ.60 లక్షలా! అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి లెవీ జీన్స్ జత $76,000కి( భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షల పైమాటే) అమ్ముడైంది. శాన్ డియాగోకు చెందిన 23 ఏళ్ల పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్ ఇటీవల జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంటును కొనుగోలు చేశాడు. అయితే, హౌపెర్ట్ కొనుగోలుదారుల ప్రీమియంతో కలిపి మొత్తం $87,400 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై హౌపెర్ట్ మాట్లాడుతూ "నేను ఇప్పటికీ ఒకరకంగా అయోమయంలో ఉన్నాను, ఆ ప్యాంట్‌ను కొనుగోలు చేసినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పారు. అతను పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్సన్తో కలిసి జీన్స్‌ను కొనుగోలు చేశాడు. వేలంలో పలికిన దీని ధరలో ఇప్పటికే 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించాడు. View this post on Instagram A post shared by Golden State Vintage (@goldenstatevtg) చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
మూడు కాళ్లతో వీరోచితంగా పోరాడింది
మనకి తెలిసినంతవరకు ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం గల జంతువు కుక్క. మనుషులు కుక్కల్ని తమ కుటుంబసభ్యులతో సమానంగా చూడటం మనం రోజు చూస్తూనే ఉంటాం. కుక్కలు కూడా మనుషులను ఎంత ప్రేమిస్తాయో లేవీ అనే 15 ఏళ్ల పిట్ బుల్ జాతికి చెందిన శునకం మరోసారి నిరూపించింది. రెండేళ్ల కిందట యజమాని కుమారున్ని కాపాడి కాలును కోల్పోయిన లేవీ, ఇప్పుడు వారి కుటుంబాన్ని రక్షించడానికి ఏకంగా ప్రాణాన్నే పణంగా పెట్టింది. వివరాలు.. వారం రోజుల కింద అమెరికాలో విస్కాన్సిన్లోని జానెస్విల్లేలో ఓ దుండగుడు చోరీకి యత్నించాడు. గన్‌తో ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు, యజమాని డార్సి చెర్రీ, ఆమె బాయ్ ఫ్రెండ్ బాబ్ స్టెంజెల్ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. వాళ్లను భూమి మీద కూర్చోబెట్టి చేతులు తల వెనుక పెట్టుకోవాలని బెదిరించాడు. ఇదంతా గమనించిన లెవీ (మూడు కాళ్లతోనే) ఒక్కసారిగా అరుస్తూ.. మీద పడ్డంత పనిచేసింది. దీంతో ఏంచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ దుండగుడు గన్‌తో ఆ శునకాన్ని కాల్చి అక్కడ నుంచి పరారయ్యాడు. బుల్లెట్ తలలో నుంచి శునకం ఎడమ కాలి వరకు దూసుకెళ్లింది. దీంతో లేవీని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 2014లో కుటుంబసమేతంగా ట్రెక్కింగ్‌కు వెళ్లినప్పుడు చెర్రీ కుమారుడు కొండ చివరనుంచి పడిపోతుండగా లేవీనే కాపాడింది. అయితే ప్రమాదవశాత్తు కొండపైనుంచి లేవీ పడిపోవడంతో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. రెండేళ్ల కిందట కూడా వారి కుటుంబాన్ని ఒక భారీ చోరీ నుంచి లేవీ కాపాడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లేవీ హీరోయిజం ముగియలేదని, ఇకముందు కూడా కొనసాగుతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. -
లెవీ...కష్టాలు హవీ!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో లెవీ సేకరణకు ఆదిలోనే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకవైపు బియ్యం మద్దతు ధర తేలకపోవడంతో పాటు గొడౌన్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో గతం లో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల లెవీ సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. అయితే వసతులు గురించి ప్రభుత్వం ఆలోచించలేదు. ఇప్పటికే జిల్లాలో ఉన్న ఐదు గొడౌన్లలో బియ్యం నిల్వలున్నాయి. దీంతో బియ్యం ఎగుమతి, దిగుమతులకు ఇబ్బంది కలుగుతోంది. ఈ సమస్యతో గొడౌన్‌కు వచ్చిన వాహనాలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీని వల్ల తమకు నష్టం వాటిల్లుతోందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గొడౌన్ల సమస్యకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వ ర్యంలో లెవీ సేకరణ జరుగుతోంది. కెఎల్‌పురం, జియ్యమ్మవలస, చీపురుపల్లి, అంటిపేట, పార్వతీపురంమండలాల్లో గొడౌన్లున్నాయి. ఇప్పటికే అన్ని గొడౌన్లలోనూ బియ్యం నిల్వలున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నామని మిల్లర్లు వాపోతున్నారు.జిల్లాలో వాస్తవానికి 77 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ చేయటానికి మాత్రమే అనువైన గొడౌన్లు ఉన్నాయి. ఈమేరకు లెవీ లక్ష్యం సగం కంటే తక్కువ నిల్వ చేయడానికి సామర్థ్యం గల గొడౌన్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం గొడౌన్ల సమస్య పూర్తిస్థాయిలో తలెత్తన ప్పటికీ జనవరి దాటితే ఇబ్బందులు తప్పవని మిల్లర్లతో పాటు అధికారులు కూడా భావిస్తున్నారు. తాత్కాలికంగా గొడౌన్ల సమస్యను అధిగమించేందుకు అధికారులు ఇప్పటికే గొడౌన్లలో బియ్యం వేసే నెట్‌ను 16 నుంచి 24 వరకు పెంచటానికి వెసులుబాటు కల్పించాలని ఉన్నతాధికారులకు నివేదించారు. దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. మద్దతు ధర తేలెదెప్పుడో...? వాస్తవానికి లెవీ ప్రారంభానికి ముందే బియ్యానికి సంబంధించి మద్దతు ధర ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడాలి. ఈ ఏడాది ఇప్పటికే లెవీ ప్రారంభం కావడంతో పాటు 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ జరిగింది. ఇప్పటివరకు మద్దతు ధర ప్రకటించకపోవడంతో తమకు నష్టాలు తప్పవని మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో పోలిస్తే లక్షలాది రూపాయలు నష్ట పోవలసి వస్తుందని వారు చెబుతున్నారు. అయితే క్వింటాకు రూ. 2,285 మద్దతు ధర నిర్ణయమైనట్టు తమ సంఘానికి సమాచారం అందినట్టు మిల్లర్ల సంఘం విజయనగరం డివిజన్ అధ్యక్షుడు బద్రీ నారాయణ తెలిపారు. కానీ ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం... గొడౌన్ల సమస్య ఉందని ఉన్నతాధికారులకు నివేదిం చాం. ప్రతినెల 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లా అవసరాల కోసం తరలిస్తున్నాం. నెట్ల సంఖ్యను పెంచడానికి అనుమతి ఇవ్వాలని పౌర సరఫరాల సంస్థ ఎండీకి నివేదించాం. ప్రత్యామ్నాయ గొడౌన్లను ఏర్పాటు చేస్తాం. -ఎస్.వేణుగోపాలనాయుడు, జిల్లా పౌరసరఫరాల సంస్థ.