'కుంబ్లేలా ఎవరూ అండగా నిలవలేదు'
న్యూఢిల్లీ: అనిల్ కుంబ్లే తన ఫేవరెట్ కెప్టెన్ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. కుంబ్లే మాదిరిగా తనకు ఏ కెప్టెన్ కూడా అండగా నిలవలేదని చెప్పాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కంటే కుంబ్లేనే తనకు ఎక్కువ మద్దతు ఇచ్చాడని సెహ్వాగ్ తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్కు వీరూ ఇటీవల గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే భారత్ క్రికెట్కు దశాబ్దంపైగా సేవ చేసిన తనకు ఫేర్వెల్ మ్యాచ్ లేకపోవడం వెలితిగా ఉందంటూ సెలెక్టర్లను విమర్శించిన వీరూ మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. బ్యాటింగ్ లైనప్లో మిడిలార్డర్లో ఆడాలని భావించిన సమయంలో తనను జట్టు నుంచి తప్పించారని చెప్పాడు. మిడిలార్డర్ బ్యాట్స్మన్గా కెరీర్ను ముగించాలని కోరుకున్నానని సెహ్వాగ్ తన మనసులో మాటను బయటపెట్టాడు.