సేంద్రీయ ఎరువులతో సేంద్రీయ పద్దతులతో పండించే పంటనే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఇప్పుడీ ఆర్గానిక్ ఫార్మింగ్‌పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు కోట్లలో పెట్టుబడులు పెట్టారు.
టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) అనే స్టార్టప్ సంస్థ ఫండింగ్ రౌండ్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా..అందరికీ మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం టూబ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ (టీబీఓఎఫ్) ప్రయాణంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సేంద్రీయ వ్యవసాయం ద్వారా గ్రామీణ వర్గాల సాధికారత కోసం సంస్థ దృష్టి ,నిబద్ధతను నమ్ముతున్నాను" అని అక్షయ్ కుమార్ అన్నారు.
ఆరోగ్యకరమైన సేంద్రీయ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, గ్రామీణ రంగాన్ని అభివృద్ధి చేయడంపై కంపెనీ బలమైన ప్రాధాన్యత కారణంగా తాను tbofలో పెట్టుబడి పెట్టానని ఆయన పేర్కొన్నారు. రైతులు, సమాజంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించే దిశగా సంస్థ నిబద్ధత తనను ప్రేరేపించిందని కాబట్టే పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమైనట్లు వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment