
వీరేంద్ర సెహ్వాగ్ (ఫైల్)
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికేట్‌కు దూరమైనా, ట్వీటర్‌లో తనకు నచ్చిన వీడియోలను పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. శనివారం ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆయన తన పోస్ట్‌లో ఓ పేషంట్‌ను తెగపొగిడేశారు. ఆ పేషంట్ డాక్టర్లకు సహకరిస్తున్న తీరుకు ఆయన ముచ్చటపడిపోయారు. ఇంతకీ ఎవరా పేషంట్ అనుకుంటున్నారా?.. సెహ్వాగ్ పొగిడింది, ముచ్చటపడ్డది ఓ ఏనుగును చూసి. ‘‘ఇలాంటిది చూడ్డం చాలా అరుదు. ఎంత అందంగా డాక్టర్లకు సహకరిస్తోంద’’ని పేర్కొన్నారాయన. ఆయన పోస్ట్ చేసిన ఆ వీడియోలో... ఓ ఏనుగు మెల్లగా డాక్టర్ వెంట నడుచుకుంటూ స్కానింగ్ రూంలోకి వస్తుంది. డాక్టర్ చెప్పగానే బుద్దిగా నేలపై పడుకుంటుంది. ఓ సారి కొద్దిగా లేవమనగానే లేచి మళ్లీ పడుకుంటుంది. డాక్టర్లు స్కానింగ్ చేసేంత వరకు అలా కదలకుండా నేలపై పడుకుంటుంది.
Rare sight. How beautifully does this patient cooperate with the doctors ! pic.twitter.com/5Fp7Wo14U3
— Virender Sehwag (@virendersehwag) July 21, 2018
Comments
Please login to add a commentAdd a comment