
సచిన్ టెండూల్కర్, ఆమిర్ ఖాన్
ట్విటర్‌లో ఫన్నీమ్యాన్ ఎవరంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌దే.. ఇపుడు ఆ స్థానాన్ని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ భర్తీ చేసేలా కనిపిస్తున్నాడు. గతంలో సెహ్వాగ్ బర్త్‌డేకు ఉల్టా ట్వీట్‌తో విష్ చేసిన సచిన్ తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు కూడా ఇదేవిధంగా ఫన్నీగా విషెస్ చెప్పాడు. ‘హ్యపీ బర్త్‌డే ఆమిర్ ఖాన్.. నువ్వు సూపర్‌స్టార్‌వి.. అందులో సీక్రెట్ ఏమీలేదు.. హాహాహా’ అంటూ సచిన్ ట్వీటాడు.
ఆమిర్ ఇటీవల ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరును ఉటంకిస్తూ.. సచిన్ ఇలా సరదాగా ఆమిర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ‘విష్ యూ ద బెస్ట్ ఆల్వేస్ మై ఫ్రెండ్’ అంటూ జోడించాడు. టీమిండియా ఓపెనింగ్ జోడీగా అనేక విజయాలు అందించిన సెహ్వాగ్, సచిన్‌లు ఇప్పుడు ట్విటర్‌లోనూ తమదైన రీతిలో ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు.
సూపర్‌స్టార్ బర్త్‌డే గిఫ్ట్...
హిట్ల మీద హిట్లు కొడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అమిర్ ఖాన్ తన అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. బుధవారం 53వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. అభిమానులకు మరింత చేరువయ్యేందుకు మంగళవారం ఫోటో షేరింగ్ మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు. మొదటి పోస్ట్‌గా తల్లి జీనత్ హుసేన్ ఫోటోను అప్‌లోడ్ చేశారు. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విటర్‌లో అభిమానులతో టచ్‌లో ఉండే అమిర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ట్విటర్‌లో 23 మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో 15 మిలియన్ల లైక్స్‌తో దూసుకుపోతున్నఅమీర్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన కొద్ది గంటల్లోనే 2.41 లక్షలమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు.
Happy birthday, @aamir_khan. You are a superstar and that's no secret... HaHaHa 😝 Wish you the best always my friend. pic.twitter.com/qbUXsARKMI
— Sachin Tendulkar (@sachin_rt) March 14, 2018
Comments
Please login to add a commentAdd a comment