భారత స్టార్ క్రికెటర్, రన్‌మిషన్ విరాట్ కోహ్లి మరో ప్రపంచరికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంతవేగంగా 27,000 వేల పరుగులు మైలు రాయిని అందుకున్న క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 47 పరుగులు చేసిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి 594* ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను అందుకున్నాడు.
సచిన్ రికార్డు బ్రేక్..
ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 623 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. 226 టెస్టు, 396 వన్డే, ఒక టీ20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అతడు అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి (594* ) బ్రేక్ చేశాడు.
ఆగని రన్ మిషన్..
విరాట్ కోహ్లి 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన అరంగేట్రం నుంచి కోహ్లి సత్తాచాటుతునే ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగులు వరద పారిస్తూ రన్‌మిషన్‌గా పేరుగాంచాడు. కోహ్లి ఇప్పటి వరకు టెస్టుల్లో 8871, వన్డేల్లో 13906, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20లో ఒక శతకం కోహ్లి ఖాతాలో ఉన్నాయి.
చదవండి: IND vs BAN: టీమిండియా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే
Comments
Please login to add a commentAdd a comment