ష‌కీబ్‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి.. | Virat Kohli Gifts His Signed Bat To Shakib Al Hasan | Sakshi
Sakshi News home page

#Shakib Al Hasan: ష‌కీబ్‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి..

Oct 2 2024 8:11 AM | Updated on Oct 2 2024 9:29 AM

Virat Kohli Gifts His Signed Bat To Shakib Al Hasan

కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది.

ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల‌లో హాఫ్ సెంచ‌రీల‌తో స‌త్తాచాటిన య‌శ‌స్వీ జైశ్వాల్ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిల‌వ‌గా.. రవిచంద్ర‌న్ అశ్విన్ ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు ద‌క్కించుకున్నాడు.

ష‌కీబ్‌కు గిఫ్ట్ ఇచ్చిన విరాట్‌..
త్వరలో రిటైరవుతున్న బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ షకీబుల్‌ హసన్‌కు భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి తన బ్యాట్‌ను కానుకగా అందజేశాడు. షకీబ్‌ టెస్టు ఫార్మాట్‌పై ఇది వరకే తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ తర్వాత టెస్టులకు గుడ్‌బై చెబుతానన్నాడు. వచ్చే ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పే యోచన లో ఉన్నాడు.

రెండో టెస్టు ముగిసిన తర్వాత కోహ్లి స్వయంగా బంగ్లాదేశ్‌ జట్టు వద్దకు వెళ్లి తన గుర్తుగా బంగ్లా మేటి క్రికెటర్‌ అయిన షకీబ్‌కు బ్యాట్‌ను బహూకరించాడు. ఈ సందర్భంగా ఇరు జట్ల హేమాహేమీలు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. 

షకీబ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌. బంగ్లాదేశ్‌కే కాదు... మన ఐపీఎల్‌ అభిమానులకు చిరపరిచితుడు. అతను కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల తరఫున  71 మ్యాచ్‌లాడాడు.  
చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement