శుక్రవారం నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు కాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పర్యాటక బంగ్లా జట్టు మాత్రం భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలతో ఉంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. కాన్పూర్ టెస్టులో కోహ్లి మరో 35 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు 514 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి..26,965 పరుగులు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(34357) , కుమార సంగర్కకర(28016), రికీ పాంటింగ్(27483) ఉన్నారు.
కోహ్లి ఫామ్‌లోకి వస్తాడా?
కాగా టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత కోహ్లి తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో విఫలమైన విరాట్.. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అందరి కళ్లు కోహ్లిపైనే ఉన్నాయి. కాన్పూర్ టెస్టులో విరాట్ ఎలా రాణిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment