బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝళిపించాడు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 35 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు.
అయితే ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి సింగిల్ డిజిట్ స్కోర్ పరిమితమయ్యే వాడు. రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బంగ్లా బౌలర్ తెలివి తక్కువ పనికి కోహ్లి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
అసలేం జరిగిందంటే?
భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఖాలీద్ ఆహ్మద్ బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని తన ఫ్రంట్‌ప్యాడ్‌కు తాకుతూ పిచ్ దగ్గరలోనే ఉండిపోయింది.
అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న పంత్ రన్‌కు కాల్ ఇవ్వడంతో విరాట్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ పంత్ మాత్రం కాస్త ముందుకు వచ్చి మధ్యలోనే ఆగిపోయాడు. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ ఖాలీద్ ఆహ్మద్ వికెట్ కీపర్ ఎండ్‌కు పరిగెత్తి బంతిని అందుకుని స్టంప్స్‌కు త్రో చేశాడు. కానీ బంతి మాత్రం స్టంప్స్‌కు తాకలేదు.
అయితే కోహ్లి మాత్రం తన రనౌట్ అని భావించి వెనక్కి వచ్చే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడైతే బంతి స్టంప్స్‌కు తాకలేదో వెంటనే కోహ్లి సేఫ్‌గా క్రీజులోకి వచ్చేచాడు. కాగా బంగ్లా బౌలర్ ఏ మాత్రం సమయస్పూర్తి ఉపయెగించలేదు.
స్టంప్స్ దగ్గరకు వెళ్లి పడగొట్టే అంతసమయం ఉన్నప్పటకి దూరం నుంచి త్రో చేసి కోహ్లికి లైఫ్ ఇచ్చేశాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు మొత్తం నిరాశలో కూరుకుపోయారు. పంత్ మాత్రం కోహ్లి దగ్గరకు వచ్చి హాగ్ చేసుకుని మరీ సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Luck favours the brave🫨
Kohli survives to hug it out with Pant in the middle! 😍#IDFCFirstBankTestSeries #JioCinemaSports #INDvBAN pic.twitter.com/XVDyR0ffD3— JioCinema (@JioCinema) September 30, 2024
Comments
Please login to add a commentAdd a comment