భారత్ చేతిలో తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన బంగ్లాదేశ్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న కాన్పూర్ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కానున్నట్లు సమాచారం.
చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో షకీబ్ చేతి వేలికి గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా బుమ్రా బౌలింగ్‌లో బంతి బలంగా షకీబ్ కూడి చేతికి వేలికి తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే అతడికి ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ తర్వాత షకీబ్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించినప్పటికి నొప్పితో బాధపడుతున్నట్లు మైదానంలో కన్పించాడు.
మ్యాచ్ అనంతరం అతడిని స్కానింగ్‌కు తరలించగా ఎటువంటి పగులు లేనిట్లు తేలినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కానీ వారం రోజుల పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాన్పూర్ టెస్టుకు షకీబ్ దూరమైతే బంగ్లాకు నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. అయితే షకీబ్ తొలి టెస్టులో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ సత్తాచాటలేకపోయాడు.
చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
Comments
Please login to add a commentAdd a comment