'మలింగలా బౌలింగ్ చేస్తున్నావు'.. విరాట్‌ కామెంట్స్‌కు లసిత్‌ రిప్లే | Lasith Malinga Reacts As Virat Kohli Sledges Shakib Al Hasan | Sakshi
Sakshi News home page

IND vs BAN: 'మలింగలా బౌలింగ్ చేస్తున్నావు'.. విరాట్‌ కామెంట్స్‌కు లసిత్‌ రిప్లే

Published Sun, Sep 22 2024 9:21 AM | Last Updated on Sun, Sep 22 2024 10:24 AM

Lasith Malinga Reacts As Virat Kohli Sledges Shakib Al Hasan

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు బ్యాటింగ్‌లో నైనా, ఇటు ఫీల్డింగ్‌లోనైనా ప్రత్యర్ధి ఆటగాళ్లను ఆటపట్టిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు త‌న దూకుడు స్వభావంతో ప్ర‌త్య‌ర్ధుల‌ను స్లెడ్జ్ కూడా చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా కింగ్ కోహ్లి మరోసారి తన సరదా వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు.

ఇంతకీ ఏమి జరిగిందంటే?
చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్‌-బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయిన త‌ర్వాత కోహ్లి క్రీజులోకి వ‌చ్చాడు. 

అయితే క్రీజులోకి వ‌చ్చిన కోహ్లికి బంగ్లాదేశ్ స్టార్ స్పిన్న‌ర్ ష‌కీబ్ అల్‌హ‌స‌న్ వ‌రుస‌గా యార్కర్లు సంధించాడు. దీంతో అత‌డిని స్లెడ్జ్ చేయాల‌ని కోహ్లి నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో విరాట్‌ మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షకీబ్ వైపు చూస్తూ.. "మ‌లింగ‌లా వ‌రుస‌గా యార్క‌ర్లు బౌలింగ్ చేస్తున్నావు" అంటూ అన్నాడు. 

కోహ్లి మాట‌లు విన్న ష‌కీబ్ కాస్త ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి న‌వ్వుతూ త‌న ఫీల్డింగ్ పొజిషేన్‌కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వైర‌ల్ అవుతుంది. ఈ వీడియాపై శ్రీలంక దిగ్గ‌జం లసిత్ మ‌లింగ స్పందించాడు. "గ్రేట్ బ్రద‌ర్‌" అంటూ మ‌లింగ రిప్లే ఇచ్చాడు.

పట్టు బిగించిన భారత్‌..
ఇక చెపాక్‌లో టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా మూడో రోజు ముగిసే స‌మ‌యానికి 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 రన్స్‌ చేసింది. బంగ్లా జ‌ట్టు విజ‌యం సాధించాలంటే ఇంకా 357 పరుగులు అవసరం.
చదవండి: IND vs BAN: బుమ్రా అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లోనే?

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement