సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు మంగళవారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోంది. సుదీర్ఘ సమయం పాటు జరిగిన చివరి సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు.
కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగితా ఆటగాళ్లంతా ఈ రోజు ప్రాక్టీస్‌లో భాగమయ్యారు. అయితే సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు చెపాక్‌లో ఏర్పాటు చేసిన ప్రీ ట్రైనింగ్ క్యాంపులో ఆరడుగుల ఆజానుబాహుడు, యువ పేసర్ నెట్ బౌలర్‌గా సేవలు అందించాడు.
తన పేస్ బౌలింగ్‌తో విరాట్ కోహ్లి లాంటి స్టార్ బ్యాటర్‌నే ఇబ్బంది పెట్టాడు. బుమ్రాతో పోటీపడుతూ భారత బ్యాటర్లకు నెట్స్‌లో చుక్కలు చూపించాడు. అతడే పంజాబ్ ఫాస్ట్ బౌలర్, యువ సంచలనం గుర్నూర్ బ్రార్. ఈ క్రమంలో ఎవరీ గుర్నూర్ బ్రార్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ గుర్నూర్ బ్రార్..?
కాగా తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ యువ పేసర్ నహిద్ రాణా నిప్పులు చేరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి నుంచి టీమిండియాకు ముప్పు పొంచి ఉంది. దీంతో అతడిని దీటుగా ఎదుర్కొనేందుకు భారత జట్టు మేనెజ్‌మెంట్ మాస్టర్ ప్లాన్ వేసింది.
నహిద్ రాణా బౌలింగ్ శైలిని పోలి ఉండే గుర్నూర్ బ్రార్‌ను నెట్‌బౌలర్‌గా భారత్ ఎంపిక చేసింది. గుర్నూర్ కూడా దాదాపుగా నహిద్ రాణా అంత ఎత్తు ఉంటాడు. నహిద్ 6.4 అడుగులు ఎత్తు ఉండగా.. గుర్నూర్ 6.5 అడుగుల హైట్ ఉన్నాడు.
కాగా భీకరమైన బౌన్సర్ల వేయడంలో గుర్నూర్ స్పెషలిస్టు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేనప్పటకి తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టే సత్తా అతడికి ఉంది. ఈ క్రమంలోనే నెట్‌బౌలర్‌గా భారత జట్టు మెనెజ్‌మెంట్ అతడిని తీసుకుంది.
24 ఏళ్ల గుర్నూర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం 5 ఫస్ట్‌క్లాస్ మాత్రమే ఆడిన అతడు 7 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఎ, టీ20 క్రికెట్‌లో చెరో మ్యాచ్ ఆడాడు. కాగా ఐపీఎల్‌లో కూడా అతడు అరంగేట్రం చేశాడు.
ఐపీఎల్-2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో అతడు అడుగు పెట్టాడు. ఆ సీజన్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో బ్రార్ చేరాడు. కానీ అతడికి సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాలేదు.
చదవండి: 'మేము ఓడిపోయినందుకు చాలా హ్యాపీ'.. పాక్ క్రికెటర్‌పై ట్రోల్స్ వర్షం
Comments
Please login to add a commentAdd a comment