కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌ సినిమా.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ను తుడిచిపెట్టింది! | India most profitable film had teenager as lead made for Just Rs 15 crore | Sakshi
Sakshi News home page

India most profitable film: రూ.15 కోట్ల బడ్జెట్‌.. స్టార్స్‌ కూడా లేరు.. బాహుబలి రికార్డ్‌ బ్రేక్!

Published Tue, Nov 26 2024 3:50 PM | Last Updated on Tue, Nov 26 2024 4:37 PM

India most profitable film had teenager as lead made for Just Rs 15 crore

ఇటీవల సినీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. పాన్ ఇండియా హీరోల సినిమాలకైచే నిర్మాతలు బడ్జెట్ విషయంలో అసలు వెనకడుగు వేయడం లేదు. ఇటీవల సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువా. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కేవలం రూ.100 కోట్లకు పైగా వసూళ్లతోనే సరిపెట్టుకుంది. టాలీవుడ్‌లోనూ సలార్, బాహుబలి, పుష్ప లాంటి భారీ బడ్జెట్‌ చిత్రాలైనప్పటికీ సక్సెస్‌ సాధించాయి.

అయితే భారీ బడ్జెట్‌ చిత్రాలతో లాభాల కంటే నష్టాలు ఎక్కువ వచ్చిన సందర్భాలే ఉంటున్నాయి. కానీ ఓ చిన్న సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్స్ సాధించింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

2017లో అద్వైత్ చందన్ తెరకెక్కించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ మూవీని కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నిర్మించారు. ఇండియాలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్‌లోనూ రూ.65 కోట్లు వసూలు చేసి విజయాన్ని సాధించింది.

అయితే ఆ తర్వాత చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఆ దేశంలో ఏకంగా 124 డాలర్ల మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా పెట్టుబడి కంటే అదనంగా 60 రెట్లు కలెక్షన్స్‌ సాధించింది. బాలీవుడ్‌లో జై సంతోషి మా మూవీ రికార్డును 20 రెట్ల భారీ తేడాతో అధిగమించింది.

ఈ లెక్కన సీక్రెట్ సూపర్‌స్టార్ ప్రపంచవ్యాప్తంగా రూ.966 కోట్లను ఆర్జించిందని నివేదికలు వెల్లడించాయి. ఈ వసూళ్లతో ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన స్త్రీ 2 (రూ.857 కోట్లు), పీకే (769 కోట్లు), గదర్ -2 (రూ.691 కోట్లు), బాహుబలి: ది బిగినింగ్ (617 కోట్లు) లాంటి భారీ బడ్జెట్‌ చిత్రాలను అధిగమించింది. ఇవన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలే. కానీ కేవలం రూ.15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన  సీక్రెట్ సూపర్‌స్టార్... భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఈ సినిమాలో పెద్ద స్టార్స్‌ కూడా లేరు. అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించగా.. 16 ఏళ్ల జైరా వాసిమ్‌ కీలక పాత్ర పోషించారు. చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం దంగల్ తర్వాత అమీర్, జైరాలకు ఆ దేశంలో లభించిన క్రేజ్‌ కారణమని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. నవంబర్ 2024 నాటికి ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు  సాధించిన 10వ భారతీయ చిత్రంగా సీక్రెట్ సూపర్‌స్టార్ నిలిచింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement