మాక్స్ వెల్ మెరుపులు, పంజాబ్ విజయం!
మాక్స్ వెల్ మెరుపులు, పంజాబ్ విజయం!
Published Thu, Sep 18 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఇంకా 14 బంతులుండగానే గెలిచింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాచ్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది. అయితే పంజాబ్ విజయంలో మాక్స్ వెల్, బెయిలీ, ఫెరీరాలు కీలక పాత్ర వహించారు.
మాక్స్ వెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 43 పరుగులు, బెయిలీ 27 బంతుల్లో 5 ఫోర్లతో 34, ఫెరీరా 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 35 పరుగులు చేశారు. హోబర్ట్ జట్టులో బొలింగర్ 2, హిల్ ఫెన్ హస్, లాలీన్, గుల్బీస్ చెరో వికెట్ పడగొట్టారు.
పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన హోబర్ట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హోబార్ట్ హరికేన్ జట్టులో డంక్ 26, బ్లిజార్డ్ 27, బిర్ట్ 28, వెల్స్ 28 పరుగులు చేశారు. పంజాబ్ జట్టులో అవానా, పటేల్ చెరో వికెట్ కరణ్ వీర్ సింగ్ చెరో వికెట్, పెరీరాకు రెండు వికెట్లు లభించాయి.
Advertisement
Advertisement