Hobart Hurricanes
-
చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. టీ20 ఫైనల్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ
బిగ్‌బాష్ లీగ్ 2024-25 ఫైనల్స్‌లో ఆసీస్ యువ ఓపెనర్, హోబర్ట్ హరికేన్స్ ఆటగాడు మిచెల్ ఓవెన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సిడ్నీ థండర్‌తో ఇవాళ (జనవరి 27) జరిగిన ఫైనల్లో 39 బంతుల్లో సెంచరీ చేసిన ఓవెన్.. టీ20 టోర్నీల ఫైనల్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కువైట్ ఆటగాడు రవిజ సందరువన్ పేరిట ఉండేది. సందరువన్ గతేడాది జరిగిన మలేసియా ట్రై నేషన్ టీ20 టోర్నీ ఫైనల్లో హాంగ్‌కాంగ్‌పై 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇవాల్టి వరకు టీ20 టోర్నీల ఫైనల్స్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. సందరువన్ రికార్డును ఇవాళ మిచెల్ ఓవెన్ చెరిపివేశాడు.టీ20 టోర్నీల ఫైనల్స్‌లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు భారత క్రికెటర్ వృద్దిమాన్ సాహా పేరిట ఉంది. సాహా 2014 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్‌పై 49 బంతుల్లో శతక్కొట్టాడు. టీ20 టోర్నీల ఫైనల్స్‌లో నాలుగు, ఐదో ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డులు తమీమ్ ఇక్బాల్, రిలీ రొస్సో పేరిట ఉన్నాయి. తమీమ్ 2019 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ఢాకా డైనమైట్స్పై 50 బంతుల్లో సెంచరీ చేయగా.. రిలీ రొస్సో 2024 బీపీఎల్ ఫైనల్లో గాలే మార్వెల్స్‌పై 50 బంతుల్లో శతక్కొట్టాడు.తాజా సెంచరీతో ఓవెన్ బిగ్‌బాష్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా సమం చేశాడు. ఓవెన్‌కు ముందు బీబీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రెయిగ్ సైమన్స్ పేరిట ఉండేది. సైమన్స్ మూడో బీబీఎల్ సీజన్లో 39 బంతుల్లో సెంచరీ చేశాడు. ఓవెన్ తాజాగా సైమన్స్ రికార్డును సమం చేశాడు. బీబీఎల్‌లో మూడు, నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డులు గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ బ్రౌన్ పేరిట ఉన్నాయి. మ్యాక్సీ బీబీఎల్-11 సీజన్లో 41 బంతుల్లో సెంచరీ చేశాడు. బ్రౌన్ గత సీజన్లో అన్నే బంతుల్లో శతక్కొట్టాడు.ఓవెన్ సునామీ శతకంతో చెలరేగడంతో బీబీఎల్ 2024-25 ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ సిడ్నీ థండర్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవెన్ ఒంటిచేత్తో హరికేన్స్‌కు తొలి బిగ్‌బాష్ లీగ్ టైటిల్‌ను అందించాడు. చిన్నతనంలో స్టాండ్స్‌లో కూర్చొని హరికేన్స్‌ను ఎంకరేజ్ చేసిన 23 ఏళ్ల ఓవెన్.. ఇప్పుడు తన జట్టును స్వయంగా గెలిపించాడు. ఓవెన్ శివాలెత్తిపోవడంతో హరికేన్స్ 14 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత సొంత ప్రేక్షకుల మధ్య తొలిసారి టైటిల్ గెలిచింది. మిచెల్ ఓవెన్ సునామీ శతకంతో మ్యాచ్‌ను వన్ సైడెడ్‌గా చేశాడు. ఓవెన్‌కు ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. తాజా సెంచరీతో ఓవెన్ ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన ఓవెన్ 203.60 స్ట్రయిక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు. ఇందులో 35 ఫోర్లు, 36 సిక్సర్లు ఉన్నాయి.థండర్‌తో జరిగిన ఫైనల్లో 11 సిక్సర్లు బాదిన ఓవెన్ బిగ్‌బాష్ లీగ్ ఫైనల్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. బీబీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించే క్రమంలో ఓవెన్ లీగ్ చరిత్రలో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓవెన్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్ 6 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ధండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్లు జేసన్ సంఘా (42 బంతుల్లో 67; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్) థండర్ తరఫున రాణించారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్, కెప్టెన్ నాథన్ ఇల్లిస్ తలో మూడు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి థండర్‌ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు.అనంతరం లక్ష్య ఛేదనలో హరికేన్స్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ దెబ్బకు థండర్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓవెన్ ధాటికి హరికేన్స్ 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓవెన్ ఔటయ్యాక మాథ్యూ వేడ్ (17 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), బెన్ మెక్‌డెర్మాట్ (12 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. థండర్ బౌలర్లలో తన్వీర్ సంఘా 2, టామ్ ఆండ్రూస్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఆసీస్ యువ ఆటగాడి విధ్వంసం.. 39 బంతుల్లోనే సెంచరీ! ఎవరీ ఓవెన్?
హోబర్ట్ వేదికగా సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. 183 పరుగుల లక్ష్య చేధనలో ఓవెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సిడ్నీ బౌలర్లను ఓవెన్ ఊతికారేశాడు. అతడిని అపడం ప్రత్యర్ధి జట్టు బౌలర్ల తరం కాలేదు. ఈ క్రమంలో 39 బంతుల్లోనే ఓవెన్ తన రెండో బీబీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్.. 6 ఫోర్లు, 11 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఓవెన్ తొలుత కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ అరుదైన రికార్డును ఓవెన్ తన పేరిట లిఖించుకున్నాడు. బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన మూడో ఆటగాడిగా టామ్ బాంటన్‌తో కలిసి మిచెల్ సంయుక్తంగా నిలిచాడు.బీబీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. 2016 సీజన్లో ఆడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ కేవలం 12 బంతుల్లోనే ఆర్దశతకంతో మెరిశాడు. ఆ తర్వాత స్ధానంలో డానియల్ క్రిస్టియన్(15 బంతులు), ఓవెన్(16), బాంటన్(16) ఉన్నారు.బీబీఎల్ విజేతగా హోబర్ట్..ఇక బీబీఎల్ 2024-25 సీజన్ విజేతగా హోబర్ట్ హరికేన్స్ నిలిచింది. తుది పోరులో సిడ్నీను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన హోబర్ట్.. తొలిసారి బీబీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఓవెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా హోబర్ట్.. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.1 ఓవర్లలో చేధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సిడ్నీ బ్యాటర్లలో జాసన్ సంగ(67) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ వార్నర్(48) పరుగులతో రాణించారు. హోబర్ట్ బౌలర్లలో మెరిడిత్, ఇల్లీస్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.ఎవరీ మిచెల్ ఓవెన్..?23 ఏళ్ల మిచెల్ ఓవెన్ లిస్ట్-ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ రెండింటిలోనూ టాస్మానియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22, 2021న మార్ష్ వన్-డే కప్‌లో లిస్ట్-ఎ క్రికెట్లో అడుగుపెట్టిన ఓవెన్.. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అక్టోబర్ 3, 2023న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా 24 టీ20ల్లో 33.18 సగటుతో 531 పరుగులు చేశాడు. అందులో 452 పరుగులు ఈ ఏడాది బిగ్‌బాష్ సీజన్లో చేసినవే కావడం గమనార్హం. బీబీఎల్ 2024-25 సీజన్లో ఓవెన్ 452 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఓవెన్‌కు పేస్ బౌలింగ్ చేసే సత్తాకూడా ఉంది. అతడు త్వరలోనే ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. Mitch Owen has just made the fastest fifty in a BBL Final!It's also the fastest Hurricanes fifty, and the third-fastest in BBL history. #BBL14 pic.twitter.com/2vuSvM7GVz— KFC Big Bash League (@BBL) January 27, 2025 -
బిగ్‌బాష్ లీగ్ ఫైనల్లో హరికేన్స్
బిగ్‌బాష్ లీగ్ 2025 ఎడిషన్ ఫైనల్లోకి హోబర్ట్ హరికేన్స్ ప్రవేశించింది. నిన్న (జనవరి 21) జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హరికేన్స్ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (15 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కాలెబ్ జువెల్ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు), బెన్ మెక్‌డెర్మాట్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. మథ్యూ వేడ్ 7 బంతుల్లో 4, నిఖిల్ చౌదరీ 11 బంతుల్లో 14, క్రిస్ జోర్డన్ 3 బంతుల్లో 2 (నాటౌట్), కెప్టెన్ నాథన్ ఇల్లిస్ 2 బంతుల్లో ఒక్క పరుగు చేశారు. సిక్సర్స్ బౌలర్లలో జాఫర్ చోహాన్, బెన్ డ్వార్షుయిస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, మిచెల్ పెర్రీ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సిక్సర్స్ 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సిక్సర్స్‌ను కర్టిస్ ప్యాటర్సన్ (33 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జోర్డన్ సిల్క్ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు), లాచ్లన్ షా (25 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే హరికేన్స్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో వీరి ప్రయత్నం వృధా అయ్యింది. రిలే మెరిడిత్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గానన్ 3 ఓవర్లలో 10 పరుగులకు 2 వికెట్లు తీశాడు. నాథన్ ఇల్లిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సిక్సర్స్ బ్యాటర్లు జోష్ ఫిలిప్ (0), జాక్ ఎడ్వర్డ్ (0), కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ (1) దారుణంగా విఫలమయ్యారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓడినా సిక్సర్స్‌కు మరో అవకాశం ఉంది. జనవరి 24న జరిగే ఛాలెంజర్‌లో నాకౌట్ విజేతతో తలపడుతుంది. ఇవాళ (జనవరి 22) జరుగబోయే నాకౌట్ మ్యాచ్‌లో సిడ్నీ థండర్, మెల్బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో మెగా ఫైనల్ జనవరి 27న జరుగనుంది. ఛాలెంజర్ విజేతతో హరికేన్స్ ఫైనల్లో తలపడుతుంది. -
వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్, సౌతాఫ్రికా ప్లేయర్ లిజెల్ లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ప్రస్తుత ఎడిషన్‌లో అరివీర భయంకమైన ఫామ్‌లో ఉన్న లీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు విధ్వంసకర సెంచరీలు చేసింది. తొలుత పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 బంతుల్లో అజేయమైన 150 పరుగులు (12 ఫోర్లు, 12 సిక్సర్లు) చేసిన లీ.. తాజాగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో మెరుపు సెంచరీతో (59 బంతుల్లో 103; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించింది. తద్వారా మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.కొడితే బ్యాట్ విరిగిపోయింది..!ఈ మ్యాచ్‌లో లిజెల్ కొట్టిన ఓ షాట్‌కు బ్యాట్ విరిగిపోయింది. ఓర్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి లిజెల్ క్రీజ్ వదిలి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడింది. ఈ షాట్‌కు బ్యాట్ విరిగిపోయినప్పటికీ బంతి బౌండరీని క్లియర్ చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్.. లిజెల్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిజెల్కు నికోలా క్యారీ (46 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సహకరించింది. హరికేన్స్ ఇన్నింగ్స్‌లో వ్యాట్ హాడ్జ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఎలైస్ విల్లాని 14 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అడిలైడ్ బౌలర్లలో మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో లిజెల్ రనౌటయ్యింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్ స్ట్రయికర్స్ 15 ఓవర్ల అనంతరం మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. స్మృతి మంధన (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో కదంతొక్కగా.. కేటీ మ్యాక్ 14, తహిళ మెక్‌గ్రాత్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. లారా వోల్వార్డ్ట్ (25), బ్రిడ్జెట్ ప్యాటర్సన్ (11) క్రీజ్‌లో ఉన్నారు. హరికేన్స్ బౌలర్లలో మోల్లీ స్ట్రానో, లారెన్ స్మిత్, యామీ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అడిలైడ్ గెలవాలంటే 30 బంతుల్లో మరో 80 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. -
పంజాబ్ కింగ్స్ బౌలర్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ బ్యాటర్ విధ్వంసం
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా సిడ్నీ థండర్స్‌తో ఇవాళ (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఆటగాళ్లు నాథన్ ఇల్లీస్ (ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్), టిమ్ డేవిడ్ (ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్) రెచ్చిపోయారు. ఇల్లీస్ హ్యాట్రిక్ వికెట్లతో (4/27) నిప్పులు చెరగగా.. టిమ్ డేవిడ్ (41 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న హోబర్ట్ టీమ్ 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్.. ఇల్లీస్, ప్యాట్రిక్ డూలీ (3/22), రిలే మెరిడిత్ (2/14), ఫహీమ్ అష్రాఫ్ (1/28) ధాటికి నిర్ణీత ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. చాలాకాలం తర్వాత బీబీఎల్‌లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ డకౌట్ కాగా, ఒలివర్ డేవిస్ (45), బెన్ కట్టింగ్ (20), కెప్టెన్ క్రిస్ గ్రీన్ (21) ఓ మోస్తరుగా రాణించారు. సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్.. టిమ్ డేవిడ్, కెప్టెన్ మాథ్యూ వేడ్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సిడ్నీ బౌలర్లలో డేనియల్ సామ్స్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో రెచ్చిపోయిన ఇల్లీస్.. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన 9వ బౌలర్‌గా, సిడ్నీ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా, ప్రస్తుత సీజన్లో మైఖేల్ నెసెర్ (బ్రిస్బేన్ హీట్) తర్వాత హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2012-13 సీజన్లో జేవియర్ డోహర్తీ సిడ్నీ తరఫున తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టగా.. బీబీఎల్‌లో ఇప్పటివరకు ఆండ్రూ టై (రెండు సార్లు), జోష్ లాలర్, రషీద్ ఖాన్, హరీస్ రౌఫ్, జేవియర్ డోహర్తీ, గురిందర్ సంధు, కెమరూన్ బాయ్స్ ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. -
ఇదేం బాదుడురా సామీ.. బిగ్‌బాష్ లీగ్‌లో చారిత్రక విజయం
బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్య ఛేదన ప్రస్తుత సీజన్లో (2022-23) నమోదైంది. నిన్న (జనవరి 5) అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ నిర్ధేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్ స్ట్రయికర్స్ మరో 3 బంతులుండగానే ఛేదించి (7 వికెట్ల తేడాతో) చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో రెచ్చిపోవడంతో 39.3 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు నమోదయ్యాయి. THE GREATEST CHASE! Simply incredible from Matt Short who brings up a ton to pull off the biggest chase in BBL history! Jawdropping stuff #BBL12 pic.twitter.com/98VzoYHMXY — KFC Big Bash League (@BBL) January 5, 2023 మాథ్యూ షార్ట్ వీరోచిత శతకంతో (59 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అడిలైడ్ స్ట్రయికర్స్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. షార్ట్‌కు క్రిస్ లిన్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆడమ్ హోస్ (22 బంతుల్లో 38; ఫోర్, 4 సిక్సర్లు) సహకరించడంతో కొండంత లక్ష్యం అమాంతం కరిగిపోయింది. హోబర్ట్ బౌలర్లలో ప్యాట్రిక్ డూలే (2/25), టిమ్ డేవిడ్ (1/18)లను మినహాయించి మిగతా బౌలర్లనంతా అడిలైడ్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. You should watch these highlights. #BBL12 https://t.co/3fWaTjiGFa — KFC Big Bash League (@BBL) January 5, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్.. బెన్ మెక్ డెర్మాట్ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కాలెబ్ జువెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాక్ క్రాలే (28 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ 2, కాన్వే, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో అడిలైడ్.. 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, బీబీఎల్ హిస్టరీలో రికార్డు ఛేదనను నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు హోబర్ట్ హరికేన్స్ పేరిట ఉండింది. 2016/17 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరికేన్స్ 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది
బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్ 2021-22) అద్భుత సన్నివేశం కొద్దిలో మిస్ అయింది. హరికేన్ హోబర్ట్స్ ఆటగాడు విల్ పార్కర్ బౌండరీ లైన్‌పై స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నప్పటికి.. బౌండరీ లైన్ తాకడంతో అంపైర్లు సిక్స్‌గా ప్రకటించారు. అయితే పార్కర్ బౌండరీ లైన్ తాకకుండా క్యాచ్ తీసుకొని ఉంటే చరిత్రలో నిలిచిపోయేవాడు. హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతిని మాట్ షార్ట్ లాంగాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అక్కడే ఉన్న పార్కర్ పరిగెత్తుకొచ్చి విల్లులా వొంగి.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అప్పటికే బౌండరీ లైన్ టచ్ చేయడంతో పార్కర్ ఏం చేయలేక బంతిని విసిరాడు. రూల్ ప్రకారం అంపైర్లు సిక్సర్ ఇవ్వడంతో పార్కర్ విన్యాసం వృథాగా మిగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 22 పరుగులతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. WILL PARKER! Six in the scorebook, but oh my... 🤯 #BBL11 pic.twitter.com/vIUFy64Kc5 — KFC Big Bash League (@BBL) January 21, 2022 -
రెండు సెంచరీలు ఒకే తరహాలో.. అరుదైన ఫీట్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సంచలన ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ మెక్ డెర్మోట్ వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌పై సెంచరీ బాదిన అతను బీబీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సాధించాడు. అయితే మెక్ డెర్మోట్ రెండు సెంచరీలను ఒకే తరహాలో అందుకోవడం విశేషం. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 95 పరుగులకు చేరుకున్న మెక్ డెర్మోట్.. కేన్ రిచర్డ్సన్ వేసిన బంతిని స్టాండ్స్‌లో కి బాది సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెక్ డెర్మోట్కు మూడో సెంచరీ కాగా.. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. చదవండి: BBL 2021: కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి కాగా ఇంతకముందు అడిలైడ్ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లోనూ సిక్స్‌తోనే సెంచరీ సాధించాడు. తద్వారా బీబీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలను సిక్సర్లతో పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా మెక్ డెర్మోట్ చరిత్ర సృష్టించాడు. ఇక హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. HISTORY MADE 🏆 Ben McDermott just made back-to-back 💯 for the first time in #BBL history! 📺 Watch #BBL11 on @Foxtel CH 503 or stream on @kayosports: https://t.co/gt5iNQ2w7F 📝 Blog: https://t.co/2QI8PpTMaE 🔢 Match Centre: https://t.co/QMgYF6q7lt pic.twitter.com/MFuEmYMWAw — Fox Cricket (@FoxCricket) December 29, 2021 That magic moment 💯 Ben McDermott brings up his second Big Bash century in STYLE 😎 #BBL11 pic.twitter.com/XsZP6cwY8y — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
12 ఫోర్లు, 5 సిక్స్‌లు.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆసీస్ ఆటగాడు!
బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ బెన్ మెక్‌డెర్మాట్ విధ్వంసం సృష్టించాడు. హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెక్‌డెర్మాట్ 60 బంతుల్లో 110 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. తొలుత 50 పరుగులు 36 బంతుల్లో చేయగా, చివరి 60 పరుగులు కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అడిలైడ్ స్ట్రైకర్స్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అడిలైడ్ బ్యాటరల్లో రెన్షా(63),వెదర్‌రాల్డ్(51) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. హోబర్ట్ బౌలరల్లో రిలే మెరెడిత్ మూడు వికెట్లు పడగొట్టగా,రోజర్స్, ఇల్స్ చెరో వికెట్ సాధించారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్ ఆదిలోనే వేడ్ వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో మెక్‌డెర్మాట్, డిఆర్సీ షార్ట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కిదిద్దాడు. వీరిద్దరూ కలిసి 81 పరగుల భాగాస్వమ్యాన్ని నమోదు చేశారు.తరువాత ఆర్సీ షార్ట్ ఔటైనప్పటికీ మెక్‌డెర్మాట్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో ఆగర్ బౌలింగ్‌లో సిక్ప్ బాది సెంచరీ సాధించాడు. మెక్‌డెర్మాట్ తుఫాన్ ఇన్నింగ్స్ ఫలితంగా హోబర్ట్ హరికేన్స్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. చదవండి: Ashes 2021: అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్! That magic moment 💯 Ben McDermott brings up his second Big Bash century in STYLE 😎 #BBL11 pic.twitter.com/XsZP6cwY8y — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
'మా బంతి పోయింది.. కనబడితే ఇచ్చేయండి!'
బిగ్‌బాష్ లీగ్ 2021లో శుక్రవారం మెల్బోర్న్ స్టార్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. మెల్బోర్న స్టార్స్ బౌలర్ నాథన్ కౌల్టర్ నీల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ నాలుగో బంతిని హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ బెన్ మెక్‌డెర్మోట్ డీప్ బ్యాక్వర్డ్స్క్వేర్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. అయితే బంతి వెళ్లి స్డేడియం అవతల చాలా దూరంలో పడింది. దీంతో దెబ్బకు అంపైర్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోనే బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..'' మా బంతి పోయింది.. ఒకవేళ కనిపిస్తే బ్లండ్స్స్టోన్ ఎరీనాకు తెచ్చివ్వండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 24 పరుగుల తేడాతో మెల్బోర్న్ స్టార్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్‌కు ఓపెనర్లు బెక్ డెర్మోట్(67 పరుగులు), మాధ్యూ వేడ్(39 పరుగులు) తొలి వికెట్‌కు 93 పరుగుల జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ తలా ఒక చెయ్యి వేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. జో క్లార్క్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జో బర్న్స్ 22, హిల్టన్ కార్ట్‌రైట్ 26 పరుగులు చేశారు. Lost ball: if found, please return to @BlundstoneArena 💥#BBL11 pic.twitter.com/Pvo3rzCp7t — KFC Big Bash League (@BBL) December 24, 2021 -
Short Run: ఏకంగా 5 పరుగుల పెనాల్టీ విధించిన అంపైర్
Tim David Attempts Short Run In BBL 2021: బీబీఎల్ 2021-22లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హోబర్ట్ హరికేన్స్ ఆటగాడు టిమ్ డేవిడ్.. స్ట్రయిక్‌ని అట్టిపెట్టుకోవడం కోసం క్రీజ్ సగం మధ్య వరకు మాత్రమే పరిగెత్తి రెండో పరుగు కోసం వెనక్కు వెళ్లాడు. నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో నాథన్ ఎల్లీస్కు స్ట్రయిక్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో షార్ట్ రన్ తీసినట్టు నిర్ధారణ కావడంతో అంపైర్లు హోబర్డ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. Stars will start their innings with 5 free runs courtesy of this... #BBL11 pic.twitter.com/lz9tRxNLLB— KFC Big Bash League (@BBL) December 24, 2021 దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. సాధారణంగా షార్ట్ రన్ అంటే.. క్రీజ్ దగ్గరి దాకా వెళ్లి పొరపాటున రెండో పరుగు కోసం తిరిగి వెళ్లడం. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో అలా జరగలేదు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హోబర్ట్ హరికేన్స్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ మెక్‌డెర్మాట్ (43 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (27 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం 181 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్ -
బ్యాట్స్‌మన్ భారీ సిక్స్.. అభిమాని తల పగిలి రక్తం
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) 2021లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మన్ కొట్టిన భారీ సిక్స్‌ను క్యాచ్‌గా తీసుకుందామని భావించిన అభిమాని తల పగిలి రక్తం కారడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం పెర్త్ స్కార్చర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఆండ్రూ టై బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ బెన్ మెక్‌డెర్మోట్ భారీ సిక్స్ బాదాడు. స్టాండ్స్‌లోకి వస్తున్న బంతిని ఒక అభిమాని ఉత్సాహంతో క్యాచ్ అందుకోవాలని ప్రయత్నించాడు. చదవండి: BBL 2021: 60 బంతుల్లో శతకం.. మిచెల్ మార్ష్ విధ్వంసం అయితే బంతి దురదృష్టవశాత్తూ అతని తల బాగంలో కుడివైపు బలంగా తగిలింది. దీంతో కుప్పకూలిన సదరు అభిమాని నుదుట నుంచి రక్తం కారడం మొదలైంది. ఇది చూసిన తోటి ప్రేక్షకులు కాస్త ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతన్ని సర్జన్ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు స్టేడియం నిర్వాహకులు ప్రకటించారు. చదవండి: ఆస్ట్రేలియా అండర్-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ మిచెల్ మార్ష్(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్ మెక్‌డెర్మోట్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3, ఆస్టన్ అగర్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు. చదవండి: Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన Lucky the fan on the hill is OK... Because his missed catch has drawn blood 😳#BBL11 pic.twitter.com/X0MTmDp7a2 — 7Cricket (@7Cricket) December 14, 2021 -
60 బంతుల్లో శతకం.. మిచెల్ మార్ష్ విధ్వంసం
బిగ్‌బాష్ లీగ్ 2021లో మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న మార్ష్ 60 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు బాదాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. బీబీఎల్ మార్ష్‌కు ఇది డెబ్యూ సెంచరీ కాగా.. ఈ సీజన్లో రెండోది. ఓవరాల్‌గా బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 28వ శతకం. ఇంతకముందు పెర్త్ స్కార్చర్స్కే చెందిన ఓపెనర్ కొలిన్ మున్రో ఈ సీజన్లో తొలి శతకంతో మెరిశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ మిచెల్ మార్ష్(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్ మెక్‌డెర్మోట్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3, ఆస్టన్ అగర్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు. Click Here For Video: Mitchel Marsh Century MITCH. MARSH. CENTURY.#BBL11 pic.twitter.com/I4zyNQyv9i — 7Cricket (@7Cricket) December 14, 2021 -
సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!
హోబార్డ్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)-10 వ సీజన్ ఇప్పటికే అభిమానులకు కావాల్సిన మజాను అందించగా, ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో సరదా సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది. ఒక బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి సరిగ్గా వెళ్లి ఒక అభిమాని తాగుతున్న బీర్ కప్‌లో పడింది. శనివారం(జనవరి 2వ తేదీన) హోబర్ట్ హరికేన్స్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికైంది. విషయంలోకి వెళితే.. హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ డేవిడ్ మలాన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు సాధించాడు. కాగా, అందులో ఒక సిక్స్ ఫ్యాన్ బీర్ మగ్‌లో పడింది. మెల్బోర్న్ స్టార్స్ బౌలర్ లాన్స్ మోరిస్ వేసిన 16వ ఓవర్లో ఒక బంతిని మలాన్ భారీ షాట్ ఆడాడు. స్వేర్ లెగ్ మీదుగా లాఫ్టెడ్ స్ట్రోక్ ఆడాడు. (ఓడిపోతామనే నాల్గోటెస్టు ఆడమంటున్నారా?) గ్యాలరీలోకి దూసుకొచ్చిన ఆ బంతిని పట్టుకోవడానికి ఫ్యాన్స్ పోటీ పడగా అది కాస్తా వెళ్లి ఒక అభిమాని బీర్ మగ్‌లో పడింది. అది కామెంటేటర్లతో పాటు కూర్చొన్న అభిమానుల్ని కూడా అలరించింది. కాగా, బీర్ మగ్‌లో పడ్డ ఆ బంతిని ఇవ్వడానికి సదరు అభిమానికి తొలుత నిరాకరించాడు. తాను బంతిని ఇవ్వనంటూ ఫీల్డర్‌ను ఆటపట్టించాడు. ఆ బంతి మగ్‌లో ఉండగానే ఒక చిప్లాగించిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి ఇచ్చాడు. ఇది బీబీఎల్ బెస్ట్ క్యాచ్‌ల్లో స్థానం సంపాదించకపోయినప్పటికీ ఆ అభిమానికి మాత్రం అదొక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. What the... An all-time Bucket Moment! 😂🤷♂️#BBL10 | @KFCAustralia pic.twitter.com/V5b9Xm34B4 — KFC Big Bash League (@BBL) January 2, 2021 -
పాపం ఫ్లెచర్.. సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ వైరల్‌గా మారింది. మెరుపు వేగంతో చేసిన ఆ రనౌట్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ క్రేజీ రనౌట్ హోబర్ట్ హరికేన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో చోటుచేసుకుంది. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని అండ్రీ ఫ్లెచర్ మిడాఫ్ దిశగా పుష్ చేశాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కార్ట్‌రైట్ పరుగుకు పిలుపివ్వగా.. ప్లెచర్ క్రీజు నుంచి పరిగెత్తాడు. (చదవండి : స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్) అప్పటికే బంతిని మెరుపు వేగంతో అందుకున్న షార్ట్ నాన్‌స్ట్రైకింగ్ వైపు త్రో విసరగా.. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. అప్పటికీ ప్లెచర్ క్రీజులోకి చేరుకోలేక రనౌట్‌గా వెనుదిరిగాడు. డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. షార్ట్ ఏంటి ఆ వేగం.. నీ రనౌట్‌తో ఫ్లెచర్ బిక్కమొహం వేశాడు. పాపం ఫ్లెచర్‌కు సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు.. అంటూ కామెంట్లు చేశారు. (చదవండి : ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ) The rocket arm from D'Arcy Short runs out Fletcher and the Stars lose their second wicket #BBL10 pic.twitter.com/4wGRhQuyKr — KFC Big Bash League (@BBL) January 2, 2021 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మలన్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 70 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడినా అతనికి మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. అటు హరికేన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మెల్బోర్న్ స్టార్స్ పరాజయం మూటగట్టుకుంది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు) -
సూపర్ రనౌట్.. ఆ మీసానికి పవర్స్ ఉన్నాయా!
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హరికేనక్స్ బౌలర్ రిలే మెరెడిత్ ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేసిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్ సమయంలో 9వ ఓవర్ వేసిన మెరెడిత్ మూడో బంతిని ర్యాన్ గిబ్సన్‌కు విసిరాడు. అయితే బంతి బ్యాట్‌ను తాకి పిచ్‌లో ఉండిపోయింది. అప్పటికే నాన్ స్ట్రైకింగ్ ఎండింగ్లో ఉన్న బ్యాట్స్‌మన్ ముందుకు రావడంతో ర్యాన్ గిబ్సన్ కూడా క్రీజు వదిలి పిచ్ మధ్యకు వచ్చేశాడు.(చదవండి : రషీద్‌ను దంచేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్) అప్పటికే పిచ్‌పై పాదరసంలా కదిలిన మెరెడిత్ బంతిని చేత్తో తీసుకోకుండా కేవలం ఫుట్వర్క్తోనే వికెట్లకు గిరాటేశాడు. గిబ్సన్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను తాకినట్లు రిప్లేలో కనపడడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే రషీద్‌ఖాన్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన మెరెడిత్ అంతకముందు వేసిన ఓవర్లోనూ జొనాథన్ వెల్స్‌ను కూడా డకౌట్ చేశాడు. ఓవరాల్‌గా మెరెడిత్ నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మెరెడిత్ గిబ్సన్‌ను ఔట్ చేసిన తీరును బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేసింది. 'ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం.. మెరెడిత్ ఒక్కడే అన్ని పనులు చేస్తున్నాడు.. కచ్చితంగా అతని మీసానికి ఏవో సూపర్ పవర్స్ ఉన్నాయి' అంటూ ఫన్నీ క్యాప్షన్ జత చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : ముందు మీ టాప్ ఆర్డర్ చూసుకో : వసీం జాఫర్) Incredible! That moustache has super powers. Riley Meredith is doing it all out there! #BBL10 pic.twitter.com/I6ccaj2QQ7 — KFC Big Bash League (@BBL) December 13, 2020 కాగా ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరకేన్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. డీ ఆర్సీ షార్ట్ 48 బంత్లుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 175 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. అడిలైడ్ బ్యాట్స్మెన్లలో డేనియల్ వోర్రాల్ 66* పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరికేన్స్ బౌలర్లలో జేమ్స్ ఫాల్కనర్ 3 వికెట్లతో రాణించగా.. జాన్ బోతా, రిలే మెరిడిత్ చెరో 2 వికెట్లు తీశారు. (చదవండి : వైరల్ : రనౌట్ తప్పించుకునేందుకే..) -
రషీద్‌ను దంచేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో ఆదివారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరకేన్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ హరికేన్స్ బ్యాట్స్‌మెన్ డీ ఆర్సీ షార్ట్ 48 బంత్లుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా అడిలైడ్ స్రైకర్స్ బౌలర్ రషీద్ ఖాన్‌ను డీ ఆర్సీ షార్ట్ దంచికొట్టాడు. రషీద్ వేసిన ఒక ఓవర్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ సహా మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. ఇదే డీ ఆర్సీ షార్ట్ టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.(చదవండి : ముందు మీ టాప్ ఆర్డర్ చూసుకో : వసీం జాఫర్) వాస్తవానికి షార్ట్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు డాన్ వోర్రాల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన డీ ఆర్సీ షార్ట్ మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. 175 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. అడిలైడ్ బ్యాట్స్మెన్లలో డేనియల్ వోర్రాల్ 66* పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరికేన్స్ బౌలర్లలో జేమ్స్ ఫాల్కనర్ 3 వికెట్లతో రాణించగా.. జాన్ బోతా, రెలీ మెరిడిత్ చెరో 2 వికెట్లు తీశారు.(చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!) 6⃣ 6⃣ 4⃣ 6⃣ 2⃣ D'Arcy Short smashes 24 runs in a single over off the No.1 T20I bowler, Rashid Khan 🔥#BBL10 pic.twitter.com/FsSRtj1Okh — ICC (@ICC) December 13, 2020 -
పరుగు కోసం తాపత్రయం.. తప్పిన ప్రమాదం
మెల్బోర్న్: మిగతా ఆటలతో పోలిస్తే క్రికెట్లో కాస్త రిస్క్ తక్కువ అని కొందరి అభిప్రాయం. అయితే ఏ మాత్రం అదుపు తప్పిన, అలసత్వం ప్రదర్శించినా ఊహకు కూడా అందని పరిణామాలు చోటు చేసుకుంటాయి. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. బిగ్‌బాష్‌లీగ్ (బీబీఎల్) భాగంగా మెల్బోర్న్ రెనిగెడ్స్ బ్యాట్స్‌మన్ సామ్ హార్పర్ పరుగు తీసే క్రమంలో బౌలర్‌ను ఢీ కొట్టి ఆస్పత్రిపాలయ్యాడు. అయితే ఈ ఘటన జరిగిన తీరు చూశాక సహచర ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బీబీఎల్‌లో భాగంగా మంగళవారం హార్బర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ రెనిగెడ్స్ జట్ల మధ్య హోరాహోరు పోరు జరిగింది. అయితే మెల్బోర్న్ బ్యాటింగ్ సందర్భంగా హరికేన్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ సామ్ హార్పర్ మిడాఫ్ మీదుగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే మిడాఫ్‌లో ఉన్న ఫీల్డర్ బంతిని అందుకోవడాన్ని గమనించిన హార్పర్ ఎదురుగా ఉన్న బౌలర్‌ను చూసుకోకుండా పరిగెత్తాడు. అయితే బంతిని అందుకోవడానికి వికెట్ల దగ్గరే ఉన్న ఎల్లిస్‌ను హార్పర్ బలంగా ఢీ కొట్టి గాల్లొకి ఎగిరాడు. అయితే గాల్లోకి ఎగిరి కిందపడే సమయంలో హార్పర్ మెడ బలంగా మైదానాన్ని తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడు. డాక్టర్లు వచ్చి హార్పర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే అతడికి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 😨 Nasty collision in the middle between Sam Harper and Nathan Ellis. Play has stopped while the docs take a look at Harper #BBL09 pic.twitter.com/yDARqnMtRl — KFC Big Bash League (@BBL) January 21, 2020 ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. హార్పర్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనిగెడ్స్ 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెనిగేడ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చదవండి: కాంబ్లికి సచిన్ సవాల్ స్టార్క్‌ను ట్రోల్ చేసిన భార్య -
భారీ షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
-
షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
బ్రిస్బేన్ : క్రికెట్ ఆటలో ఫన్నీ మూమెంట్స్ చోటు చేసుకువడం సహజంగా కనిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో గురువారం బ్రిస్బేన్ హీట్ , హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్లో ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ ఖైస్ అహ్మద్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్ హీట్ బౌలర్ జోష్ లాలోర్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరినీ స్టంప్స్‌కు దూరంగా జరిగి ఫైన్‌లెగ్ మీదుగా షాట్ ఆడాలని ప్రయత్నించి పొరపాటున బ్యాట్‌ను వదిలేశాడు. దీంతో బ్యాట్ గాల్లో గిర్రున తిరిగి కొంచెం దూరంలో పడింది. అయితే బ్యాట్‌ను తీసుకొచ్చిన ఆటగాడు ఖైస్కు ఇస్తూ' గబ్బాలో బాల్‌కు బదులు బ్యాట్లు ఎగురుతున్నాయి' అంటూ నవ్వుతూ చెప్పాడు. దీంతో ఖైస్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా చిరునవ్వులు చిందించారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ హోబర్ట్ హరికేన్స్‌పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవరల్లో 9వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆ తర్వాత 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బెన్ హీట్ 18.2 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. (ఇట్స్ మిరాకిల్.. ఒకే రోజు రెండు) -
సెమీస్‌లో హోబర్ట్
బార్బడోస్పై 6 వికెట్లతో ఘన విజయం మొహాలి: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో హోబర్ట్ హరికేన్స్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హోబర్ట్ 6 వికెట్ల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ట్రైడెంట్స్ 19.4 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. కార్టర్ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. హరికేన్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డోహర్తి (4/27) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. హిల్ఫెన్హాస్, బొలింజర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం హోబర్ట్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (35 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు), వెల్స్ (17 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 35 బంతుల్లో అభేద్యంగా 48 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు నెగ్గిన హరికేన్స్... పంజాబ్‌తో పాటు గ్రూప్ ‘బి’నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్‌లోని కేప్ కోబ్రాస్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, బార్బడోస్ట్రైడెంట్స్ ఈసారికి లీగ్ దశతోనే సరిపెట్టుకున్నాయి. -
కోబ్రాస్ పై హరికేన్స్ జయభేరి
-
సానియా భర్తకు నిరాశే మిగిలింది!
హైదరాబాద్ అల్లుడు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కు నిరాశే ఎదురైంది. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న షోయబ్ బంతితోనూ, బ్యాట్ తో రాణించలేక విఫలమయ్యారు. కేప్ కోబ్రాస్ తో జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టు తరపున 2 ఓవర్లు బౌలింగ్ చేసిన షోయబ్ 15 పరుగులు ఇచ్చాడు. అంతేకాకుండా కేవలం 8 పరుగులకే అవుటయ్యాడు. ఇక సానియా టోక్యోలోని డబ్ల్యూటీఏ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. సానియా తండ్రి షోయబ్ కు తన నివాసంలో విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు పాకిస్థానీ ఆటగాడు లాహోర్ లయన్స్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ హాజరయ్యారు. -
చాంపియన్స్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ బోణి
-
పంజాబ్ కింగ్స్ బోణి
మొహాలీ: ఐపీఎల్-7లో వీర బాదుడుకు పర్యాయంగా నిలిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 43; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) మరోసారి తన పవర్ చూపించాడు. లక్ష్యం చిన్నదే అయినా నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును తనకే సాధ్యమైన ఆటతీరుతో గట్టెక్కించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పెరీరా, బెయిలీ (27 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు) చివర్లో చెలరేగడంతో చాంపియన్స్ లీగ్‌లో తొలిసారిగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు శుభారంభం చేసింది. పీసీఏ స్టేడియంలో గురువారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో బెయిలీ సేన ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. వెల్స్ (18 బంతుల్లో 28; 5 ఫోర్లు), బిర్ట్ (21 బంతుల్లో 28; 1 ఫోర్; 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. బౌలింగ్‌లో పెరీరా (2/17) రాణించాడు. అనంతరం పంజాబ్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి నెగ్గింది. నెమ్మదిగా ఆరంభం హరికేన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే నెమ్మదిగా సాగింది. ఐదో ఓవర్లో కెప్టెన్ పైన్ (16 బంతుల్లో 11; 1 ఫోర్)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో ఓపెనర్ డంక్ మూడు ఫోర్లతో రెచ్చిపోయినా ఎనిమిదో ఓవర్లో పెరీరాకు దొరికిపోయాడు. పంజాబ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మిడిల్ ఓవర్లలోనూ హరికేన్ బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డారు. అటు వరుస ఓవర్లలో బ్లిజార్డ్, షోయబ్ మాలిక్ (14 బంతుల్లో 14; 1 ఫోర్) అవుట్ కావడంతో స్కోరు మరింత నెమ్మదించింది. చివర్లో బౌలర్లు మంచి బంతులు వేయడంతో భారీ స్కోరు సాధ్యపడలేదు. తొలి బంతికే ఝలక్ పంజాబ్ బ్యాటింగ్‌లో బొలింజర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే వీరేంద్ర సెహ్వాగ్ అవుటై నిరాశపరిచాడు. తన మరుసటి ఓవర్లోనే సాహా (9 బంతుల్లో 11; 1 ఫోర్)ను కూడా బొలింజర్ పెవిలియన్ పంపించాడు. మిల్లర్ డకౌట్‌తో 23 పరుగులకే మూడు వికెట్లు పోవడంతో పంజాబ్ శిబిరంలో ఆందోళన నెలకొన్నా మ్యాక్స్‌వెల్ ఆ పరిస్థితిని మార్చాడు. తాను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్స్‌గా మలిచిన ఈ డాషింగ్ ఆటగాడు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. అయితే బోయ్స్ వేసిన 9వ ఓవర్లో 6,4తో అదరగొట్టి జోరు చూపిస్తున్న వేళ గల్బిస్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే బెయిలీ, పెరీరా వేగంగా ఆడి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) పెరీరా 26; పైన్ (బి) పటేల్ 11; బ్లిజార్డ్ (సి) అవానా (బి) పెరీరా 27; షోయబ్ (సి) బె యిలీ (బి) కరణ్వీర్ 14; బర్ట్ (సి) కరణ్వీర్ (బి) అవానా 28; వెల్స్ (రనౌట్) 28; గల్బిస్ నాటౌట్ 6; హిల్ఫెన్హాస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (4); మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1-15; 2-43; 3-71; 4-78; 5-130; 6-143. బౌలింగ్: అనురీత్ సింగ్ 4-0-25-0; అవానా 4-0-25-1; పటేల్ 4-0-20-1; సెహ్వాగ్ 1-0-8-0; పెరీరా 3-0-17-2; మ్యాక్స్‌వెల్ 1-0-9-0; కరణ్వీర్ సింగ్ 3-0-37-1. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) బోయ్స్ (బి) బొలింజర్ 0; వోహ్రా (సి) హిల్ఫెన్హాస్ (బి) లాగ్లిన్ 18; సాహా (సి) షోయబ్ (బి) బొలింజర్ 11; మిల్లర్ (సి) బోయ్స్ (బి) హిల్ఫెన్హాస్ 0; మ్యాక్స్‌వెల్ (సి) పైన్ (బి) గల్బిస్ 43; బెయిలీ నాటౌట్ 34; పెరీరా నాటౌట్ 35; ఎక్స్‌ట్రాలు (5); మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-0; 2-21; 3-23; 4-51; 5-77. బౌలింగ్: బొలింజర్ 4-0-30-2; హిల్ఫెన్హాస్ 4-0-30-1; బోయ్స్ 3-0-36-0; లాగ్లిన్ 4-0-26-1; గల్బిస్ 2.4-0-23-1. -
మాక్స్ వెల్ మెరుపులు, పంజాబ్ విజయం!
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఇంకా 14 బంతులుండగానే గెలిచింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాచ్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది. అయితే పంజాబ్ విజయంలో మాక్స్ వెల్, బెయిలీ, ఫెరీరాలు కీలక పాత్ర వహించారు. మాక్స్ వెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 43 పరుగులు, బెయిలీ 27 బంతుల్లో 5 ఫోర్లతో 34, ఫెరీరా 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 35 పరుగులు చేశారు. హోబర్ట్ జట్టులో బొలింగర్ 2, హిల్ ఫెన్ హస్, లాలీన్, గుల్బీస్ చెరో వికెట్ పడగొట్టారు. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన హోబర్ట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హోబార్ట్ హరికేన్ జట్టులో డంక్ 26, బ్లిజార్డ్ 27, బిర్ట్ 28, వెల్స్ 28 పరుగులు చేశారు. పంజాబ్ జట్టులో అవానా, పటేల్ చెరో వికెట్ కరణ్ వీర్ సింగ్ చెరో వికెట్, పెరీరాకు రెండు వికెట్లు లభించాయి. -
పంజాబ్ టార్గెట్ 145, సెహ్వాగ్ డకౌట్
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హోబార్ట్ హరికేన్ జట్టులో డంక్ 26, బ్లిజార్డ్ 27, బిర్ట్ 28, వెల్స్ 28 పరుగులు చేశారు. పంజాబ్ జట్టులో అవానా, పటేల్ చెరో వికెట్ కరణ్ వీర్ సింగ్ చెరో వికెట్, పెరీరాకు రెండు వికెట్లు లభించాయి. అయితే 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాచ్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది.