బార్బడోస్పై 6 వికెట్లతో ఘన విజయం
మొహాలి: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో హోబర్ట్ హరికేన్స్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హోబర్ట్ 6 వికెట్ల తేడాతో బార్బడోస్ ట్రైడెంట్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ట్రైడెంట్స్ 19.4 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. కార్టర్ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. హరికేన్స్ లెఫ్టార్మ్ స్పిన్నర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డోహర్తి (4/27) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. హిల్ఫెన్హాస్, బొలింజర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం హోబర్ట్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (35 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు), వెల్స్ (17 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 35 బంతుల్లో అభేద్యంగా 48 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు నెగ్గిన హరికేన్స్... పంజాబ్‌తో పాటు గ్రూప్ ‘బి’నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్‌లోని కేప్ కోబ్రాస్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, బార్బడోస్ట్రైడెంట్స్ ఈసారికి లీగ్ దశతోనే సరిపెట్టుకున్నాయి.
సెమీస్‌లో హోబర్ట్
Published Mon, Sep 29 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM
Advertisement