Ben McDermott Century In Big Bash League, Video Viral - Sakshi
Sakshi News home page

12 ఫోర్లు, 5 సిక్స్‌లు.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆసీస్‌ ఆటగాడు!

Published Tue, Dec 28 2021 11:39 AM | Last Updated on Tue, Dec 28 2021 2:13 PM

Ben McDermott Slams hundred in big bash league - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్‌ బెన్ మెక్‌డెర్మాట్‌ విధ్వంసం సృష్టించాడు. హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మెక్‌డెర్మాట్‌ 60 బంతుల్లో 110 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. తొలుత 50  పరుగులు 36 బంతుల్లో చేయగా, చివరి 60 పరుగులు కేవలం 24 బంతుల్లోనే సాధించాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అడిలైడ్ స్ట్రైకర్స్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అడిలైడ్ బ్యాటరల్లో రెన్‌షా(63),వెదర్‌రాల్డ్(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. హోబర్ట్ బౌలరల్లో  రిలే మెరెడిత్ మూడు వికెట్లు పడగొట్టగా,రోజర్స్‌, ఇల్స్‌ చెరో వికెట్‌ సాధించారు. 

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్ ఆదిలోనే వేడ్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో మెక్‌డెర్మాట్‌, డిఆర్సీ షార్ట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కిదిద్దాడు. వీరిద్దరూ కలిసి 81 పరగుల భాగాస్వమ్యాన్ని నమోదు చేశారు.తరువాత ఆర్సీ షార్ట్‌ ఔటైనప్పటికీ మెక్‌డెర్మాట్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో ఆగర్‌ బౌలింగ్‌లో సిక్ప్‌ బాది సెంచరీ సాధించాడు. మెక్‌డెర్మాట్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఫలితంగా హోబర్ట్ హరికేన్స్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది.

చదవండి: Ashes 2021: అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్‌ బౌలర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement