wade
-
12 ఫోర్లు, 5 సిక్స్‌లు.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆసీస్ ఆటగాడు!
బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ బెన్ మెక్‌డెర్మాట్ విధ్వంసం సృష్టించాడు. హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెక్‌డెర్మాట్ 60 బంతుల్లో 110 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. తొలుత 50 పరుగులు 36 బంతుల్లో చేయగా, చివరి 60 పరుగులు కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అడిలైడ్ స్ట్రైకర్స్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అడిలైడ్ బ్యాటరల్లో రెన్షా(63),వెదర్‌రాల్డ్(51) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. హోబర్ట్ బౌలరల్లో రిలే మెరెడిత్ మూడు వికెట్లు పడగొట్టగా,రోజర్స్, ఇల్స్ చెరో వికెట్ సాధించారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్ ఆదిలోనే వేడ్ వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో మెక్‌డెర్మాట్, డిఆర్సీ షార్ట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కిదిద్దాడు. వీరిద్దరూ కలిసి 81 పరగుల భాగాస్వమ్యాన్ని నమోదు చేశారు.తరువాత ఆర్సీ షార్ట్ ఔటైనప్పటికీ మెక్‌డెర్మాట్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో ఆగర్ బౌలింగ్‌లో సిక్ప్ బాది సెంచరీ సాధించాడు. మెక్‌డెర్మాట్ తుఫాన్ ఇన్నింగ్స్ ఫలితంగా హోబర్ట్ హరికేన్స్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. చదవండి: Ashes 2021: అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్! That magic moment 💯 Ben McDermott brings up his second Big Bash century in STYLE 😎 #BBL11 pic.twitter.com/XsZP6cwY8y — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
ఇంగ్లండ్ లక్ష్యం 398
బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్మిత్ (142; 14 ఫోర్లు), వేడ్ (110; 17 ఫోర్లు) శతక్కొట్టడంతో ఇంగ్లండ్ ముందు 398 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 124/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలుత స్మిత్, ట్రావిస్ హెడ్ (51) నాలుగో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. తర్వాత ఐదో వికెట్‌కు వేడ్, స్మిత్ జోడీ 126 పరుగులు జతచేసింది. స్మిత్ యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. గతంలో బార్డ్స్లే, మోరిస్, స్టీవ్ వా, హేడెన్ ఇలా రెండు సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (7 బ్యాటింగ్), రాయ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి. -
ఆసీస్ అదుర్స్
ముంబై: భారత పర్యటనను ఘనంగా ఆరంభించాలని భావించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తన తొలి ప్రయత్నాన్ని దిగ్గిజయంగా అధిగమించింది. భారత్ 'ఎ' తో ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో ఆసీస్ తన బ్యాటింగ్ బలాన్ని చాటుకుని అదుర్స్ అనిపించింది. శుక్రవారం తొలి రోజు ఆటలో మూడొందల మార్కును చేరి ఆకట్టుకున్న ఆసీస్.. శనివారం రెండో రోజు ఆటలో కూడా బ్యాట్ తో మెరిసింది. 325/5 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. ఈ రోజు లంచ్ సమయానికి వికెట్ ను కోల్పోయి నాలుగొందల పరుగుల మార్కును చేరింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్‌లు తొలి సెషన్ లోపే హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ 114.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది. అయితే మాథ్యూ వేడ్(64)ఆరో వికెట్ గా నిష్ర్కమించాడు. అంతకుముందు స్టీవ్ స్మిత్(107), షాన్ మార్ష్(104)లు సెంచరీలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.