ఆసీస్ అదుర్స్
ముంబై: భారత పర్యటనను ఘనంగా ఆరంభించాలని భావించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తన తొలి ప్రయత్నాన్ని దిగ్గిజయంగా అధిగమించింది. భారత్ 'ఎ' తో ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో ఆసీస్ తన బ్యాటింగ్ బలాన్ని చాటుకుని అదుర్స్ అనిపించింది. శుక్రవారం తొలి రోజు ఆటలో మూడొందల మార్కును చేరి ఆకట్టుకున్న ఆసీస్.. శనివారం రెండో రోజు ఆటలో కూడా బ్యాట్ తో మెరిసింది. 325/5 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. ఈ రోజు లంచ్ సమయానికి వికెట్ ను కోల్పోయి నాలుగొందల పరుగుల మార్కును చేరింది.
ఓవర్ నైట్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్లు తొలి సెషన్ లోపే హాఫ్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ 114.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది. అయితే మాథ్యూ వేడ్(64)ఆరో వికెట్ గా నిష్ర్కమించాడు. అంతకుముందు స్టీవ్ స్మిత్(107), షాన్ మార్ష్(104)లు సెంచరీలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.