BBL 2021: Ben McDermott Smashes Six Back-to-Back Centuries, Creates History - Sakshi
Sakshi News home page

BBL 2021: రెండు సెంచరీలు ఒకే తరహాలో.. అరుదైన ఫీట్‌

Published Wed, Dec 29 2021 4:30 PM | Last Updated on Wed, Dec 29 2021 5:54 PM

BBL 2021: McDermott Smashes Six Back-To-Back Centuries Creates History - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌ 2021)లో సంచలన ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హోబర్ట్‌ హరికేన్స్‌ ఓపెనర్‌ మెక్‌ డెర్మోట్‌ వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌పై సెంచరీ బాదిన అతను బీబీఎల్‌ చరిత్రలో కొత్త రికార్డు సాధించాడు.  అయితే మెక్‌ డెర్మోట్‌ రెండు సెంచరీలను ఒకే తరహాలో అందుకోవడం విశేషం. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో 95 పరుగులకు చేరుకున్న మెక్‌ డెర్మోట్‌.. కేన్‌ రిచర్డ్‌సన్‌ వేసిన బంతిని స్టాండ్స్‌లో కి బాది సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో మెక్‌ డెర్మోట్‌కు మూడో సెంచరీ కాగా.. ఈ సీజన్‌లో ఇది రెండో సెంచరీ.

చదవండి: BBL 2021: కళ్లు చెదిరే క్యాచ్‌.. ఔటయానన్న సంగతి మరిచిపోయి

కాగా  ఇంతకముందు అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లోనూ సిక్స్‌తోనే సెంచరీ సాధించాడు. తద్వారా బీబీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలను సిక్సర్లతో పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా మెక్‌ డెర్మోట్‌ చరిత్ర సృష్టించాడు. ఇక హోబర్ట్‌ హరికేన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement