Melbourne Renegades
-
మ్యాక్స్‌వెల్ ఊచకోత.. సిక్సర్ల సునామీ
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (45/4) ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్.. 52 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మ్యాక్సీ.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఆడమ్ జంపా వేసిన 16వ ఓవర్లో సిక్సర్, బౌండరీ బాదిన మ్యాక్స్‌వెల్.. కేన్ రిచర్డ్సన్ వేసిన ఆతర్వాతి ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్లో అతను బౌండరీ, రెండు భారీ సిక్సర్లు బాదాడు. GLENN MAXWELL HITS 122 METER SIX IN BBL. 🤯- Glenn Maxwell, The Big Show..!!! 🔥pic.twitter.com/zcwV3b28Hd— Tanuj Singh (@ImTanujSingh) January 12, 2025ఈ ఓవర్లోని తొలి సిక్సర్ (రెండో బంతి) బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ఈ సిక్సర్ 122 మీటర్ల దూరం వెళ్లింది. మ్యాకీకి ముందు బీబీఎల్‌లో భారీ సిక్సర్ రికార్డు సహచరుడు హిల్టన్ కార్ట్‌రైట్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో కార్ట్‌రైట్ 121 మీటర్ల సిక్సర్ బాదాడు.అనంతరం సదర్‌ల్యాండ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో అతను మూడు భారీ సిక్సర్లు సహా ఓ బౌండరీ బాదాడు. ఈ ఓవర్లో మ్యాక్సీ వరుసగా తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. సెంచరీకి 10 పరుగుల దూరంలో ఉండగా మ్యాక్సీ 20వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. కేన్ రిచర్డ్సన్ మ్యాక్సీని క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాక్స్‌వెల్ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌కు ఎవరి సహకారం లభించనప్పటికీ ఒక్కడే ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఖాతా కూడా తెరవని ఉసామా మిర్‌తో మ్యాక్స్‌వెల్ ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు జోడించడం విశేషం. ఈ 81 పరుగులను మ్యాక్స్‌వెల్ ఒక్కడే చేశాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బెన్ డకెట్ (21), బ్యూ వెబ్‌స్టర్ (15) కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. 32 పరుగుల వద్ద బెన్ డకెట్, థామస్ రోజర్స (0) ఔటయ్యారు. అనంతరం 45 పరుగుల వద్ద వెబ్‌స్టర్, 55 పరుగుల వద్ద సోయినిస్ (18), 63 పరుగుల వద్ద కార్ట్‌రైట్ (6), 75 పరుగుల వద్ద జోయల్ పారిస్ (3) పెవిలియన్‌కు చేరారు. 11 ఓవర్లలో మెల్బోర్న్ స్టార్స్ ఏడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. ఈ దశలో మ్యాక్సీ ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, ఫెర్గస్ ఓనీల్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేకబ్ బేతెల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.NOVAK DJOKOVIC AT THE BBL. 🐐- The reaction after Stoinis was out. 😄pic.twitter.com/eruRdky7yL— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన జకోవిచ్ఈ మ్యాచ్ చూసేందుకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ వచ్చాడు. జకో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జకో మెల్బోర్న్ స్టార్స్‌కు మద్దతుగా నిలిచాడు. స్టార్స్ కెప్టెన్ స్టోయినిస్ ఔట్ కాగానే జకో నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.తడబడుతున్న రెనెగేడ్స్166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రెనెగేడ్స్ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మార్క్ స్టీకిటీ (3-0-14-3) అద్భుతంగా బౌలింగ్ చేసి రెనెగేడ్స్‌ను దెబ్బకొట్టాడు. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో జోష్ బ్రౌన్ 4, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 19, జేకబ్ బేతెల్ 1, విల్ సదర్‌ల్యాండ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. టిమ్ సీఫర్ట్ 26, హ్యారీ డిక్సన్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్ గెలవాలంటే 42 బంతుల్లో 88 పరుగులు చేయాలి. -
10 పరుగులకే నాలుగు వికెట్లు.. కట్ చేస్తే..!
బిగ్ బాష్ లీగ్‌లో ఇవాళ (జనవరి 7) మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆస్టన్ అగర్ (30 బంతుల్లో 51; ఫోర్, 4 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో రాణించడంతో స్కార్చర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆరోన్ హార్డీ (34), ఫిన్ అలెన్ (19), నిక్ హాబ్సన్ (12), జై రిచర్డ్సన్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్ మార్ష్, కూపర్ కన్నోలి, మాథ్యూ కెల్లీ డకౌట్ అయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. టామ్ రోజర్స్, సదర్‌ల్యాండ్ తలో రెండు, కేన్ రిచర్డ్సన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.తడబడినా నిలబడ్డారు..!148 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ ఆదిలో తడబడింది. ఆ జట్టు 44 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ విల్ సదర్‌ల్యాండ్ (45 బంతుల్లో 70; 5 ఫోర్లు,3 సిక్సర్లు), థామస్ రోజర్స్ (31 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 92 పరుగులు జోడించి మ్యాచ్‌ను రెనెగేడ్స్ వశం చేశారు. సదర్‌ల్యాండ్, రోజర్స్ దెబ్బకు రెనెగేడ్స్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్, రోజర్స్‌తో పాటు మార్కస్ హ్యారిస్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు. టిమ్ సీఫర్ట్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, లారీ ఇవాన్స్ ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. స్కార్చర్స్ బౌలర్లలో జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, జై రిచర్డ్సన్, లారీ మోరిస్ తలో రెండు వికెట్లు తీసి రెనెగేడ్స్‌ను ఇబ్బంది పెట్టారు.26 మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికలో సిడ్నీ సిక్సర్స్ (9 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. సిడ్నీ థండర్ (8), హోబర్ట్ హరికేన్స్ (8), బ్రిస్బేన్ హీట్ (7), పెర్త్ స్కార్చర్స్ (6), మెల్బోర్న్ రెనెగేడ్స్ (6), అడిలైడ్ స్ట్రయికర్స్ (4), మెల్బోర్న్ స్టార్స్ (4) వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. -
బిగ్‌బాష్ లీగ్ విజేత మెల్బోర్న్ రెనెగేడ్స్
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2024 ఎడిషన్ టైటిల్‌ను మెల్బోర్న్ రెనెగేడ్స్ గెలుచుకుంది . ఇవాళ (డిసెంబర్ 1) జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం బ్రిస్బేన్ హీట్ బ్యాటింగ్ చేసే సమయానికి వర్షం మొదలుకావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లక్ష్యాన్ని 12 ఓవర్లలో 98 పరుగులకు కుదించారు. ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన బ్రిస్బేన్ హీట్ లక్ష్యానికి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయింది. నికోలా హ్యాంకాక్ చివరి బంతికి సిక్సర్ బాదినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.రాణించిన హేలీ మాథ్యూస్తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్.. హేలీ మాథ్యూస్ అర్ద సెంచరీతో (61 బంతుల్లో 69) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జార్జియా వేర్హమ్ (21), నయోమీ స్టాలెన్‌బర్గ్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో చార్లీ నాట్ 3 వికెట్లు పడగొట్టగా.. గ్రేస్ పార్సన్స్ 2, నికోలా హ్యాంకాక్, లూసీ హ్మామిల్టన్, జొనాసెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.జొనాసెన్ పోరాటం వృధా98 పరుగుల లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ హీట్ తడబడింది. ఆ జట్టులో జెస్ జోనాసెన్ (44 నాటౌట్), నికోలా హ్యాంకాక్ (13 నాటౌట్) ఎవ్వరూ రాణించలేదు. వీరిద్దరు కాక జార్జియా రెడ్మేన్ (16) రెండంకెల స్కోర్ చేసింది. రెనెగేడ్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 2, చారిస్ బెక్కర్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, సోఫీ మోలినెక్స్, డియాండ్ర డాటిన్ తలో వికెట్ పడగొట్టారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్‌కు ఇది తొలి టైటిల్. -
ఫించ్ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..!
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (జనవరి 22) పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ (35 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. స్కార్చర్స్ నిర్ధేశించిన 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఫించ్ వీరోచితంగా పోరాడినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫించ్‌కు జతగా షాన్ మార్ష్ (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్స్), విల్ సదర్లాండ్ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) పోరాడినప్పటికీ మెల్బోర్న్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. Run fest at Perth, over 400 plus runs scored. Melbourne Renegades fell 10 runs short, great win for Perth Scorchers as they hold on as table toppers in BBL 12.#BBL12 #CricTracker pic.twitter.com/2ss6uBZcYh — CricTracker (@Cricketracker) January 22, 2023 ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఫించ్ చాలా రోజుల తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని ఇష్టం వచ్చినట్లు బాదుతూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఆండ్రూ టై వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 31 పరుగులు పిండుకుని ప్రత్యర్ధిని గడగడలాడించాడు. Aaron Finch smashed 31 runs against Andrew Tye in the 18th over. Sensational stuff!#MelbourneRenegades #AaronFInch #AndrewTye pic.twitter.com/Ks6asNijvM — CricTracker (@Cricketracker) January 22, 2023 అయితే 19వ ఓవర్లో కేవలం 8 పరుగులే రావడంతో మెల్బోర్న్ ఓటమి ఖరారైంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని ఫించ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఎడాపెడా ఫోర్, సిక్సర్ బాది 18 పరుగులు రాబట్టాడు. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్ నిర్ణీత ఓవర్లలో 202/5 స్కోర్ వద్ద ఆగిపోయింది. పెర్త్ బౌలర్లలో టర్నర్ 2, డేవిడ్ పెయిన్, ఆండ్రూ టై, ఆరోన్ హర్డీ తలో వికెట్ పడగొట్టారు. .@AaronFinch5 with a huge six🔥pic.twitter.com/HiqnPl1d7u — CricTracker (@Cricketracker) January 22, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్.. ఓపెనర్లు స్టీవీ ఎస్కినాజీ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), బాన్‌క్రాఫ్ట్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ గెలుపుతో పెర్త్ పాయింట్ల పట్టికతో అగ్రస్థానాన్ని (14 మ్యాచ్‌ల్లో 11 విజయాలతో 22 పాయింట్లు) మరింత పటిష్టం చేసుకుంది. మెల్బోర్న్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 7 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని నాలుగో స్థానంలో ఉంది. సిడ్నీ సిక్సర్స్ (19 పాయింట్లు), బ్రిస్బేన్ హీట్ (13), సిడ్నీ థండర్ (12), అడిలైడ్ స్ట్రయికర్స్ (10), హోబర్ట్ హరికేన్స్ (10), మెల్బోర్న్ స్టార్స్ (6) వరుసగా 2, 3, 5, 6, 7, 8 స్థానాల్లో ఉన్నాయి. -
హ్యాట్రిక్ వృధా.. అర డజన్ సిక్సర్లు కొట్టి గెలిపించిన రసెల్
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా మెల్బోర్న్ రెనగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్లు ఇవాళ (డిసెంబర్ 21) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. టామ్ రోజర్స్ (4/23), అకీల్ హొసేన్ (3/26) ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/18) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా (29), సామ్ బిల్లింగ్స్ (25), పీయర్సన్ (45) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం 139 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ టీమ్‌ను ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నెసర్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి (4/32) భయపెట్టాడు. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టిన నెసర్.. అదే ఓవర్ ఆఖరి బంతికి మరో వికెట్‌ను, ఆతర్వాత మూడో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. నెసర్ ధాటికి మెల్బోర్న్ 2.2 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. Just admiring this shot 😍 pic.twitter.com/G6ljSi7q2J — Melbourne Renegades (@RenegadesBBL) December 21, 2022 అయితే ఆరో స్థానంలో బరిలోకి దిగిన విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఆరోన్ ఫించ్ (43 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), అకీల్ హొసేన్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అర డజన్ సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్ ప్రత్యర్ధి చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని మెల్బోర్న్ రెనెగేడ్స్‌ను 4 వికెట్ల తేడాతో గెలిపించాడు. రసెల్ మెరుపు ఇన్నింగ్స్ హవాలో నెసర్ హ్యాట్రిక్ వృధా అయిపోయింది. బ్రిస్బేన్ బౌలర్లలో నెసర్తో పాటు మార్క్ స్టీకీట్ (2/23) వికెట్లు దక్కించుకున్నాడు. జేమ్స్ బాజ్లే బౌలింగ్‌లో రసెల్ కొట్టిన 103 మీటర్ల సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కాగా, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనగేడ్స్ జట్టు 1400 రోజుల తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. -
BBL: మరోసారి రెనెగేడ్స్‌తో జట్టు కట్టిన భారత కెప్టెన్!
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల బిగ్‌బాష్ టి20 క్రికెట్ లీగ్ ఎనిమిదో ఎడిషన్‌లో భాగం కానుంది. ఈ మేరకు ‘మెల్బోర్న్ రెనెగేడ్స్’ జట్టుతో మరోసారి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని రెనెగేడ్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కాగా ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లో భాగంగా హర్మన్‌ప్రీత్ కౌర్ గత సీజన్లోనూ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో 33 ఏళ్ల హర్మన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. 406 పరుగులు సాధించడంతో పాటుగా 15 వికెట్లు పడగొట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి హర్మన్‌ను తమ జట్టులో చేర్చుకోనుంది రెనెగేడ్స్. ఈ విషయం గురించి హర్మన్‌ప్రీత్ కౌర్ రెనెగేడ్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. మరోసారి ఈ జట్టుకు ఆడనుండటం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. కాగా మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో హర్మన్ భారత మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. వీళ్లు సైతం.. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) ఆడారు. ఈ లీగ్‌లో గత సీజన్‌తో జెమీమా తొలిసారి బరిలోకి దిగగా.. గతంలో సిడ్నీ థండర్‌కు ఆడిన హర్మన్ రెనెగేడ్స్‌కు మారింది. వచ్చే సీజన్లోనూ రెనెగేడ్స్‌కు ప్రాతినిథ్యం వహించనుంది. చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ Sri Lanka vs India: మెరిసిన దీప్తి, రేణుక It's official 😍#GETONRED pic.twitter.com/yPnUOkEH43 — Renegades WBBL (@RenegadesWBBL) July 4, 2022 -
డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన బౌలర్
బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్) అద్భుత ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ రెనెగేడ్స్ లెగ్ స్పిన్నర్ కామెరాన్ బోయ్స్ డబుల్ హ్యాట్రిక్‌తో మెరిశాడు. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన బోయ్స్.. ఓవరాల్‌గా టి20 క్రికెట్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన 10వ క్రికెటర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఆఖరి బంతికి అలెక్స్ హేల్స్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ వేసిన బోయ్స్ వరుస మూడు బంతుల్లో జాసన్ సంఘా, అలెక్స్ రాస్, డేనియల్ సామ్స్‌లను వెనక్కి పంపాడు. చదవండి: వికెట్ తీసి వింత సెలబ్రేషన్‌తో మెరిసిన బౌలర్ అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు అందుకున్నాడు. అయితే అలెక్స్ రోస్‌ను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించిన బోయ్స్.. బీబీఎల్ ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బంతికే మరో వికెట్ తీసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఇక తాను వేసిన మూడో ఓవర్లో మరో వికెట్ తీసిన బోయ్స్.. ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబుల్ హ్యాట్రిక్ అంటే.. సాధారణంగా హ్యాట్రిక్ అంటే మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీయడం అని అందరికి తెలుసు. ఇక డబుల్ హ్యాట్రిక్ అంటే వరుసగా ఆరు వికెట్లు తీయడమని క్రికెట్ భాషలో అర్థం. కానీ ఆస్ట్రేలియా క్రికెట్లో మాత్రం.. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ పేరుతో పిలుస్తున్నారు. ఒక ఓవర్ చివరి బంతికి వికెట్.. తర్వాతి ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు.. ఓవరాల్‌గా 1,2,3.. లేదా 2,3,4 వికెట్లను డబుల్ హ్యాట్రిక్‌గా కౌంట్ చేయడం అక్కడ ఆనవాయితీ. ఇక ఐదు వరుస బంతుల్లో ఐదు వికెట్లు తీస్తే దానిని ట్రిపుల్ హ్యాట్రిక్ అని పేర్కొంటారు. చదవండి: విండీస్ ప్లేయర్ "సూపర్ మ్యాన్ క్యాచ్"కు సలాం కొడుతున్న నెటిజన్లు We still can't believe this happened!! A double hattie from Cameron Boyce!! #BBL11 pic.twitter.com/fQWsFakSnx — KFC Big Bash League (@BBL) January 19, 2022 -
BBL: ‘బిగ్‌బాష్’ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా...
Unmukt Chand- BBL: ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ టి20 లీగ్ టోర్నీలో మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఉన్ముక్త్ చంద్ గుర్తింపు పొందాడు. హోబర్ట్ హరికేన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఉన్ముక్త్ బరిలోకి దిగి ఆరు పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆరోన్ ఫించ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా 2012లో ఉన్ముక్త్ కెప్టెన్సీలో టీమిండియా అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లకే విదేశీ టి20 లీగ్‌లలో ఆడే అర్హత ఉంది. దాంతో 28 ఏళ్ల ఉన్ముక్త్ గత ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం బీబీఎల్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: Glenn Maxwell: 'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' Seymour is smokin' them 🔥pic.twitter.com/WwKXFn6bW7 — Melbourne Renegades (@RenegadesBBL) January 18, 2022 -
రెండు సెంచరీలు ఒకే తరహాలో.. అరుదైన ఫీట్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సంచలన ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ మెక్ డెర్మోట్ వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌పై సెంచరీ బాదిన అతను బీబీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సాధించాడు. అయితే మెక్ డెర్మోట్ రెండు సెంచరీలను ఒకే తరహాలో అందుకోవడం విశేషం. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 95 పరుగులకు చేరుకున్న మెక్ డెర్మోట్.. కేన్ రిచర్డ్సన్ వేసిన బంతిని స్టాండ్స్‌లో కి బాది సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెక్ డెర్మోట్కు మూడో సెంచరీ కాగా.. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. చదవండి: BBL 2021: కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి కాగా ఇంతకముందు అడిలైడ్ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లోనూ సిక్స్‌తోనే సెంచరీ సాధించాడు. తద్వారా బీబీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలను సిక్సర్లతో పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా మెక్ డెర్మోట్ చరిత్ర సృష్టించాడు. ఇక హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. HISTORY MADE 🏆 Ben McDermott just made back-to-back 💯 for the first time in #BBL history! 📺 Watch #BBL11 on @Foxtel CH 503 or stream on @kayosports: https://t.co/gt5iNQ2w7F 📝 Blog: https://t.co/2QI8PpTMaE 🔢 Match Centre: https://t.co/QMgYF6q7lt pic.twitter.com/MFuEmYMWAw — Fox Cricket (@FoxCricket) December 29, 2021 That magic moment 💯 Ben McDermott brings up his second Big Bash century in STYLE 😎 #BBL11 pic.twitter.com/XsZP6cwY8y — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
స్టన్నింగ్ క్యాచ్.. ప్రేక్షకులకు దిమ్మతిరిగింది
Fielder Stunning Catch Shock Audience BBL 2021.. బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్ ఆటగాడు ఫ్రేజర్-మెక్‌గుర్క్ సూపర్ విన్యాసంతో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌ను జహీర్ ఖాన్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్టంప్స్ మీదకు వేయగా.. అడిలైడ్ ఓపెనర్ జేక్ వెదర్లాండ్ మిడ్ వికెట్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. భారీ సిక్స్ ఖాయమనుకున్న వేళ 19 ఏళ్ల ఫ్రేజర్-మెక్‌గుర్క్ అద్భుతం చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకొని రివర్స్‌లో జిమ్నాస్ట్ చేస్తూ సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. అతని దెబ్బకు మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. ప్రేజ్ అద్భుత విన్యాసానికి మంత్ర ముగ్దులయ్యారు. కాగా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న ఫ్రేజర్‌ను చూసి జేక్ వెదర్లాండ్ ఆశ్చర్యపోయి పెవిలియన్ బాట పట్టాడు. చదవండి: వార్నీ ఎంత సింపుల్‌గా పట్టేశాడు.. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 2 పరుగుల తేడాతో విజాయన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మెకెంజీ హార్వే 56 పరుగులతో టాప్ స్కోర్ర్గా నిలవగా.. సామ్ హార్పర్ 33 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. హారీ నీల్సన్ 30, మాథ్యూ షార్ట్ 29 పరుగులు చేశారు. మెల్బోర్న్ బౌలర్లలో జహీర్ ఖాన్ 3 వికెట్లతో మెరిశాడు. చదవండి: Mitchell Santner: మ్యాచ్ ఆడలేదు.. హీరో అయ్యాడు; అవార్డు గెలిచాడు Jake Fraser-McGurk plucks an INSANE grab!! #BBL11 pic.twitter.com/YT18EE0BBR — KFC Big Bash League (@BBL) December 7, 2021 -
సూపర్ సెంచరీతో నాటౌట్ .. కానీ జట్టును గెలిపించలేకపోయింది
Smriti Mandhana Smash Maiden Century For Sydney Thunders But Lost Match.. వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బుధవారం సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ రెనీగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు టీమిండియా వుమెన్ ప్లేయర్స్ దుమ్మురేపారు. స్మృతి మంధాన సూపర్ సెంచరీతో మెరవగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్‌లో మెరుపులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో తన ప్రతిభను చూపించింది. అయితే స్మృతి మంధాన సూపర్ సెంచరీ సాధించినప్పటికి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయింది. సిడ్నీ థండర్స్‌కు చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. మెల్బోర్న్ రెనీగేడ్స్ బౌలర్ హర్మన్‌ప్రీత్ మ్యాజిక్ బౌలింగ్ ప్రదర్శించడంతో నాలుగు పరుగులతో ఓటమి పాలైంది. చదవండి: Smriti Mandhana: మెరిసిన స్మృతి మంధాన .. సిడ్నీ థండర్స్ ఘన విజయం తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనిగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (55 బంతుల్లో 88 పరుగులు, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఎవెలిన్ జోన్స్ 42, జెస్ డఫిన్ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. స్మృతి మంధాన 64 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు నాటౌట్ ఊచకోత కోసినప్పటికి ఆఖరి ఓవర్లో ఒత్తిడి తట్టుకోలేక జట్టును గెలిపించలేకపోయింది. ప్రస్తుతం స్మృతి మంధాన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Wasim Jaffer: అస్సలు గ్యాప్ లేదుగా.. ఒకటి పోతే మరొకటి A beautiful innings! Congratulations, @mandhana_smriti 🤩 #WBBL07 pic.twitter.com/Jwo4E1fN3X — Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021 Phoebe Litchfield gave it everything on the rope but it's another six for Harmanpreet Kaur! Watch LIVE: https://t.co/e5UVmQR3sL #WBBL07 pic.twitter.com/X3lZJjjf8t — Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021 -
వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ సిక్సర్ల వర్షం
Harmanpreet Kaur Sensational Innings WBBL: వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్ 2021లో మెల్బోర్న్ రెనిగేడ్స్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. 46 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్.. అంతకముందు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో మెరిసింది. ఓవరాల్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్మన్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ సందర్భంగా జేమిమా రోడ్రిగ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ను ''అకా హర్మన్‌ప్రీత్ థోర్'' అంటూ ట్విటర్లో కామెంట్ చేసింది. చదవండి: క్యాచ్ పట్టేస్తారని మధ్యలో దూరింది; ఔట్ కాదా.. ఇదెక్కడి రూల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటింగ్‌లో వాన్ నికెర్క్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వోల్వార్డట్ 47 పరుగులతో రాణించింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనిగేడ్స్ హర్మన్ ఇన్నింగ్స్‌తో 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలింగ్‌లో మేఘన్ స్కట్ రెండు, తమలియా మెక్‌గ్రాత్, సారా కోట్ చెరో వికెట్ తీశారు. చదవండి: Virender Sehwag: నమీబియాకు, టీమిండియాకు తేడా తెలియలేదు aka Harmanpreet Thor. A mighty innings! (thanks for the new nickname, @JemiRodrigues 😄)#GETONRED pic.twitter.com/5PBZYHGAtY — Renegades WBBL (@RenegadesWBBL) October 31, 2021 -
వైరల్ : టాస్ వేశారు.. కాని కాయిన్‌తో కాదు
పెర్త్ : క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేయడం ఆనవాయితీ. టాస్ వేయడానికి ఎక్కడైనా కాయిన్‌ను ఉపయోగిస్తారు.. కానీ బిగ్‌బాష్ లీగ్‌లో కాయిన్‌కు బదులు బ్యాట్‌ను ఫ్లిప్ చేసి టాస్ ఎంచుకోవడం వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరుగుతున్న మ్యచ్‌లో చోటుచేసుకుంది. టాస్ సమయంలో కాయిన్‌కు బదులుగా బ్యాట్‌ను వాడారు. మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ బ్యాట్ ఫ్లిప్‌తో టాస్ గెలిచిన మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. (చదవండి: సెకన్ల వ్యవధిలో సూపర్ రనౌట్) In Perth, the @RenegadesBBL have won the bat flip and have elected to BOWL first against the @ScorchersBBL #BBL10 https://t.co/OvGFGccQuj — cricket.com.au (@cricketcomau) January 3, 2021 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కొలిన్ మున్రో 52 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ రెనెగేడ్స్ పరాజయం ముంగిట నిలిచింది. ఇప్పటికే 9 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 59 పరుగులతో ఓటమి అంచున నిలిచింది. -
స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో మెకేంజీ హార్వే అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. హార్వే అందుకున్న క్యాచ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌నే కాదు బౌలర్‌ను కూడా షాక్‌కు గురిచేసింది. కష్టసాధ్యమైన క్యాచ్‌ను హార్వే సూపర్డైవ్ చేసి అందుకున్న తీరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. హార్వే సాధించిన ఈ ఫీట్ సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జరిగింది. (చదవండి : వైరల్ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని) మెల్బోర్న్ రెనేగేడ్స్ బౌలర్ మిచెల్ పెర్రీ వేసిన ఫుల్‌టాస్ బంతిని అలెక్స్ హేల్స్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. ఆ షాట్ తీరు చూస్తే ఎవరైనా ఫోర్ అనుకుంటారు. కానీ బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న హార్వే ముందుకు డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. హార్వే క్యాచ్‌తో షాక్‌కు గురైన హేల్స్ నిరాశగా వెనుదిరగగా.. బౌలర్ పెర్రీ ఆశ్చర్యం వక్తం చేస్తూ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. అమేజింగ్ హార్వే.. ఇది క్యాచ్ ఆఫ్ ది టోర్న్‌మెంట్ అవుతుందా? హార్వేను బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది వరల్డ్ అనొచ్చా? దీనిపై మీ కామెంట్ ఏంటి అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా మ్యాచ్‌కు ముందు వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు ఆటను కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 17 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నబీ 33 పరుగులతో రాణించాడు. (చదవండి: క్యారీ స్టన్నింగ్ క్యాచ్.. వహ్వా అనాల్సిందే) అనంతరం 20 ఓవర్లలో 173 పరుగుల సవరించిన లక్ష్యాన్ని సిడ్నీ థండర్స్ ముందు ఉంచారు. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, అలెక్స్ హేల్స్ దాటిగా ఆడడంతో సిడ్నీ థండర్స్ వేగంగా పరుగులు సాధించింది. హేల్స్ వెనుదిరిగిన అనంతరం మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగింది. అప్పటికి సిడ్నీ థండర్స్ 12 ఓవర్లలో 117 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో డక్‌వర్త్ లుయీస్ పద్దతిలో సిడ్నీ థండర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. The catch of the tournament!? The best fielder in the world!? What a grab...#BBL10 | @BKTtires pic.twitter.com/ByRq1ecBCL — cricket.com.au (@cricketcomau) January 1, 2021 -
‘దీనినే తెలుగులో దురదృష్టమంటారు’
బ్యాట్స్‌మన్ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదు.. బౌలర్ గొప్పదనమేమి లేదు.. ఫీల్డర్ చాకచక్యంగానూ వ్యవహరించలేదు.. కానీ అవతలి ఎండ్‌లో నాన్ స్ట్రయికర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా సిడ్నీ సిక్సర్స్-మెల్బోర్న్ రెనిగెడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెల్బోర్స్ బౌలర్ విల్ సదర్లాండ్ విసిరిన బంతిని సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్ బౌలర్ వైపు బలంగా కొట్టాడు. అయితే బ్యాట్స్‌మన్ షాట్ తప్పి బంతి నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆ బంతిని బౌలర్ అందుకోవడం విఫలమయ్యాడు. కానీ అనూహ్యంగా బౌలర్ జారవిడిచిన ఆ బంతిన నాన్స్ట్రయిక్లో ఉన్న వికెట్లను ముద్దాడింది. అప్పటికే క్రీజు వదిలి ఉన్న నాన్‌స్ట్రయికర్ జేమ్స్ విన్సే రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అసలేం జరిగిందో తెలియక విన్సేతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే రిప్లైలో క్లియర్‌గా చూశాక జేమ్స్ విన్సే భారంగా క్రీజు వదిలివెళ్లాడు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ‘దీనినే తెలుగులో దురదృష్టమంటారు’అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేయగా.. ‘ఈ బీబీఎల్‌లో విన్సే చుట్టు దురదృష్టం వైఫైలా తిరుగుతోంది’అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇక తాజా బీబీఎల్ సీజన్లో ఈ ఇంగ్లీష్ క్రికెటర్ విన్సేకు ఏదీ కలసిరావడం లేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన విన్సే 25.75 సగటుతో 309 పరుగులు సాధించి నిరుత్సాహపరుస్తున్నాడు. అయితే తన చివరి రెండు మ్యాచ్‌ల్లో 41 నాటౌట్, 51 పరుగులతో ఫామ్‌లోకి వచ్చినట్టు కనపడ్డాడు. కాగా, మెల్బోర్న్ మ్యాచ్‌లో 13 బంతుల్లో 22 పరుగులు చేసి సత్తా చాటుతున్న సమయంలో దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Could James Vince BE any more unlucky?? 😱#BBL09 pic.twitter.com/fJDssdx2FA — KFC Big Bash League (@BBL) January 25, 2020 చదవండి: ‘ఇప్పుడే ఐపీఎల్లో ఆడటం అవసరమా?’ పరుగు కోసం తాపత్రయం.. తప్పిన ప్రమాదం -
పరుగు కోసం తాపత్రయం.. తప్పిన ప్రమాదం
మెల్బోర్న్: మిగతా ఆటలతో పోలిస్తే క్రికెట్లో కాస్త రిస్క్ తక్కువ అని కొందరి అభిప్రాయం. అయితే ఏ మాత్రం అదుపు తప్పిన, అలసత్వం ప్రదర్శించినా ఊహకు కూడా అందని పరిణామాలు చోటు చేసుకుంటాయి. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. బిగ్‌బాష్‌లీగ్ (బీబీఎల్) భాగంగా మెల్బోర్న్ రెనిగెడ్స్ బ్యాట్స్‌మన్ సామ్ హార్పర్ పరుగు తీసే క్రమంలో బౌలర్‌ను ఢీ కొట్టి ఆస్పత్రిపాలయ్యాడు. అయితే ఈ ఘటన జరిగిన తీరు చూశాక సహచర ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బీబీఎల్‌లో భాగంగా మంగళవారం హార్బర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ రెనిగెడ్స్ జట్ల మధ్య హోరాహోరు పోరు జరిగింది. అయితే మెల్బోర్న్ బ్యాటింగ్ సందర్భంగా హరికేన్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ సామ్ హార్పర్ మిడాఫ్ మీదుగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే మిడాఫ్‌లో ఉన్న ఫీల్డర్ బంతిని అందుకోవడాన్ని గమనించిన హార్పర్ ఎదురుగా ఉన్న బౌలర్‌ను చూసుకోకుండా పరిగెత్తాడు. అయితే బంతిని అందుకోవడానికి వికెట్ల దగ్గరే ఉన్న ఎల్లిస్‌ను హార్పర్ బలంగా ఢీ కొట్టి గాల్లొకి ఎగిరాడు. అయితే గాల్లోకి ఎగిరి కిందపడే సమయంలో హార్పర్ మెడ బలంగా మైదానాన్ని తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడు. డాక్టర్లు వచ్చి హార్పర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే అతడికి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 😨 Nasty collision in the middle between Sam Harper and Nathan Ellis. Play has stopped while the docs take a look at Harper #BBL09 pic.twitter.com/yDARqnMtRl — KFC Big Bash League (@BBL) January 21, 2020 ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. హార్పర్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనిగెడ్స్ 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెనిగేడ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చదవండి: కాంబ్లికి సచిన్ సవాల్ స్టార్క్‌ను ట్రోల్ చేసిన భార్య -
పంజాబ్ ఊపిరి పీల్చుకో.. అతడొస్తున్నాడు
హైదరాబాద్: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా పెర్త్ స్కాచర్స్ తరుపున ఆడుతున్న ఈ పేసర్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో అందరినీ షాక్‌కు గురిచేశాడు. బీబీఎల్‌లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్-పెర్త్ స్కాచర్స్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆ సంఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ క్రిస్టియాన్ లాంగాన్ వైపు భారీ షాట్ కొట్టాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జోర్డాన్ గాల్లోకి అమాంతం ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన క్రిస్టియాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది. దీంతో ఈ స్టన్నింగ్ క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇక తాజాగా ముగిసిని ఐపీఎల్ వేలంలో క్రిస్ జోర్డాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 3 కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌కు జోర్డాన్ రూపంలో బౌలర్‌తో పాటు మంచి ఫీల్డర్ దొరికాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘పంజాబ్ ఊపిరి పీల్చుకో.. మిమ్మల్ని గెలిపించడానికి జోర్డాన్ వస్తున్నాడు’ అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ 185 పరుగులకే పరిమితమై ఓటమిచవిచూసింది. ఐపీఎల్లో అంతగా మంచి రికార్డులు లేని జోర్డాన్ ఈసారి పంజాబ్ తరుపున ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. తాజాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని నయా పంజాబ్ జట్టు వచ్చే సీజన్లో శక్తిమేర పోరాడాలని భావిస్తోంది. Chris Jordan, just wow! 🤯 pic.twitter.com/yVH67BZpdq — ICC (@ICC) December 21, 2019 -
బిగ్‌బాష్ విజేత రెనెగేడ్స్
మెల్బోర్న్: ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీ టైటిల్‌ను తొలిసారి మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో రెనెగేడ్స్ జట్టు మెల్బోర్న్ స్టార్స్‌పై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెల్బోర్న్లోని డాక్‌ల్యాండ్స్ స్టేడియంలో అదే నగరానికి చెందిన రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగిన తుది పోరులో చివరకు రెనెగేడ్స్దే పైచేయి అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రెనెగేడ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 145 పరుగులు చేయగా... అనంతరం స్టార్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది. ముందుగా రెనెగేడ్స్ తరఫున టామ్ కూపర్ (35 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేనియల్ క్రిస్టియాన్ (30 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్‌కు అభేద్యంగా 58 బంతుల్లో 80 పరుగులు జోడించి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 91 పరుగులే. అయితే చివరి 5 ఓవర్లలో రెనెగేడ్స్ 54 పరుగులు రాబట్టింది. అనంతరం సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన స్టార్స్‌కు ఓపెనర్లు బెన్ డంక్ (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, 1 సిక్స్), మార్కస్ స్టొయినిస్ (38 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 77 బంతుల్లో 93 పరుగులు జోడించారు. చేతిలో 10 వికెట్లు ఉండగా... గెలుపు కోసం స్టార్స్ మిగిలిన 43 బంతుల్లో 53 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ దశలో ట్రైమెన్ (2/21), బాయ్స్ (2/30), క్రిస్టియాన్ (2/33) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వీరి దెబ్బకు స్టార్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా ఆ జట్టు 43 బంతుల్లో 7 వికెట్లు చేజార్చుకొని 39 పరుగులే చేయగలిగింది. ప్రధాన ఆటగాళ్లు హ్యాండ్స్కోంబ్ (0), మ్యాక్స్‌వెల్ (1), మ్యాడిసన్ (6), డ్వేన్ బ్రేవో (3) విఫలమయ్యారు. క్రిస్టియాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. 2011లో ప్రారంభమైన బిగ్‌బాష్ లీగ్‌లో ఇది ఎనిమిదో టోర్నీ. వీటిలో పెర్త్ స్కార్చర్స్ మూడు సార్లు విజేతగా నిలిచింది. సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రయికర్స్ ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి. -
19 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు
మెల్బోర్న్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెల్బోర్న్ రెనిగేడ్స్ విజేతగా అవతరించింది. ఆదివారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో మెల్బోర్న్ రెనిగేడ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇది రెనిగేడ్స్‌కు తొలి బీబీఎల్ టైటిల్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్బోర్న్ స్టార్స్ తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అరోన్ ఫించ్ నేతృత్వలోని రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. రెనిగేడ్స్ టాపార్డర్ ఘోరంగా విఫలమైనా ఆరో స్థానంలో వచ్చిన టామ్ కూపర్(43 నాటౌట్), ఏడో స్థానంలో వచ్చిన డానియల్ క్రిస్టియన్(38 నాటౌట్)లు ఆదుకున్నారు. దాంతో గౌరవప్రదమైన స్కోరును రెనిగేడ్స్ బోర్డుపై ఉంచింది. కాగా,ఆపై సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్‌కు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు బెన్ డంక్(57), మార్కస్ స్టోనిస్(39)లు తొలి వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును పటిష్ట స్థితిలో నిల్పారు. ఆ తర్వాత ఆడమ్ జంపా(17) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. ప్రధానంగా 19 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 7 వికెట్లను చేజార్చుకుని పరాజయం కొనితెచ్చుకుంది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసిన మెల్బోర్న్ స్టార్స్ ఓటమి పాలైంది. రెనిగేడ్స్ బౌలర్లలో డానియల్ క్రిస్టియన్, కామెరూన్ బోయ్సే, క్రిస్ ట్రిమాన్లు తలో రెండు వికెట్లు సాధించారు. -
క్రికెట్లో కనీవినీ ఎరుగని రనౌట్
మెల్బోర్న్: క్రికెట్లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి చేరుకోలేకపోతే రనౌట్‌గా నిష్క్రమిస్తూ ఉంటారు. చేజింగ్ సమయంలో అందులోనూ చివర ఓవర్లలో ప్రతీ పరుగు ముఖ్యమైనదే. ఈ సమయంలో రనౌట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. రనౌట్ అయిన విధానం పట్ల బ్యాట్స్‌మెన్‌పై ఒక్కోసారి జాలి చూపిస్తే.. మరికొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తాం. ఆస్ట్రేలియాలో జరగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో జరిగిన సిల్లీ రనౌట్ అందిరిలోనూ నవ్వు తెప్పిస్తోంది. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ ధండర్స్- మెల్బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వినూత్న రనౌట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్-సిడ్నీ థండర్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన మెల్బోర్న్, నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సీడ్నీ లక్ష్య చేదనలో పూర్తిగా విఫలమైంది. దీంతో 19.1 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది. అయితే సిడ్నీ ఇన్నింగ్స్ 18.3 ఓవర్లో జోనాథన్ కుక్, గురిందర్ సంధు ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో కుక్కు బౌలర్ వేసిన బంతిని ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న సంధును ఢీకొన్నాడు. దీంతో బౌలర్ హ్యారీ గుర్నే వారిద్దరి మధ్య నుంచి వెళ్లి రనౌట్ చేశాడు. దీంతో బ్యాట్స్‌మన్ కుక్ ఒక్క సారిగా షాక్‌కు గురై.. భారంతో మైదానాన్ని వీడాడు. -
క్రికెట్లో కనీవినీ ఎరుగని రనౌట్
-
మహిళల బిగ్‌బాష్‌లో హైడ్రామా
-
బెయిల్స్ పడగొట్టడం మరచిపోయారు!
గీలాంగ్: మహిళల బిగ్‌బాష్‌లో భాగంగా బుధవారం మెల్బోర్న్ రెనిగేడ్స్-సిడ్నీ సిక్సర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి బంతికి రెనిగేడ్స్ వికెట్ కీపర్ ఎమ్మా ఇంగ్లిస్ బెయిల్స్ పడగొట్టడం మరచిపోయి గెలిచామన్న సంబరాల్లో మునిగిపోవడంతో హైడ్రామా నెలకొంది. వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఆపై 121 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ కడవరకూ పోరాడుతూ విజయం దిశగా దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే చివరి బంతికి సిడ్నీ సిక్సర్ విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న సిక్సర్స్ క్రీడాకారిణి షారా అలే ఫైన్ లెగ్ మీదుగా షాట్ కొట్టింది. ఆ తరుణంలోనే సిక్సర్స్ పరుగును పూర్తి చేసుకుని రెండో పరుగుకు సిద్దమైంది. కాగా, ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ బ్రిట్ అందుకుని తమ కీపర్ ఎమ్మాకు వేగంగా విసిరడంతో రెనిగెడ్స్ విజయం దాదాపు ఖాయమైంది. అక్కడ వికెట్లను పడగొట్టడం మరిచిపోయిన ఎమ్మా .. గెలిచామన్న సంబరాల్లో మునిగిపోయింది. అయితే రెండో పరుగు కోసం అప్పటికే కాచుకుని కూచున్న సిడ్నీ సిక్సర్స్ క్రీడాకారిణులు దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో నివ్వెరపోవడం రెనిగెడ్స్ వంతైంది. ఆ బంతి డెడ్ అయ్యిందనే రెనిగెడ్స్ వాదనను అంపైర్ తిరస్కరించడంతో మ్యాచ్ టై అయ్యింది. అలా ఆ మ్యాచ్ 'సూపర్ ఓవర్'కు దారి తీసింది. దానిలో భాగంగా ఇరు జట్లు ఆడిన ఎలిమినేటర్ ఓవర్లో రెనిగెడ్స్ విజయం సాధించి ఊపిరిపీల్చుకుంది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే మాత్రం కీపర్ చేసిన పొరపాటుకు రెనిగేడ్స్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. -
గేల్‌ను పక్కన పెట్టేశారు!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా టీవీ వ్యాఖ్యాతపై శృంగారపరమైన వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ వచ్చే ఏడాది జరిగే బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. క్రిస్ గేల్ ప్రాతినిథ్యం వహించే ఆస్ట్రేలియా ఫ్రాంచైజీ మెల్ బోర్న్ రెనగేడ్స్ అతన్ని పక్కన పెట్టేసింది. వచ్చే ఏడాది బిగ్ బాష్ లీగ్ సీజన్‌కు గేల్‌ను తీసుకోవడం లేదంటూ రెనగేడ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ కొవంట్రీ తాజాగా స్పష్టం చేశారు. 2016-17 సీజన్ లో గేల్ తో ఒప్పందాన్ని కొనసాగించడం లేదని కొవంట్రీ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బిగ్ బాష్ సందర్భంగా ఓ టీవీ జర్నలిస్టుతో గేల్ అసభ్యకరంగా ప్రవర్తించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ అంశంపై అప్పట్లోనే మండిపడ్డ ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు గేల్‌ను బిగ్ బాష్‌లో ఆడకుండా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా,గత ఏప్రిల్‌లో గేల్ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. బిగ్ బాష్ లీగ్‌లో గేల్ చేసిన వ్యాఖ్యలతో సీఏకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. వచ్చే సీజన్లో బిగ్ బాష్ లీగ్ లో గేల్ ఆడేందుకు ఎటువంటి అభ్యంతరాలూ లేవంటూ పేర్కొంది. ఫ్రాంచైజీల ఇష్ట ప్రకారమే గేల్ బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనడం ఆధారపడుతుందని సీఏ పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మెల్ బోర్న్ రెనగేడ్స్ గేల్ ను పక్కను పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఇంగ్లండ్ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా వ్యాఖ్యానించి సరికొత్త వివాదానికి తెరలేపాడు గేల్. కొన్ని రోజుల క్రితం బ్రిటిష్ దినపత్రిక 'ద టైమ్స్' మహిళా జర్నలిస్టు చార్లెట్ ఎడ్వర్డ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నువ్వు థ్రిసమ్‌కు (ముగ్గురు కలిసి శృంగారానికి) పాల్పడ్డవా? అని వెకిలిగా అడిగాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ కౌంటీల్లో సోమరసెట్ తరపున ఆడే గేల్‌కు ఆ దేశంలో చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
మహిళా ప్రజెంటర్కు క్రిస్ గేల్ సారీ!
అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మహిళా టీవీ ప్రజెంటర్కు వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ సారీ చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలు జోక్ గా తీసుకోవాలని, వాటిని సీరియస్ గా తీసుకోవద్దని ఆయన అన్నాడు. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా మెల్బోర్న్ రెనగేడ్స్ తరఫున ఆడిన క్రిస్ గేల్ మ్యాచ్ అనంతరం టెన్ స్పోర్ట్స్ క్రికెట్ ప్రజెంటర్ మెల్ మెక్లాఫ్లిన్ తో అసభ్యంగా మాట్లాడాడు. 'నీ కళ్లు అందంగా ఉన్నాయి. మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం తాగేందుకు వెళ్దామా.. సిగ్గుపడకు బేబీ' అంటూ ఆయన పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలపై బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ (బీబీఎల్), ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించాయి. క్రిస్ గేల్ వ్యాఖ్యలు అవమానకరమైనవని బీబీఎల్ వ్యాఖ్యానించింది. క్రిస్ గేల్ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, వాటిని తాము జోక్ గా తీసుకోవడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేన్ మెక్ గ్రాత్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయనపై ఆంక్షలు విధించే అవకాశముందని ఆయన సంకేతాలిచ్చారు. వివాదం చినికిచినికి ముదురుతుండటంతో క్రిస్ గేల్ మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ప్రజెంటర్ మెల్ పట్ల తాను అవమానకర, అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ ఆమె తన వ్యాఖ్యలకు బాధపడితే క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను జోక్ గా తీసుకోవాలని, వాటిని పెద్దగా పట్టించుకోవద్దని ఆయన పేర్కొన్నారు.